Mobile Phone Apps : యాప్స్‌తో యమ డేంజర్.. గుడ్డిగా యాక్సెస్ ఇచ్చేస్తున్నారా? అర్కా నివేదికలో షాకింగ్ విషయాలు

మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. మీ గుట్టంతా కనిపెట్టే వాళ్లు చాలామందే ఉన్నారు. ఎందుకంటే, మీ ఫోన్ లో ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు మీ కదలికలను ట్రాప్ చేస్తున్నాయి. ఆ సమాచారం కనుక హ్యాకర్స్ చేతికి చిక్కితే.. ఇక అంతే.

Mobile Phone Apps : యాప్స్‌తో యమ డేంజర్.. గుడ్డిగా యాక్సెస్ ఇచ్చేస్తున్నారా? అర్కా నివేదికలో షాకింగ్ విషయాలు

Mobile Phone Apps : మీరు సీక్రెట్ గా ఎక్కడికైనా వెళ్తున్నారా? ఆ విషయం ఎవరికీ తెలియదనుకుంటున్నారా? మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. మీ గుట్టంతా కనిపెట్టే వాళ్లు చాలామందే ఉన్నారు. ఎందుకంటే, మీ ఫోన్ లో ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు మీ కదలికలను ట్రాప్ చేస్తున్నాయి. ఆ సమాచారం కనుక హ్యాకర్స్ చేతికి చిక్కితే.. ఇక అంతే. మీరు రహస్యంగా వేసిన ప్రతీ అడుగు అందరికీ తెలిసిపోయినట్లే. దీనికి ప్రధాన కారణం మొబైల్ ఫోన్ లో ఉన్న యాప్స్. అడిగినన్ని పర్మిషన్స్ ఇచ్చేయడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అంటోంది ప్రముఖ అధ్యయన సంస్థ ఆర్కా.

మొబైల్ యాప్స్, వెబ్ సైట్ల అధ్యయనం ఆధారంగా ఆర్కా ఈ రిపోర్టును తయారు చేసింది. మీరు ఏ రోజు ఎక్కడ ఉన్నారు? ఎక్కడెక్కడ తిరిగారు? అన్న వివరాలన్నీ మీ ఫోన్ లోని యాప్స్ లో ఇట్టే తెలిసిపోతాయి. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్కా అభిప్రాయపడింది. ఆయా దేశాలు దీనిపై తక్షణం చెక్ చేసుకోవాలని, లేదంటే సమాచారం మొత్తం హ్యాకర్స్ చేతిలోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అర్కా సంస్థ మొత్తం 200 మొబైల్ యాప్స్, వెబ్ సైట్స్ స్టడీ చేసి ఈ వివరాలను అందించింది.

Also Read..Google Apps Block : ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? గూగుల్ బ్లాక్ చేస్తుంది జాగ్రత్త.. ఎందుకో తెలుసా?

ఇందులో భారత్ లోని 25 రంగాలకు చెందిన వంద సంస్థలు.. అమెరికా, యూరప్ లోని 76 సంస్థల్లో పని చేస్తున్న వారి నుంచి వివరాలు సేకరించింది. పిల్లల కోసం ప్రత్యేక కేటగిరీలో 30 యాప్స్ స్టడీ చేసింది. ఇందులో చాలామంది ఇష్టానుసారంగా అవగాహన లేకుండా యాప్స్ కు యాక్సెస్ ఇచ్చేశారని అర్కా సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం 53శాతం యాప్స్ అన్నీ మీ ఫోన్ కు యాక్సెస్ అడుగుతున్నాయి. యాప్స్ ఉపయోగించే సమయంతో పాటు అన్ని వేళలా అనే ఆప్షన్ ను 59శాతం మంది ఎంచుకోగా, యాప్స్ ఉపయోగించే సమయంలో మాత్రమే యాక్సెస్ కు అనుమతించే వారు 23శాతంగా ఉన్నారు. ఆల్ వేస్ అనే ఆప్షన్ ను ఎవరూ అంగీకరించడం లేదని ఈ సర్వేలో తేలింది. మిగిలిన 18శాతం మంది ఎలాంటి యాక్సెస్ కు అనుమతి ఇవ్వకుండానే కామ్ గా ఉంటారని అర్కా తమ తాజా అధ్యయనంలో వెల్లడించింది.

Also Read..Twitter Users : మీ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయిందా? ఫిబ్రవరి 1 నుంచి అప్పీల్ చేసుకోవచ్చు..!

ఐవోఎస్ యాప్స్ లో మైక్రో ఫోన్ ద్వారా 64శాతం మంది యాక్సెస్ ఇస్తుననారు. అయితే, ఆండ్రాయిడ్ యాప్స్ కు 76శాతం మంది కచ్చితమైన లొకేషన్ కు పర్మిషన్ ఇస్తున్నారు. ఇలా పర్మిషన్ ఇవ్వడమే అత్యంత ప్రమాదకరంగా మారిందంటోంది ఆర్కా రిపోర్ట్. ఇక ఆండ్రాయిడ్ ఫోన్స్ లో యాప్స్ అడుగుతున్న కెమెరా పర్మిషన్ ను 76శాతం మంది, మైక్రో ఫోన్ కు 57శాతం మంది, కాంటాక్ట్స్ కు 43శాతం, ఎస్ఎంఎస్ కు 32శాతం, ఫింగర్ ప్రింట్ కు 25శాతం మంది పర్మిషన్ ఇస్తున్నారు.

అలాగే, ఐవోఎస్ యాప్స్ లో 83శాతం మంది కచ్చితమైన లొకేషన్ కు యాక్సెస్ ను ఇస్తున్నారు. కెమెరాకు 81శాతం, ఫోటోలకు 90శాతం, మైక్రో ఫోన్ కు 64శాతం, కాంటాక్ట్స్ కు 49శాతం, ఎస్ఎంఎస్ కు 36శాతం మంది యాక్సెస్ కు పర్మిషన్ ఇస్తున్నారు. ఇష్టానుసారంగా యాప్స్ కు యాక్సెస్ ఇస్తే చాలా అనర్థాలు తప్పవని అర్కా హెచ్చరిస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మొబైల్ ట్రాకర్, కుకీల ద్వారా మీ ఫోన్ లోని సమాచారం బహిర్గతం కానుందని, అందుకే యాప్ కు పర్మిషన్ ఇచ్చే సమయంలో ఒకటికి 10సార్లు ఆలోచించాలని, అవసరమైతే తప్ప యాప్స్ కు యాక్సెస్ ఇవ్వొద్దని అర్కా సూచించింది.