Apple WWDC 2023 Updates : ఆపిల్ ఐఓఎస్ 17 వెర్షన్ ఇదిగో.. ఈ ఐఫోన్లలో కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

Apple WWDC 2023 Updates : ఆపిల్ WWDC 2023 ఈవెంట్లో భాగంగా టెక్ దిగ్గజం లేటెస్ట్ iOS 17 సాఫ్ట్‌వేర్ వెర్షన్ అప్‌డేట్ ప్రకటించింది. ఈ కొత్త ఐఓఎస్ ద్వారా అనేక కొత్త ఫీచర్లను ఐఫోన్లలో అప్‌డేట్ చేయనుంది.

Apple WWDC 2023 Updates : ఆపిల్ ఐఓఎస్ 17 వెర్షన్ ఇదిగో.. ఈ ఐఫోన్లలో కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

Apple WWDC 2023 Updates _ iOS 17 announced, brings new features to these iPhones

Apple WWDC 2023 Updates iOS 17 Announced : ఆపిల్ (WWDC 2023) ఈవెంట్ సందర్భంగా (Apple) లేటెస్ట్ iOS 17 సాఫ్ట్‌వేర్ వెర్షన్‌, 15-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్, కొత్త Mac స్టూడియో వంటి కొత్త ప్రొడక్టులతో పాటు ఆవిష్కరించింది. ఈ కొత్త iOS వెర్షన్ ద్వారా ఐఫోన్లలో మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఇందులోని కొత్త ఫీచర్లు ఐఫోన్లను మరింత శక్తివంతంగా మార్చనున్నాయి. కొత్త జర్నల్ యాప్, వాయిస్ మెయిల్ రియల్-టైమ్ ట్రాన్స్‌లేటర్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లు వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. IOS 17 లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ.. (Apple 2023)కు సంబంధించి ఐఫోన్లలో కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తుందని భావిస్తున్నారు. చాలావరకు గత ఏళ్ల మాదిరిగానే సెప్టెంబర్ మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 15 సిరీస్ బాక్స్ వెలుపల లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో రానుంది.

iOS 17 టాప్ ఫీచర్లు :
లేటెస్ట్ iOS వెర్షన్ లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్‌తో కొత్త లైవ్ వాయిస్‌మెయిల్ ఫీచర్‌ని తీసుకువస్తుంది, ప్రాథమికంగా రికార్డింగ్ రియల్-టైమ్ లైవ్ ట్రాన్స్‌లేషన్ చేయగలరు. (FaceTime)కి వచ్చే ఉపయోగకరమైన అప్‌డేట్‌లలో ఇదొకటి. ఎవరైనా కాల్ మిస్ చేస్తే.. అది వీడియో మెసేజ్‌లను పంపుతుంది. iMessages సెర్చ్ ఫిల్టర్‌లతో కూడా ఇదే ఫీచర్ అప్‌డేట్ కానుంది. యూజర్ల మాటలను స్వైప్ చేయడం ద్వారా మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వగలరు. ఇప్పుడు ఆడియో మెసేజ్‌లను కూడా ఆటోమాటిక్‌గా ట్రాన్స్‌లేట్ చేయగలదు. ఈ యాప్‌కి కొత్త లొకేషన్ షేరింగ్ ఫీచర్ కూడా యాడ్ చేస్తోంది. తద్వారా ఐఫోన్ యూజర్లు ఇప్పుడు iMessageలో లొకేషన్‌లను షేర్ చేయవచ్చు. అదనంగా, iMessage యాప్, హైడింగ్ యాప్‌లు, iMessageలో (+) బటన్ వెనుక ఉన్న కెమెరాలో కొత్త డిజైన్‌ను కూడా చూడవచ్చు.

Read Also :  Apple WWDC 2023 : ఆఫర్ అంటే ఇది భయ్యా.. అత్యంత సరసమైన ధరకే 13 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్.. ఇప్పుడే కొనేసుకోండి..!

