Asus Zenbook 14 Flip OLED : Asus నుంచి 3 కొత్త సూపర్ ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Asus Zenbook 14 Flip OLED : ప్రముఖ టెక్ దిగ్గజం ఆసుస్ (Asus) భారత మార్కెట్లో వరుస ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. Asus Zenbook 14 Flip OLED, Vivobook S 14 Flip Vivobook 15 టచ్‌లను లాంచ్ చేసింది.

Asus Zenbook 14 Flip OLED : Asus నుంచి 3 కొత్త సూపర్ ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Asus Zenbook 14 Flip OLED, Vivobook S14 Flip, and Vivobook 15 launched in India, price starts at Rs 49,990

Asus Zenbook 14 Flip OLED : ప్రముఖ టెక్ దిగ్గజం ఆసుస్ (Asus) భారత మార్కెట్లో వరుస ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. Asus Zenbook 14 Flip OLED, Vivobook S 14 Flip Vivobook 15 టచ్‌లను లాంచ్ చేసింది. Asus లేటెస్ట్ లైనప్ ల్యాప్‌టాప్‌లు టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు బ్యాటరీ లైఫ్ కూడా దీర్ఘకాలం అందిస్తున్నాయని కంపెనీ పేర్కొంది. Zenbook, VivoBook సిరీస్‌లకు కొత్త ఫీచర్లను జోడించినట్టు తెలిపింది. యువతను ఆకట్టుకేలా ల్యాప్‌టాప్ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో ల్యాప్‌టాప్‌లు, యూజర్లు మల్టీ టాస్క్ చేసేందుకు వీలుగా ఉంటాయి.

ASUS ఇండియా, కన్స్యూమర్ గేమింగ్ PC, బిజినెస్ హెడ్ ఆర్నాల్డ్ సు మాట్లాడుతూ.. భారత్‌లో Zenbook, VivoBook రేంజ్‌తో కూడిన ఆసక్తికరమైన ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నట్టు తెలిపారు. ధరల విభాగాలలో యూజర్లను ఆకర్షించేలా కొత్త అప్‌డేట్ మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని చెప్పారు. యూజర్లు సౌకర్యవంతమైన కంప్యూటింగ్ అనుభవాన్ని అందించాలని భావిస్తున్నామని తెలిపారు. యువ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ క్లాస్ అప్-టు-డేట్ ఫీచర్‌లతో కొత్త రేంజ్ డెవలప్ చేశామని పేర్కొన్నారు.

(Asus Zenbook 14 Flip OLED) ధర ఎంతంటే :

Asus Zenbook Flip 14 ధర రూ. 99,990 ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్‌లలో లభ్యం అవుతుంది. Vivobook S 14 Flip రెండు వేరియంట్‌లలో వస్తుంది. AMD వేరియంట్ ధర రూ. 66,990. ఇంటెల్ కోర్ i5 వేరియంట్ ధర రూ. 74,990గా ఉంటుంది.ఇక ప్రీమియం మోడల్స్ కాకుండా.. ఆసుస్ రూ. 50,000 లోపు ల్యాప్‌టాప్‌ను కూడా రిలీజ్ చేసింది. Asus Vivobook 15 ప్రారంభ ధర రూ. 49,990గా ఉంది. ల్యాప్‌టాప్ టచ్‌స్క్రీన్ సామర్థ్యాలతో వస్తుంది. ల్యాప్‌టాప్‌లు ఇకపై అందుబాటులో ఉంటాయి. అధికారిక Asus స్టోర్‌లతో సహా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

Asus Zenbook 14 Flip OLED, Vivobook S14 Flip, and Vivobook 15 launched in India, price starts at Rs 49,990

Asus Zenbook 14 Flip OLED, Vivobook S14 Flip, and Vivobook 15 launched in India, price starts at Rs 49,990

స్పెసిఫికేషన్‌లు ఇవే :

ZenBook 14 Flip ల్యాప్ టాప్ మొత్తం లైన్‌లో అత్యంత ప్రీమియం డివైజ్.. ZenBook 14 Flip 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో వచ్చింది. 14-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ల్యాప్‌టాప్ 16:10 యాస్పెక్ట్ రేషియోతో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 550 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే సైడ్‌లో స్లిమ్ 2.9mm బెజెల్స్‌ను కలిగి ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 88 శాతం అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లో స్టైలస్‌కు సపోర్టు కూడా ఉంది. జెన్‌బుక్ 14 ఫ్లిప్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. ఒకటి ఇంటెల్ కోర్ i5. మరొకటి కోర్ i7 వేరియంట్. ల్యాప్‌టాప్ 16GB RAMతో పాటు 512GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది.

Asus Vivobook S14 ఫ్లిప్ ఇంటెల్ కోర్ i5తో పాటు AMD రైజెన్ 5 ప్రాసెసర్ వంటి రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 1900×1200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 14-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ల్యాప్‌టాప్ 8GB , 16GB వేరియంట్‌లతో విభిన్న స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లలో కూడా వస్తుంది. Asus Vivobook 15 లైనప్‌లో ఇదే చౌకైనదిగా చెప్పవచ్చు. ల్యాప్‌టాప్ 15-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. కోర్ i5, కోర్ i3తో సహా రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది.

Read Also : Asus 8z Smartphone: హై ఎండ్ స్మార్ట్ ఫోన్ “8z”ను విడుదల చేసిన అసూస్: ధర ఎంతంటే?