ఒక్కసారి ఛార్జ్ చేస్తే..28 వేల సంవత్సరాల వరకు బేఫికర్

  • Published By: madhu ,Published On : September 9, 2020 / 06:11 AM IST
ఒక్కసారి ఛార్జ్ చేస్తే..28 వేల సంవత్సరాల వరకు బేఫికర్

Battery made from nuclear waste : ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 28 వేల సంవత్సరాలకు వరకు పని చేస్తుందని కాలిఫోర్నియాకు చెందిన NDB కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను సంబంధింత కంపెనీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.




ఈ బ్యాటరీని ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, డ్రోన్లు, గడియారాలు, కెమెరాలు, హెల్త్ మానిటర్లు, సెన్సార్ లలో ఉపయోగించుకోవచ్చని ఆ కంపెనీ తెలిపింది. రెడియోధార్మికతతో తయారు చేసినందున ఫుల్ సేఫ్ అని వెల్లడించింది. కరెంటును సొంతంగా ఉత్పత్తి చేయడం వల్ల బ్యాటరీ పని చేయనుంది.