అంతేకాదు.. ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా గూగుల్ మ్యాప్‌లను యాక్సస్ చేసుకోవచ్చు. ఐఫోన్ యూజర్లు ఇప్పుడు ఏదైనా ఫొటో నుంచి సబ్జెక్ట్‌ల స్టిక్కర్‌లను క్రియేట్ చేయగలరు. మోషన్ ఫొటోలను ఉపయోగించి ‘లైవ్ స్టిక్కర్లు’ కూడా తయారు చేయవచ్చు. ఈ స్టిక్కర్లు థర్డ్-పార్టీ యాప్‌లలో కూడా పని చేస్తాయి. అలాగే, (AirDrop)లో కూడా సరికొత్త మార్పులు తీసుకొస్తోంది. AirDropని ఉపయోగించి ఎవరైనా కొత్త వారితో ఫోన్ నంబర్‌ను మార్చుకోవచ్చు. ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్ షేర్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ ఐఫోన్‌లను దగ్గరగా ఉంచితే చాలు.. ఈజీగా డేటా షేర్ అయిపోతుంది.

Apple WWDC 2023 Updates _ iOS 17 announced, brings new features to these iPhones

Apple WWDC 2023 Updates _ iOS 17 announced, brings new features to these iPhones

లార్జ్ ఫైల్‌లను షేర్ చేయడానికి AirDropని ఉపయోగించవచ్చు. iPhone యూజర్లు ఇప్పుడు లైవ్ టెలిక్యాస్ట్ లేదా మ్యూజిక్ సింకరైజ్ చేయడానికి (SharePlay)ని ఉపయోగించవచ్చు. ఆపిల్ జర్నల్ అనే కొత్త యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుంది. మీ మదురమైన క్షణాలను జర్నల్‌లో సేవ్ చేయవచ్చు. మీ రోజు ప్రారంభం లేదా ముగింపు కోసం నోటిఫికేషన్‌లను షెడ్యూల్ చేయవచ్చు. ప్రైవసీ విషయానికొస్తే.. మీ సూచనలు, ఎంట్రీలు లాక్ చేసినట్టు ఆపిల్ చెబుతోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ అయి ఉంటాయి. ఈ డేటాను ఎవరూ యాక్సెస్ చేయలేరు. ఆపిల్ సైతం మీ పర్సనల్ డేటాను యాక్సస చేయలేదు.

iOS 17 సపోర్ట్ చేసే ఐఫోన్లు ఇవే :
iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone 11, iPhone 11 Pro సిరీస్, iPhone 12 సిరీస్, iPhone 12 Pro సిరీస్, iPhone 13 సిరీస్, iPhone వంటి మోడల్ ఐఫోన్లలో లేటెస్ట్ iOS 17 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐఫోన్ల జాబితాలో ఐఫోన్ 13 ప్రో సిరీస్, ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 14 ప్రో సిరీస్‌లు అప్‌డేట్ పొందుతాయి. ఇక, iPhone 6a, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus, iPhone SE మోడల్, చివరి iPod టచ్, సెకండ్ జనరేషన్ iPad Air, నాల్గో జనరేషన్ iPad mini వంటి డివైజ్‌ల కోసం ప్రధాన అప్‌డేట్ లాంచ్ చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ఆపిల్ గత ఏడాదిలోనే ప్రకటించింది.

ఆ ఐఫోన్‌లలో నిలిచిపోనున్న అప్‌డేట్స్ :
ఆపిల్ ఐఫోన్‌లు స్పష్టమైన కారణాల వల్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సపోర్టును కోల్పోతాయి. ఇప్పటికే చాలా పాత మోడల్, కొత్త ఫీచర్లు, యాడ్ చేయడం వంటి ఇతర విషయాలతోపాటు లేటెస్ట్ హార్డ్‌వేర్ అవసరం పడుతుంది. అందుకే, నిర్దిష్ట కాలవ్యవధి వరకు మాత్రమే ఆపిల్ పాత యూనిట్‌లకు సపోర్టు అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్లు నవంబర్ 2015, నవంబర్ 2017 మధ్య రిలీజ్ అయ్యాయి.

Read Also : Apple WWDC 2023 Event : హెల్త్ ఫీచర్లపైనే ఆపిల్ ఫోకస్.. ఈ సరికొత్త ఫీచర్లతో మానసిక ఆరోగ్యాన్ని మానిటర్ చేయొచ్చు..!