Banned on WhatsApp : మీ వాట్సాప్ బ్యాన్ అయిందా? అకౌంట్ అప్పీల్ ఇలా చేసుకోవచ్చు!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ ప్లాట్‌ఫాంపై బ్యాన్ అయిన అకౌంట్లను తిరిగి పొందేందుకు యూజర్లకు అవకాశం లభించనుంది.

Banned on WhatsApp : మీ వాట్సాప్ బ్యాన్ అయిందా? అకౌంట్ అప్పీల్ ఇలా చేసుకోవచ్చు!

Banned On Whatsapp You Will Soon Get Option To Revoke Your Suspended Account Within The App (1)

Banned on WhatsApp : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ ప్లాట్‌ఫాంపై బ్యాన్ అయిన అకౌంట్లను తిరిగి పొందేందుకు యూజర్లకు అవకాశం లభించనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా బ్యాన్ అయిన వాట్సాప్ అకౌంట్ తిరిగి పొందవచ్చు. అందుకు యూజర్లు ముందుగా తమ అకౌంట్ రీస్టోర్ చేసేందుకు వాట్సాప్‌కు అప్పీల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ వాట్సాప్ అకౌంట్ తిరిగి పొందేందుకు వీలుంటుంది. ఇప్పటికే ఈ వాట్సాప్ ఫీచర్.. బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

వాట్సాప్ కొత్త ఫీచర్‌ సంబంధించి WaBetaInfo నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ప్రతి నెలా యాప్‌లోని నిబంధనలు, షరతులను ఫాలో కాని వేలాది అకౌంట్లను WhatsApp బ్యాన్ చేస్తోంది. కొన్ని వారాల క్రితమే ప్లాట్‌ఫారమ్ 16 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ అకౌంట్లను నిషేధించింది. బ్లాక్ చేసిన అకౌంట్లను తిరిగి పొందేందుకు యూజర్లకు రెండవ అవకాశం ఇవ్వాలని WhatsApp భావిస్తోందిమీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయితే.. WhatsApp ఓపెన్ చేయయగానే.. ఈ WhatsApp అకౌంట్ బ్యాన్ అయిందంటూ ఒక మెసేజ్ కనిపిస్తుంది. వాట్సాప్ అకౌంట్లకు సంబంధించి మెసేజ్ సర్వీసుల నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఆయా అకౌంట్లను బ్యాన్ చేస్తామని కంపెనీ తెలిపింది. స్పామ్, స్కామ్‌లు లేదా WhatsApp యూజర్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. వాట్సాప్ యూజర్లు తమ నిషేధిత వాట్సాప్ అకౌంట్లోకి లాగిన్ కావాలంటే యాప్‌లోనే వాట్సాప్ సపోర్ట్‌ను సంప్రదించే ఆప్షన్ ఉంటుందని నివేదిక తెలిపింది.

Banned On Whatsapp You Will Soon Get Option To Revoke Your Suspended Account Within The App

Banned On Whatsapp You Will Soon Get Option To Revoke Your Suspended Account Within The App

మీరు మెసేజింగ్ యాప్‌లో ఈ ఆప్షన్ పొందలేరు. మీ అకౌంట్ తిరిగి పొందేందుకు రివ్యూ అభ్యర్థనను పంపడానికి WhatsApp సపోర్టు పేజీని సందర్శించాలి. WhatsApp కొత్త బీటా వెర్షన్ యాప్‌లోని నిషేధిత అకౌంట్ల విత్‌డ్రా ఆప్షన్ చూపిస్తోంది. మీరు ఆప్షన్ ఎంచుకున్న తర్వాత.. WhatsApp సపోర్ట్ మీ అకౌంట్ డివైజ్సమాచారాన్ని రివ్యూ చేస్తుంది. వాట్సాప్ సర్వీసు నిబంధనలకు చట్టవిరుద్ధంగా ఏమైనా ఉల్లంఘించారా లేదా అనేది చెక్ చేస్తుంది. మీరు రివ్యూ కోసం రిక్వెస్ట్ పంపినప్పుడు.. మీరు కొన్ని అదనపు వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.

మీ రివ్యూ రిక్వెస్ట్ సమర్పించిన తర్వాత.. పొరపాటున మీ అకౌంట్ బ్యాన్ అయిందని ప్లాట్‌ఫారమ్ గుర్తిస్తే.. వెంటనే మీ అకౌంట్ రీస్టోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ అకౌంట్ వాట్సాప్ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు WhatsApp గుర్తిస్తే.. మీరు మీ పాత వాట్సాప్ అకౌంట్ తిరిగి వినియోగించలేరు. వాట్సాప్ రివ్యూ చేయాలంటే మూడవ అవకాశం అందిస్తోంది. Android బీటా వెర్షన్‌లో కొత్త ఫీచర్‌ను గుర్తించింది. రాబోయే వారాల్లో iOS యూజర్లకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని నివేదిక సూచిస్తోంది. వాట్సాప్ స్టాండర్డ్ వెర్షన్‌లో కొత్త ఫీచర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రస్తుతానికి తెలియదు. మీరు ఒకే వెర్షన్ వాట్సాప్ ఉపయోగిస్తే.. మీ అకౌంట్ నిషేధంలో ఉంటే మీరు ఇప్పటికీ రివ్యూ రిక్వెస్ట్ పంపవచ్చు. మీరు ప్లాట్‌ఫారమ్ నుంచి కాంటాక్ట్ పేజీని విజిట్ చేసి. మీ నిషేధిత వాట్సాప్ అకౌంట్ న రద్దు చేయమని అభ్యర్థిస్తూ వారికి ఈమెయిల్ పంపాల్సి ఉంటుంది.

Read Also : WhatsApp : వాట్సాప్‌‌ గ్రూపులో ఇకపై సైలెంటుగా ఎగ్జిట్ కావొచ్చు.. వారికి మాత్రమే తెలుస్తుంది..!