NASA Alert : జూలై 24న భూమివైపు దూసుకురానున్న భారీ ఆస్టరాయిడ్..

నాసా అలర్ట్.. జూలై 24న భూమివైపు భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. చూడటానికి స్టేడియం అంత సైజు ఉంటుంది. ఎడిన్బర్గ్ కోట ఎంత ఎత్తు ఉంటుంది. అత్యంత వేగంగా భూమి మీదుగా వెళ్లనుంది.

NASA Alert : జూలై 24న భూమివైపు దూసుకురానున్న భారీ ఆస్టరాయిడ్..

Space Rock Hurtling Towards Earth

Space rock hurtling towards Earth : నాసా అలర్ట్.. జూలై 24న భూమివైపు భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. చూడటానికి స్టేడియం అంత సైజు ఉంటుంది. ఎడిన్బర్గ్ కోట ఎంత ఎత్తు ఉంటుంది. అత్యంత వేగంగా భూమి మీదుగా వెళ్లనుంది. సెకనుకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో, గంటకు 17,900mph మిలియన్ల వేగంతో దూసుకురానుంది. ఈ ఆస్టరాయిడ్ గమనం వేగంలో ఏదైనా అడ్డుగా వస్తే విధ్వంసమే.. అదే ఆస్టరాయిడ్.. ‘2008 GO20’ గ్రహశకలంగా పిలుస్తారు. ఈ భారీ గ్రహశకలం వైశాల్యం 220 మీటర్ల పరిమాణం ఉంటుంది. ఎడిన్బర్గ్ కోట అంత 135 మీటర్ల ఎత్తు ఉంటుంది. శనివారం రోజున ఈ ఆస్టరాయిడ్ 2008 GO20 భూమి కక్ష్య మీదుగా రాత్రి 8.35 సమయంలో ప్రయాణించనుంది.

భూమికి 28,70,847,607 కిలోమీటర్ల దూరంలో వెళ్లనుంది. అంటే.. భూమి, చంద్రుని మధ్య దూరానికి ఎనిమిది రెట్లు ఎక్కువ. గంటకు 18వేల మైళ్ల వేగంతో భూమివైపు దూసుకురానుంది. ఈ గ్రహశకలం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికన్ సైన్స్ ఏజెన్సీ నాసా (NASA) ఒక ప్రకటనలో వెల్లడించింది. నాసా ప్రకారం.. ఈ గ్రహశకలం జూలై 24న భూమికి అతిదగ్గరగా వెళ్లనుంది. ఇది అపోలో క్లాస్ (Apollo Class) గ్రహశకలంగా పేర్కొంది. ఈ గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా వస్తున్నప్పటికి… భూమికి 0.04 au (astronomical unit) దూరం నుంచి వెళ్లనుంది.

భూమికి, ఆస్టరాయిడ్‌కి మధ్య 3,718,232 మైళ్ల దూరం ఉండనుంది. అదే చంద్రుడు, భూమికి మధ్య దూరం సుమారు 2,38,606 మైళ్లు ఉంటుంది. గత జూన్ నెలలో ఈఫిల్ టవర్ అంత సైజున్న 2021 KT1 అనే భారీ గ్రహశకలం భూమికి అతిదగ్గరగా వెళ్లింది. భూమికి 4.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో గ్రహశకలం ప్రయాణించింది. భూమికి దగ్గరలో 26వేల గ్రహశకలాలు ఉన్నాయని, అందులో 1000 వరకు అత్యంత ప్రమాదకరమైనవిగా నాసా హెచ్చరిస్తోంది.

నాసా ప్రకారం.. ఆస్టరాయిడ్స్ అనేవి.. సుమారు 4.6 బిలియన్ ఏళ్ల క్రితమే సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి రాతి అవశేషాలుగా ఉన్నాయి. ప్రస్తుతం విశ్వంలో 1,097,106 గ్రహశకలాలు ఉన్నాయి. ఉల్కల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఈ అతిపెద్ద భారీ ఆస్టరాయిడ్ గమనాన్ని పక్కకు మరలించేందుకు చైనా పరిశోధకులు భారీ రాకెట్లను పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2021 నుంచి 2022 ఆరంభంలో అమెరికా రొబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేయబోతోంది. భూమికి అతిదగ్గరగా వచ్చే రెండు ఆస్టరాయిడ్లను అడ్డుకునేందుకు ఈ రొబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించనుంది.