Best 4G-5G Phones : రూ.20వేల లోపు బెస్ట్ 4G-5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి?

Best 4G-5G Phones : భారత మార్కెట్లో రూ. 20వేల లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులో ఉన్నాయి. అందులో 4G నెట్ వర్క్, 5G నెట్‌వర్క్ సపోర్ట్‌ అందించే స్మార్ట్‌ఫోన్‌లు ఆకర్షణీయమైన ధరకే అందుబాటులో ఉన్నాయి.

Best 4G-5G Phones : రూ.20వేల లోపు బెస్ట్ 4G-5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి?

Best 4g And 5g Smartphones Under Rs 20,000 Oneplus Nord Ce 2 Lite 5g, Redmi Note 11 Pro And More (8)

Best 4G-5G Phones : భారత మార్కెట్లో రూ. 20వేల లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులో ఉన్నాయి. అందులో 4G నెట్ వర్క్, 5G నెట్‌వర్క్ సపోర్ట్‌ అందించే స్మార్ట్‌ఫోన్‌లు ఆకర్షణీయమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. స్పెసిఫికేషన్‌లలో ఏమాత్రం రాజీపడని 4G ప్రాసెసర్‌లతో చాలా స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. బడ్జెట్ తగినట్టుగా ఫీచర్లు కూడా అంతే అందిస్తున్నాయి మొబైల్ కంపెనీలు. రూ. 20,000లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లలోనూ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అందులో కొన్ని 4G స్మార్ట్ ఫోన్లతో పాటు 5G స్మార్ట్‌ఫోన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏయే బ్రాండ్ల ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు, ఎంత ధరతో అందిస్తున్నాయో ఓసారి చూద్దాం..

OnePlus Nord CE 2 Lite 5G (Rs 19,999)

భారత మార్కెట్లో OnePlus అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్. భారీ బడ్జెట్ అవసరం లేకుండా సింపుల్‌గా ఈ కొత్త ఆక్సిజన్ OS 12 స్మార్ట్ ఫోన్ ఎంచుకోవచ్చు. Nord CE 2 Lite 5G స్మార్ట్ ఫోన్ మెరుగైన హార్డ్‌వేర్‌ను అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6/59-అంగుళాల IPS LCD, స్నాప్‌డ్రాగన్ 695 SoC, 5000 mAh బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వెనుకవైపు 64MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది.

Best 4g And 5g Smartphones Under Rs 20,000 Oneplus Nord Ce 2 Lite 5g, Redmi Note 11 Pro And More

Best 4g And 5g Smartphones Under Rs 20,000  

Redmi Note 11 Pro

భారత మార్కెట్లో Redmi Note 11 Pro స్మార్ట్ ఫోన్.. రూ. 20,000 లోపు అత్యుత్తమ 4G స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు చేస్తే.. MediaTek Helio G96 SoC, 120Hz 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 108MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను పొందవచ్చు. 5000 mAh బ్యాటరీతో పాటు ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. భారత మార్కెట్లో Redmi Note 11 Pro బేస్ 6GB RAM ఆప్షన్ ధర రూ. 17,999 నుంచి ప్రారంభమవుతుంది.

Best 4g And 5g Smartphones Under Rs 20,000 Oneplus Nord Ce 2 Lite 5g, Redmi Note 11 Pro And More (1)

Best 4g And 5g Smartphones Under Rs 20,000  

Redmi Note 11T 5G

రూ. 20,000 లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలోకి Redmi స్మార్ట్‌ఫోన్ Redmi Note 11T 5G కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 810 SoC, 90Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5000 mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. భారత మార్కెట్లో Redmi Note 11T 5G బేస్ 6GB + 64GB స్టోరేజ్ ధర రూ.15,999 నుంచి ప్రారంభమవుతుంది.

Best 4g And 5g Smartphones Under Rs 20,000 Oneplus Nord Ce 2 Lite 5g, Redmi Note 11 Pro And More (2)

Best 4g And 5g Smartphones Under Rs 20,000  

Realme 9 Pro 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్‌మి కంపెనీ నుంచి Realme 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్ రూ. 24,999కి లాంచ్ అయింది. అయితే రియల్‌మే 9 సిరీస్ మొదటిసారిగా రూ. 20,000 ధరను దాటేసింది. ఇప్పటికీ రూ. 20,000 లోపు Realme 9 Pro 5G స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. రూ. 18,999 ధరతో ఈ ఫోన్ 64MP ట్రిపుల్-కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 695 SoC, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000 mAh బ్యాటరీ, 120Hz LCDని అందిస్తుంది.

Best 4g And 5g Smartphones Under Rs 20,000 Oneplus Nord Ce 2 Lite 5g, Redmi Note 11 Pro And More (3)

Best 4g And 5g Smartphones Under Rs 20,000  

Moto G71 5G

భారత మార్కెట్లో Moto G71 ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీతో పాటు సెగ్మెంట్-ఫేవరెట్ స్నాప్‌డ్రాగన్ 695 SoC, 50MP ట్రిపుల్-కెమెరా సెటప్, 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. అయితే ఫోన్ అధిక రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌తో రాలేదు.

Best 4g And 5g Smartphones Under Rs 20,000 Oneplus Nord Ce 2 Lite 5g, Redmi Note 11 Pro And More (4)

Best 4g And 5g Smartphones Under Rs 20,000  

Vivo T1 5G

Vivo T1 5G స్నాప్‌డ్రాగన్ 695 SoCతో వచ్చిన అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. కోర్ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. దీని ధర రూ. 15,990కి కొనుగోలు చేయవచ్చు. అలాగే 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.58-అంగుళాల 120Hz LCD 50MP ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది.

Best 4g And 5g Smartphones Under Rs 20,000 Oneplus Nord Ce 2 Lite 5g, Redmi Note 11 Pro And More (5)

Best 4g And 5g Smartphones Under Rs 20,000  

iQOO Z6 5G

ఈ ఫోన్ Vivo T1 5Gతో మరో పేరుతో వచ్చింది. iQOO Z6 5G బేస్ మోడల్ రూ. 15,499కి అందుబాటులో ఉంది. ఐక్యూ ఫోన్ ధర తక్కువకే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఫీచర్లతో పాటు ధర కూడా సరసమైన ధరకే అందుబాటులో ఉంది.

Best 4g And 5g Smartphones Under Rs 20,000 Oneplus Nord Ce 2 Lite 5g, Redmi Note 11 Pro And More (6)

Best 4g And 5g Smartphones Under Rs 20,000  

Samsung Galaxy M33 5G

శాంసంగ్ Galaxy M33 5G ధర రూ. 20వేల లోపు అందుబాటులో ఉండగా.. దీని అసలు ధర రూ. 17,999కు అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ యూజర్లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల LCD, Exynos 1280 SoC, 50MP ట్రిపుల్-కెమెరా సెటప్, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 mAh బ్యాటరీని పొందవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా OneUI 4.1తో రన్ అవుతుంది.

Best 4g And 5g Smartphones Under Rs 20,000 Oneplus Nord Ce 2 Lite 5g, Redmi Note 11 Pro And More (7)

Best 4g And 5g Smartphones Under Rs 20,000