Apple WWDC 2023 : ఆపిల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్.. ఈ రాత్రికే లైవ్ స్ట్రీమ్ ఇలా చూడొచ్చు.. ఏయే ప్రకటనలు ఉండొచ్చుంటే?

Apple WWDC 2023 : ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) సోమవారం రాత్రి 10.30 గంటలకు ( జూన్ 5) ప్రారంభం కానుంది. ఈ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ యూట్యూట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు.

Apple WWDC 2023 : ఆపిల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్.. ఈ రాత్రికే లైవ్ స్ట్రీమ్ ఇలా చూడొచ్చు.. ఏయే ప్రకటనలు ఉండొచ్చుంటే?

Apple WWDC 2023 starts tonight _ How to watch livestream, 4 important announcements to expect

Apple WWDC 2023 Starts Tonight : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ సోమవారం (జూన్ 5) రాత్రి 10.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, సాధారణంగా, ఆపిల్ WWDC ఈవెంట్లో ఐఫోన్లు, Mac, స్మార్ట్‌వాచ్‌లు, iPads, Apple TV ప్రొడక్టుల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లను ప్రదర్శిస్తుంది. ఈ ఏడాది కూడా ఆపిల్ అదే సంప్రదాయాన్ని కొనసాగించనుంది.

ఆపిల్ WWDC ఈవెంట్ సందర్భంగా వరుసగా లేటెస్ట్ iOS 17, macOS 14, WatchOS 10, iPadOS 17, tvOS 17లను ప్రదర్శించనుంది. రియాలిటీ AR/VR హెడ్‌సెట్ xrOS Apple కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ప్రవేశపెట్టనుంది. సాఫ్ట్‌వేర్-కేంద్రీకృత ఈవెంట్ M2 SoCతో 15-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్‌తో సహా కొత్త Mac OSలను ఆవిష్కరించనుంది.

Read Also : Apple Exclusive Stores : భారత్‌కు రానున్న మరో 3 కొత్త ఆపిల్ ఆఫ్‌లైన్ స్టోర్‌లు.. లాంచ్ ఎప్పుడు? లొకేషన్ ఎక్కడ? పూర్తి వివరాలివే..!

ఆపిల్ WWDC 2023ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలంటే? :
ఆపిల్ WWDC కీనోట్ ఉచితంగా చూడొచ్చు. ఆపిల్ అభిమానులు YouTube ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు. ఆపిల్ అధికారిక ఆపిల్ ఛానెల్‌‌లో రాత్రి 10:30 PM (IST)కి ఈవెంట్‌ను వీక్షించవచ్చు.

ఆపిల్ WWDC 2023లో ఏయే ప్రకటనలు ఉండొచ్చు? :
ఆపిల్ ఈవెంట్ కొత్త సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. అవేంటో ఓసారి చూద్దాం.. ఆపిల్ iOS 17, iPadOS 17, Apple iPhones, iPads OS వంటి విడ్జెట్‌లు, లాక్ స్క్రీన్‌ వంటి వాటిపై ఆపిల్ ఎక్కువగా దృష్టిపెట్టింది. ఈ ఏడాది కూడా అలానే ఉండొచ్చు. లాక్ స్క్రీన్, కంట్రోల్ సెంటర్‌లో కొన్ని స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఆపిల్ కొత్త ప్రైవసీ-కేంద్రీకృత ఫీచర్‌లను కూడా అందించవచ్చు. లేకపోతే, మిక్స్డ్-రియాలిటీ హెడ్‌సెట్‌లలో xrOS పెద్ద అప్‌డేట్‌లు అందించే అవకాశం ఉంది. Apple iOS, iPadOS కొత్త వెర్షన్‌లను సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఐఫోన్లను లాంచ్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తుంది.

Apple WWDC 2023 starts tonight _ How to watch livestream, 4 important announcements to expect

Apple WWDC 2023 starts tonight _ How to watch livestream, 4 important announcements to expect

మ్యాక్‌బుక్ ఎయిర్ 15 : ఇంటెల్‌తో కంపెనీ భాగస్వామ్యం తర్వాత కస్టమ్ M1 SoCని స్వీకరించిన ఫస్ట్ ఆపిల్ (Apple PC)లలో (Apple MacBook) ఎయిర్ కూడా ఒకటిగా ఉంది. ఈ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ M-సిరీస్ చిప్‌ను కలిగి ఉంటుంది. M2 ప్రో లేదా మ్యాక్స్ ఉండవచ్చు. MacBook Pro 16 వంటి పెద్ద స్క్రీన్‌లను ఇష్టపడే వినియోగదారుల కోసం అతిపెద్ద అప్‌డేట్ 15-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది.

అయినప్పటికీ, MacBook Air 15 ఇప్పటికీ ఖరీదైనదే. దీని విలువ రూ. 1.2 లక్షల కన్నా ఎక్కువ ధర కావచ్చు. మ్యాక్ స్టూడియో గత ఏడాదిలో ఆపిల్ క్రియేటర్ల కోసం డెస్క్‌టాప్ స్టేషన్ (Mac Studio)ని ప్రవేశపెట్టింది. ఆపిల్ WWDC 2023లో SoCతో కొత్త వెర్షన్ చూడవచ్చు. స్టూడియోలో కంపెనీ కొత్త M2 అల్ట్రా చిప్‌ని అందించే అవకాశం ఉంది. డిజైన్ వారీగా, పెద్దగా అప్‌గ్రేడ్‌లు ఉండకపోవచ్చు.

రియాలిటీ హెడ్‌సెట్ : ఆపిల్ AR/VR హెడ్‌సెట్ WWDC 2023లో లాంచ్ కానుంది. ఇది మెటా ఓకులస్‌ను పోలి ఉంటుంది. ఆపిల్ xrOS అని పిలిచే కస్టమ్ OSని రూపొందిస్తోంది. ఐఫోన్ ఎక్స్‌టెన్షన్‌గా కాకుండా ఇండిపెండెంట్ డివైజ్ మాదిరిగా ఉపయోగించవచ్చు. ఆపిల్ హెడ్‌సెట్‌ను తేలికగా, సౌకర్యవంతంగా ఉంచడానికి హై-ఎండ్ మెటీరియల్‌లను ఉపయోగిస్తోంది. ఐపాడ్‌లతో చేసినట్లే, ఐఫోన్‌ల స్థానంలో ఆపిల్ దీర్ఘకాలంలో మిక్స్డ్-రియాలిటీ హెడ్‌సెట్ AR గ్లాసెస్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Apple iPhone 14 Sale : అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు..!