Apple Watch Series 7 : ఫోన్లే కాదు.. వాచ్‌లు కూడా పేలుతాయి జాగ్రత్త.. ఆపిల్ వాచ్ సిరీస్ 7 పేలింది..!

Apple Watch Series 7 : స్మార్ట్‌ఫోన్లే కాదు.. స్మార్ట్‌వాచ్‌లు కూడా పేలుతాయి జాగ్రత్త.. బ్యాటరీలతో పనిచేసే గాడ్జెట్ల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి బ్యాటరీలతో కూడిన గాడ్జెట్‌లు చిన్నవిగా ఉంటాయి కచ్చితంగా అరుదైనవి కూడా. పగిలిపోయే, పేలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.

Apple Watch Series 7 : ఫోన్లే కాదు.. వాచ్‌లు కూడా పేలుతాయి జాగ్రత్త.. ఆపిల్ వాచ్ సిరీస్ 7 పేలింది..!

Apple Watch Series 7 explodes, sends man hurrying to hospital

Apple Watch Series 7 : స్మార్ట్‌ఫోన్లే కాదు.. స్మార్ట్‌వాచ్‌లు కూడా పేలుతాయి జాగ్రత్త.. బ్యాటరీలతో పనిచేసే గాడ్జెట్ల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి బ్యాటరీలతో కూడిన గాడ్జెట్‌లు చిన్నవిగా ఉంటాయి కచ్చితంగా అరుదైనవి కూడా. పగిలిపోయే, పేలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా ఈ సమస్యను చూస్తుంటాం. ఇప్పుడు ఒక చిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్మార్ట్‌వాచ్‌లు లేదా ఫిట్‌నెస్ బ్యాండ్‌లలో కూడా పేలుడు సంభవించవచ్చు. ఇటీవల ఆపిల్ వాచ్ వినియోగదారు సిరీస్ 7 వాచ్ వేడెక్కిందని, ఆ తర్వాత పేలినట్లు కనుగొన్నట్లు నివేదికలు సూచించాయి. ఈ సంఘటనతో వినియోగదారుకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, వాచీ వేడెక్కడం మెదలుకాగానే తన చేతి నుంచి తీసివేసినట్లు తెలిపింది.

Apple Watch Series 7 explodes, sends man hurrying to hospital

Apple Watch Series 7 explodes, sends man hurrying to hospital

గడియారంలో నుంచి పొగలు వ్యాపించాయి. బ్యాటరీలో ఉండే సీసం విషపూరితమని భయపడిన అతడు వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నివేదిక ప్రకారం.. ఒక వ్యక్తి తన ఆపిల్ వాచ్ 7 వేడెక్కిందని, ఆ తర్వాత పగిలిపోయిందని పేర్కొన్నాడు. ఆ వ్యక్తి Apple Watch 7 ధరించి ఉండగా.. డివైజ్ వేడెక్కుతున్నట్లు అతడికి అనిపించింది. వేడి పెరగడంతో వెంటనే ఆ స్మార్ట్‌వాచ్ నుంచి హై టెంపరేచర్ వార్నింగ్ కూడా వచ్చింది. స్మార్ట్‌వాచ్ వెనుక భాగంలో పగుళ్లు ఏర్పడడాన్ని గమనించిన వాచ్ యజమాని వెంటనే తన దాన్ని దూరంగా విసిరేశాడు. అనంతరం Apple సపోర్ట్‌కి కాల్ చేశాడు. ఆ డివైజ్‌కు దూరంగా ఉండాలని, Apple అతన్ని మళ్లీ సంప్రదించే వరకు దానిని టచ్ చేయరాదని సూచించింది. మరుసటి రోజు యజమాని మళ్లీ వాచ్ వైపు చూసినప్పుడు.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాచ్ డిస్‌ప్లే పగిలిపోయిందని కనుగొన్నాడు.

Apple Watch Series 7 explodes, sends man hurrying to hospital

Apple Watch Series 7 explodes, sends man hurrying to hospital

ఆ తర్వాత వాచీని తీయగానే పగిలిన శబ్దం వినిపించింది. యాపిల్ వాచ్ 7 యజమాని కిటికీలోంచి బయటకు విసిరే సమయంలోనే పగిలిపోయింది. పేలుడు ధాటికి ఆ వ్యక్తి మంచం కూడా కాలిపోయింది. సంఘటన తర్వాత అతను భయంతో ఆస్పత్రిని కూడా వెళ్లాడు. ఆపిల్ సపోర్ట్‌ను సంప్రదించి పరిస్థితి గురించి వివరించాడు. కంపెనీ చివరికి డివైజ్ పికప్‌ కోసం ఏర్పాటు చేసింది బ్యాటరీ పేలిపోవడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఆపిల్ ప్రొడక్టు లేదా స్మార్ట్ డివైజ్ పేలడం లేదా పగిలిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2021లో, ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి తన ఐఫోన్ X పేలడంతో ఆసుపత్రి పాలయ్యాడు. లిథియం-అయాన్ బ్యాటరీల పేలుడు అంత సాధారణం కాదు.. బ్యాటరీల లోపల ఉష్ణోగ్రతతో పరిసర ఉష్ణోగ్రత కారణంగా లేదా మరేదైనా కారణాల వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవించవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple Watch Ultra : ఈ ఆపిల్ వాచ్ అల్ట్రా.. ఎంత స్ట్రాంగ్ తెలుసా? సుత్తితో వాచ్‌పై బాదితే టేబుల్ విరిగిపోయింది..!