Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!

ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి స్మార్ట్ వాచ్ సిరీస్ 8 వస్తోంది. ఈ సరికొత్త మోడ్రాన్ స్మార్ట్ వాచ్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయట..

Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!

Apple Watch Series 8 Might Be Able To Detect If You Have A Fever

Apple Watch Series 8 : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి స్మార్ట్ వాచ్ సిరీస్ 8 వస్తోంది. ఈ సరికొత్త మోడ్రాన్ స్మార్ట్ వాచ్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయట.. ముఖ్యంగా బాడీలోని టెంపరేచ్ గుర్తించే సెన్సార్ కూడా ఉందట.. అది శరీరంలోని ఉష్ణోగ్రతను డిటెక్ట్ చేయగలదు. ఆపిల్ స్మార్ట్ వాచ్ సిరీస్ 8 ద్వారా జ్వరం ఉందో లేదో సులభంగా గుర్తించగలదని ఆపిల్ విశ్లేషకుడు బ్లూమ్ బెర్గ్ గుర్మాన్ పేర్కొన్నారు. ఈ కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 8 ముఖ్యంగా క్రీడాకారులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. శరీర ఉష్ణోగ్రతలలో వచ్చే స్పైక్‌లను సెన్సార్లు గుర్తిస్తాయి.

అయితే ఈ రీడింగ్‌లు ఖచ్చితంగా ఉండకపోవచ్చని నివేదిక చెబుతోంది. ఆపిల్ స్మార్ట్‌వాచ్ శరీరంలో అసాధారణమైన స్పైక్‌ను గుర్తిస్తే.. వెంటనే వైద్యున్ని సంప్రదించాలని లేదా థర్మామీటర్‌ ద్వారా శరీర ఉష్ణోగ్రతను చెక్ చేసుకోవాలని పేర్కొంది. ఆపిల్ ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ల్లో సరసమైన వెర్షన్ గా పేరొందిన Apple Watch SE 2022లో శరీర ఉష్ణోగ్రత సెన్సార్ ఉండకపోవచ్చునని నివేదిక తెలిపింది. ప్రాసెసింగ్ పవర్ పరిశీలిస్తే.. లేటెస్ట్ మోడల్‌లు కొత్త చిప్‌సెట్‌తో రానున్నాయి. ఆపిల్ వాచ్ 7 సిరీస్‌లో ఉన్న S7 నుంచి S8 S6 చిప్‌సెట్‌ని పోలి ఉంటుందని అంటున్నారు.

Apple Watch Series 8 Might Be Able To Detect If You Have A Fever (1)

Apple Watch Series 8 Might Be Able To Detect If You Have A Fever 

గ్లోబల్ చిప్‌సెట్ కొరత కారణంగా ఆపిల్ M1, M1 ప్రో, M1 అల్ట్రా, కొత్త M2 వంటి Mac చిప్‌సెట్‌లతో వచ్చింది. Apple Watch సిరీస్‌కు చిన్న అప్‌గ్రేడ్‌లు వస్తున్నాయి. M2 ప్రో, M2 మాక్స్, M2 అల్ట్రా M3 లాంచ్‌ను చూడవచ్చు. ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 లైనప్‌ల మాదిరిగానే స్మార్ట్‌వాచ్ ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌తో వస్తుందని రుమర్లు వినిపిస్తున్నాయి. ఆపిల్ వాచ్ 8 సిరీస్ ఇదే డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా. ప్రస్తుతం, ఆపిల్ వాచ్ మోడల్‌లు కర్వడ్ ఎడ్జులతో సర్కిల్ సేప్ డయల్‌తో వస్తున్నాయి. కొత్త AirPods ప్రో మోడల్స్ కూడా డెవలప్ చేస్తోంది. నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో ఎయిర్‌పాడ్స్ ప్రో హార్ట్ రేట్ మానిటరింగ్ పొందే అవకాశం లేదని పేర్కొంది.

Read Also : Apple School Offers : ఆపిల్ బ్యాక్ టూ స్కూల్ కొత్త ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!