Battlegrounds Mobile India: పబ్‌జీ మొబైల్‌ తరహాలోనే దూసుకెళ్తోన్న బ్యాటిల్‌గ్రౌండ్స్..

బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎమ్ఐ).. పబ్‌జీ ఇండియా తరహాలోనే దూసుకెళ్తోంది. జులై 2న లాంచ్ అయిన ఈ గేమ్.. ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులో ఉండటంతో టాప్ లో దూసుకెళ్తుంది.

Battlegrounds Mobile India: పబ్‌జీ మొబైల్‌ తరహాలోనే దూసుకెళ్తోన్న బ్యాటిల్‌గ్రౌండ్స్..

Battlegrounds Mobile India Follows Pubg Mobile On Google Play Store Find Out How And More

Battlegrounds Mobile India: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎమ్ఐ).. పబ్‌జీ ఇండియా తరహాలోనే దూసుకెళ్తోంది. జులై 2న లాంచ్ అయిన ఈ గేమ్.. ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులో ఉండటంతో టాప్ లో దూసుకెళ్తుంది. దక్షిణ కొరియా డెవలపర్ క్రాఫ్టన్ రెడీ చేసిన ఈ యాప్.. నెం.1 ఫ్రీ గేమ్ మాత్రమే కాకుండా ఇండియాలో నెం.2 గ్రాసింగ్ గేమ్ గా కూడా మారింది.

కొద్ది వారాలుగా ప్లే స్టోర్ లో బీటా వెర్షన్ గానే అందుబాటులో ఉన్న ఈ యాప్.. ఇప్పుడు అధికారికంగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వచ్చేసింది.

Battler Grounds

Battler Grounds

Indian version of PUBG
ఈ రాయల్ గేమ్ సెప్టెంబర్ 2020న నిషేదానికి గురై ఇండియన్ వర్షెన్ లో పబ్ జీ మొబైల్ గా రీ లాంచ్ అయింది. వందకు పైగా రద్దు అయిన చైనీస్ యాప్ లలో ఇదొకటి. ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యాప్ భారతదేశంలో ఉండే వారి అభిరుచులకు తగ్గట్లుగా లాంచ్ అయింది. పైగా పబ్ జీ మొబైల్ కు దీనికి చాలా దగ్గరి పోలిక ఉంది. దీని డిస్క్రిప్షన్ లో కూడా.. ‘బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యాప్.. ఇండియన్ల కోసం రెడీ అయిన కొత్త ఫ్రీ గేమ్’ అని డిస్క్రిప్షన్ లో రాశారు.

Battlegrounds Mobile India Download చేయడం ఎలా
ముందుగా BGMIలో రిజిష్టర్ అయి ఉన్న వారు ప్లే స్టోర్ లో అప్ డేట్ చేసుకోవాలి. అలా చేయని వారు డౌన్ లోడ్ చేసుకోవాలి. యాండ్రాయిడ్ డివైజ్ లో Battlegrounds Mobile India అని టైప్ చేసి డౌన్ లోడ్ బటన్ క్లిక్ చేయడమే. పబ్ జీ గేమ్ బ్యాన్ చేయకముుందు ఉన్న యాప్ ఉంటే ఆ యాప్ ను బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాకు మార్చడం ద్వారా డేటాను ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.

Battlegrounds Mobile India హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్
ఈ గేమ్ .. యాండ్రాయిడ్ 5.11 అంతకంటే ఎక్కువ వెర్షన్లు అన్నింటికీ సపోర్టు చేస్తుంది. కనీసం 2జీబీ మెమొరీ ఉన్న ఫోన్లలోనే ఇది సపోర్ట్ చేస్తుంది. 2021 డిసెంబర్ 31వరకూ డేటా ట్రాన్సఫర్ చేసుకునే వీలుంది. డేటా ట్రాన్సఫర్ కుదరని పక్షంలో నార్మల్ గా యాప్ ఇన్ స్టాల్ చేసుకుని ఆడుకోవచ్చు/వాడుకోవచ్చు.