Apple WWDC 2023 Event : హెల్త్ ఫీచర్లపైనే ఆపిల్ ఫోకస్.. ఈ సరికొత్త ఫీచర్లతో మానసిక ఆరోగ్యాన్ని మానిటర్ చేయొచ్చు..!

Apple WWDC 2023 Event : ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో సరికొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఆపిల్ వాచ్ వంటి గాడ్జెట్లలో హెల్త్ ఫీచర్లను అందిస్తోంది. ఈసారి మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించే హెల్త్ ఫీచర్లను ప్రవేశపెట్టింది.

Apple WWDC 2023 Event : హెల్త్ ఫీచర్లపైనే ఆపిల్ ఫోకస్.. ఈ సరికొత్త ఫీచర్లతో మానసిక ఆరోగ్యాన్ని మానిటర్ చేయొచ్చు..!

Apple allows you to monitor mental health via new features

Apple WWDC 2023 Event monitor mental health : ప్రపంచ టెక్ దిగ్గజం (Apple) వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో సరికొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. సోమవారం (జూన్ 5) రాత్రి కుపెర్టినోలోని కాలిఫోర్నియా, క్యాంపస్‌లో ఈవెంట్ నిర్వహించింది. ఈ WWDC ఈవెంట్‌లో ఆపిల్ విజన్ ప్రో (Apple Vision Pro) షోలో ప్రధాన ఆకర్షణగా మారింది. ఆపిల్ కంపెనీ మొట్టమొదటి ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్ కూడా. ప్రధానంగా AR డివైజ్‌గా రూపొందింది. అయితే, ఈ హెడ్‌సెట్ డయల్‌ని ఉపయోగించి ఆగ్మెంటెడ్, ఫుల్ వర్చువల్ రియాలిటీ మధ్య మారవచ్చు.

అంతేకాకుండా, ఆపిల్ వాచ్‌OS 10, macOS సోనోమా, ఇతర ప్రొడక్టులను కూడా ఆపిల్ ఆవిష్కరించింది. ఈసారి ఆపిల్ యూజర్ల మానసిక ఆరోగ్యంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అందుకే, మరిన్ని హెల్త్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఆపిల్ Inc iOS 17, iPadOS 17, watchOS 10లలో కొత్త హెల్త్ ఫీచర్లను ప్రకటించింది. కుపెర్టినో-ప్రధాన కార్యాలయ సంస్థ యూజర్లు తమ క్షణిక భావోద్వేగాలు, రోజువారీ మూడ్‌లను ట్రాక్ చేయడానికి మూల్యాంకనాలను, వనరులను సులభంగా యాక్సెస్ చేసుకునేందుకు కొత్త మానసిక ఆరోగ్య ఫీచర్లను ప్రకటించింది.

Read Also : Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!

ఈ హెల్త్ యాప్‌తో మానసిక స్థితిని ట్రాక్ చేయొచ్చు :
iPhone, iPad, Apple Watch కొత్త వెర్షన్‌లో వినియోగదారుల్లో మయోపియా (myopia) రిస్క్ తగ్గించడంలో సాయపడే కొత్త విజన్ హెల్త్ ఫీచర్‌లను అందిస్తోంది. ఇందులో హెల్త్ యాప్ iPad ఫీచర్లలో వస్తుంది. ఇక, వినియోగదారులు తమ ఆరోగ్య డేటాను ట్రాక్ చేసేందుకు కొత్త మార్గాలను అందిస్తుంది. iOS 17, iPasOS 17లోని హెల్త్ యాప్ కూడా watchOS 10లోని మైండ్‌ఫుల్‌నెస్ (Mindfulness) యాప్ వినియోగదారులు తమ మానసిక స్థితిని పర్యవేక్షించవచ్చు.

Apple allows you to monitor mental health via new features

Apple WWDC 2023 Event allows you to monitor mental health via new features

ఈ హెల్త్ యాప్‌ ద్వారా వినియోగదారులు తమ మానసిక ప్రవర్తనను అంచనా వేయొచ్చు. తమ మూడ్ ఎలా ఉంది? ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా చెక్ చేసుకోవచ్చు. యూజర్లు లేదా వారి కుటుంబంలోని ఇతరుల భావాలపై అత్యధిక ప్రభావాన్ని చూపే అసోసియేషన్‌లను ఎంచుకోవచ్చు. ఆందోళన వంటి భావాలను తెలుసుకోవచ్చు. ఈ హెల్త్ యాప్‌లో వినియోగదారులు తమ మానసిక స్థితికి కారణం ఏంటో తెలుసుకోగలరు. అందులో నిద్ర లేదా వ్యాయామం వంటి జీవనశైలి కారకాలు కావచ్చు. మొత్తం తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ఈ హెల్త్ ఫీచర్ల ఇన్‌సైట్స్ ఉపయోగించవచ్చు.

ఇటీవలి సర్వేలో.. అమెరికా పెద్దలలో 30శాతం కన్నా ఎక్కువ మంది ఆందోళన లేదా నిరాశను అనుభవించినట్లు గుర్తించారు. క్లినిక్‌లలో తరచుగా చూసే డిప్రెషన్, యాంగ్జయిటీ అసెస్‌మెంట్‌లను కూడా ఇప్పుడు హెల్త్ యాప్‌లో సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఎప్పుడైనా డేటా తీసుకోవచ్చు. ఈ అసెస్‌మెంట్‌లు వినియోగదారులు తమ మానసిక రుగ్మతల ప్రమాద స్థాయిని గుర్తించవచ్చు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తమ మానసిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. ఈ హెల్త్ ఇన్‌సైట్స్ PDF ఫార్మాట్‌లో ఉంటాయి. ఇదిలా ఉండగా, WWDC ఈవెంట్‌ సమయంలో ఆపిల్ షేర్లు సోమవారం ఆల్-టైమ్ రికార్డ్‌ను తాకాయి. దాంతో, కంపెనీ మార్కెట్ వాల్యూ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

Read Also : Apple WWDC 2023 : ఆఫర్ అంటే ఇది భయ్యా.. అత్యంత సరసమైన ధరకే 13 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్.. ఇప్పుడే కొనేసుకోండి..!