Balance లేకపోయినా.. ATMలో డ్రా చేశారా, అయితే చార్జీలు

Balance లేకపోయినా.. ATMలో డ్రా చేశారా, అయితే చార్జీలు

atm-withdrawal-charges : మీ అకౌంట్ (Bank Account)లో డబ్బులు లేకపోయినా..ఏటీఎం (ATM)కు వెళ్లి..డ్రా (drawal) చేసేందుకు ప్రయత్నించినా చార్జీలు (charges) తప్పవు. ఏటీఎం ట్రాన్సాక్షన్ (ATM transactions) ఫెయిలయిన సందర్భాల్లో పలు బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు ముందు..అసలు బ్యాంకు అకౌంట్లో అంత నగదు ఉందా ? లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదని బ్యాంకులు సూచిస్తున్నాయి.

తగినంత బ్యాలెన్స్ ఉంటే…అంతే ట్రాన్సాక్షన్ చేసుకుంటే బెటర్ అని, లేకపోతే..ట్రాన్సాక్షన్ ఫెయిలయిన సందర్భాల్లో ఆయా బ్యాంకుల నిబంధనల మేరకు రూ. 20 నుంచి రూ. 25తో పాటు..పన్నులను పెనాల్టీగా వసూలు చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వినియోగదారుల నుంచి రూ. 20తో పాటు..జీఎస్టీ వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ (ICICI), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) రూ. 25తో పాటు జీఎస్టీని అపరాద రుసుముగా వసూలు చేస్తుంటాయి. సో..బ్యాంకు ఖాతాల్లో డబ్బులు లేకపోయినా..ఏటీఎం ద్వారా డ్రా చేసేందుకు ప్రయత్నించకండి అంటున్నారు.