ఆత్మనిర్భర్ భారత్ : ‘మేడ్ ఇన్ ఇండియా’ 6 పాపులర్ యాప్‌లు.. మీరు ట్రై చేశారా?

  • Published By: sreehari ,Published On : August 15, 2020 / 04:49 PM IST
ఆత్మనిర్భర్ భారత్ : ‘మేడ్ ఇన్ ఇండియా’ 6 పాపులర్ యాప్‌లు.. మీరు ట్రై చేశారా?

అత్యంత పాపులర్ షార్ట్ వీడియో టిక్‌టాక్‌తో సహా 100కి పైగా చైనీస్ యాప్ అప్లికేషన్లను భారత ప్రభుత్వం నిషేధించినప్పటి నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. చైనాపై వ్యతిరేకత కారణంగా దేశీ యాప్‌‌లకు మంచి ఆదరణ పెరుగుతోంది. స్వదేశీ యాప్ డెవలపర్లంతా పీఎం మోడీ ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా ఈ ప్లాట్‌ఫామ్‌లను డెవలప్ చేస్తున్నారు.



74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ.. గత కొన్ని నెలల్లో మేడ్ ఇన్ ఇండియా యాప్స్ సెంటర్ స్టేజ్ తీసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. చైనా వస్తువులను బహిష్కరించాలని, దేశీయ యాప్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రధాని మోడీ ‘ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్ ప్రకటించడానికి ముందే కొన్ని భారతీయ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన ఏదైనా యాప్ ఓసారి ట్రై చేసి చూడండి..

చింగారి : (టిక్‌టాక్)
ఇండియాలో చైనీస్ యాప్ షార్ట్ వీడియో షేరింగ్ టిక్‌టాక్ నిషేధించిన తరువాత దేశీయ షార్ట్ వీడియో ‘చింగారి’ యాప్ బాగా పాపులర్ అయింది. ఈ ప్లాట్‌ఫాం రెండేళ్ల క్రితమే రూపొందించారు. టిక్ టాక్ ప్రభంజనంతో ఈ యాప్ గురించి తెలియదు.. భద్రతా కారణాల దృష్ట్యా దేశంలో టిక్‌టాక్ బ్లాక్ చేయడంతో ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ ప్రచారాన్ని ప్రకటించిన తర్వాతే ప్రజాదరణ చింగారికి ఒక్కసారిగా భారీ పాపులారిటీ వచ్చేసింది.

Atmanirbhar Bharat: Six popular ‘Made in India’ apps you can try

ఈ యాప్ ఆన్‌లైన్‌లో మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆత్మనిర్భర్ భారత్ ఇన్నోవేషన్ యాప్ ఛాలెంజ్‌లో ‘చింగారి’ సోషల్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది.

లూడో కింగ్ (మొబైల్ గేమ్) :
భారతీయ మొబైల్ గేమ్ యాప్ ‘లూడో కింగ్’ కూడా ఫుల్ పాపులారిటీ ఉంది. లూడో కింగ్ చాలా ఏళ్లుగా పేరొందిన యాప్.. లాక్‌డౌన్ సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంటర్ టైన్మెంట్ కోసం యూజర్లు లూడో కింగ్ ప్లాట్‌ఫారమ్‌కు మారడంతో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాప్ స్టోర్ రెండింటిలోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ స్టోర్లలో మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

స్టెప్‌సెట్‌గో (ఫిట్‌నెస్) :
ఆరోగ్యం విషయంలో దాదాపు అందరూ జాగ్రత్తలు తీసుకుంటారు.. ఫిట్‌నెస్ కోసం ఎప్పటికప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. లాక్ డౌన్ నుంచి ఇంట్లోనే ఉండే వారంతా తమ శరీర వ్యాయామం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. భారతదేశానికి చెందిన StepSetGo దేశ పౌరులలో ఫుల్ పాపులారిటీ పొందింది.



ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను దేశంలోని మిలియన్ల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేశారు. ప్రతి ఆరోగ్య లక్షణాన్ని ఈ యాప్ ట్రాకింగ్ చేస్తుంది. స్నేహితులతో పాటు ఫిట్‌నెస్ సవాళ్లను స్వీకరించమని యూజర్లను ప్రోత్సహిస్తుంది.

షేర్‌చాట్, Moj (సోషల్) :
చింగారి యాప్ సహా ఇండియా ఆధారిత మరో షార్ట్ వీడియో ప్లాట్‌ఫాం షేర్‌చాట్. ఈ ప్లాట్‌ఫాం యాప్‌ను మిలియన్ల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రాంతీయ భాషా మద్దతు కారణంగా వివిధ రకాల వినియోగదారులను ఆకట్టుకుంది. ఈ యాప్ గూగుల్, ఆపిల్ యాప్ స్టోర్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. షేర్‌చాట్ భారతదేశంలోని మరో చిన్న వీడియో ప్లాట్‌ఫామ్ మోజ్‌ను కూడా టెస్టు చేస్తోంది.

Atmanirbhar Bharat: Six popular ‘Made in India’ apps you can try

ఇప్పటికే ఈ యాప్ డౌన్‌లోడ్ కోసం ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. అధికారిక ఇంకా ప్రవేశపెట్టలేదు. హిందీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, మలయాళం, బెంగాలీ, తమిళం, కన్నడ, ఒడియా, భోజ్‌పురి, అస్సామీ, రాజస్థానీ, హర్యన్వి, ఉర్దూలతో సహా పలు ప్రాంతీయ భాషల్లో కూడా Moj అందుబాటులో ఉంది.

ఆరోగ్య సేతు (కాంటాక్ట్ ట్రేసింగ్) :
కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ప్రత్యేకంగా ఈ యాప్ రూపొందించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులను ముందుగానే ట్రేసింగ్ చేసేందుకు ఈ యాప్ రూపొందించారు. ఆరోగ్య సేతు అనే కాంటాక్ట్ ట్రేసింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించిన అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

Atmanirbhar Bharat: Six popular ‘Made in India’ apps you can try

దేశవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేశారు. భారత ప్రభుత్వం దేశంలోని ప్రతి ఒక్కరినీ తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రోత్సహిస్తోంది. కరోనా పాజిటివ్ వ్యక్తితో కాంటాక్ట్ అయిన సమయంలో ఈ యాప్ వెంటనే సమాచారం అందిస్తుంది.



జియోమార్ట్ (రిటైల్) :
రిలయన్స్ జియో ఇటీవలే జియోమార్ట్‌ను తర్వాత ప్రారంభించింది. కొన్ని నెలల పాటు టెస్టింగ్ నిర్వహించిన అనంతరం జియోమార్ట్ అధికారికంగా గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పోల్చినప్పుడు తక్కువ ధరకే ఉత్పత్తులను విక్రయిస్తామని జియోమార్ట్ హామీ ఇచ్చింది.

ఈరోజు 74 వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతదేశపు మంత్రం ‘మేక్ ఫర్ వరల్డ్’గా ఉండాలని ఆకాంక్షించారు. చాలా పెద్ద కంపెనీలు భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నాయని చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ తో పాటు ‘మేక్ ఫర్ వరల్డ్’ అనే మంత్రంతో మనం ముందుకు సాగాలని మోడీ పేర్కొన్నారు.