Best 5G Phones : మార్చిలో రూ. 20వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best 5G Phones : మీ బడ్జెట్‌లో మంచి సరసమైన 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే ఈ కింది జాబితాలో నాలుగు 5G ఫోన్లు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేసుకోండి. అవేంటో ఓసారి చూద్దాం..

Best 5G Phones : మార్చిలో రూ. 20వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best 5G phones to buy in India under Rs 20,000 in March 2023_ Poco X5 and 3 more

Best 5G Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ. 20వేల ధరల విభాగంలో చాలా 5G ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో ఆల్ రౌండర్ డీసెంట్ ఫోన్‌లకు ఫుల్ గిరాకీ ఉంటుంది. మంచి కెమెరా ఫోన్‌తో పాటు మెరుగైన పర్ఫార్మెన్స్ కావాలంటే కొద్దిగా బడ్జెట్ పెంచుకోవాల్సిందే. కొనుగోలుదారులు తమ బడ్జెట్‌ను రూ.30వేల సెగ్మెంట్‌కు పెంచుకుంటే మరిన్ని ప్రీమియం ఫీచర్లతో అద్భుతమైన 5G ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అందించే జాబితాలో రూ. 20వేల లోపు 5G ఫోన్‌లు ఉన్నాయి. కేవలం ప్రాథమిక వినియోగానికి సగటు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మీ బడ్జెట్‌లో మంచి సరసమైన 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే ఈ కింది జాబితాలో నాలుగు 5G ఫోన్లు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేసుకోండి. అవేంటో ఓసారి చూద్దాం..

Poco X5 :
ఈ బడ్జెట్ పోకో X5 5G ఫోన్.. సాధారణ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. పరిమితంగా వినియోగిస్తే ఒక రోజు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుంది. కంపెనీ 5G ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో 33W ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. రూ. 20వేల కేటగిరీలో అనేక డివైజ్‌లలో అందుబాటులో ఉంది. మంచి చిప్‌సెట్, యూజర్లకు సాధారణ పనితీరును అందించదు. గ్రాఫికల్‌గా డిమాండ్ ఉన్న గేమ్‌లు ఆడవచ్చు, కానీ, మీరు తక్కువ సెట్టింగ్‌లలో మాత్రమే లాగ్-ఫ్రీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Best 5G phones to buy in India under Rs 20,000 in March 2023_ Poco X5 and 3 more

Best 5G phones to buy in India under Rs 20,000 in March 2023_ Poco X5

Read Also : Samsung Galaxy F14 5G : మార్చి 24న శాంసంగ్ గెలాక్సీ F14 5G వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

డిస్‌ప్లేతో పాటు ధర కూడా చాలా బాగుంది. మీరు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల Full HD+ సూపర్ AMOLED స్క్రీన్‌ని పొందవచ్చు. ఈ ప్యానెల్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ లేయర్ కూడా ఉంది. స్క్రీన్ 1200నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది సూర్యకాంతిలో చాలా చక్కగా కనిపిస్తుంది. ఇందులో హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. కానీ, ఒకే స్పీకర్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. (Poco X5) ధర రూ. 18,999తో వస్తుంది.

iQOO Z6 :
ఐక్యూ Z6 5G ఫోన్ మోడల్ బెస్ట్ ఆప్షన్లలో ఇదొకటి. Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో వచ్చింది. కాలింగ్, మెసేజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్‌తో కూడిన ప్రాథమిక వినియోగంతో లాగ్-ఫ్రీ పర్మార్మెన్స్ అందించింది. మీరు సాధారణం గేమ్‌లను కూడా ఆడవచ్చు. గ్రాఫికల్‌గా డిమాండ్ చేసే గేమ్‌లు కూడా ఆడవచ్చు, కానీ, తక్కువ సెట్టింగ్‌లలో డివైజ్120Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. ధర పరిధిలోని చాలా ఫోన్‌లతో సాధారణంగా పొందలేరు. LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. చాలా శక్తివంతమైనది. సగటు యూజర్లకు పెద్దగా సమస్య ఉండదు. డిస్ప్లే సైజుతో పోలిస్తే.. 6.58-అంగుళాలు కలిగి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లోని లిస్టింగ్ ప్రకారం.. కంపెనీ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో తగినంత పెద్ద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Best 5G phones to buy in India under Rs 20,000 in March 2023_ Poco X5 and 3 more

Best 5G phones to buy in India under Rs 20,000 in March 2023_ Poco X5

ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. ఈ డివైజ్ కొన్ని ఫొటోలలో చాలా అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది. యూజర్లు తమ Instagram అకౌంట్ కోసం మంచి షాట్‌లను పొందవచ్చు. ఈ 5G ఫోన్ అదనపు బోనస్ ఏమిటంటే.. కంపెనీ దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్టును అందిస్తుంది. రెండు ఏళ్ల మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో పాటు 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందిస్తుంది. హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ది బాక్స్‌తో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 14 OSని పొందడానికి కూడా అర్హత కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో iQOO Z6 ధర రూ. 14,710తో అందుబాటులో ఉంది.

Realme 10 Pro :
రియల్‌మి 10 Pro అనేది మరో 5G ఫోన్. ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు. పెద్ద 6.7-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది. ఇందులో LCD ప్యానెల్ ఉంది. కానీ, 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. దాదాపు సున్నా బెజెల్స్, వైబ్రెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కంటెంట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఆనందదాయకంగా చేస్తుంది. పర్మార్మెన్స్ డీసెంట్‌గా ఉంది. 5G ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 SoCని ఉపయోగిస్తుంది. సోషల్ నెట్‌వర్కింగ్, కాలింగ్, క్యాజువల్ గేమ్‌లను వినియోగించుకోవచ్చు.

Best 5G phones to buy in India under Rs 20,000 in March 2023_ Poco X5 and 3 more

Best 5G phones to buy in India under Rs 20,000 in March 2023_ Poco X5

కెమెరా పర్మార్మెన్స్ బాగానే ఉంది. మీకు ఉపయోగపడే షాట్‌లను అందిస్తుంది. హుడ్ కింద 5,000mAh బ్యాటరీ ఉంది. మీ వినియోగం తక్కువగా ఉంటే.. రోజంతా మీ ఫోన్‌ను రన్ చేస్తూనే ఉంటుంది. కంపెనీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌ని అందిస్తుంది. సెగ్మెంట్‌లో వేగవంతమైనది కాదు. బ్యాటరీని త్వరగా టాప్ అప్ చేయడంలో సాయపడుతుంది. స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో Realme 10 Pro ధర రూ. 18,999 నుంచి అందుబాటులో ఉంది.

Redmi Note 12 :
షావోమీ (Xiaomi) ఫోన్ కోసం చూస్తున్న యూజర్ల కోసం (Redmi Note 12) కూడా ఉంది. కొత్త స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మీ రోజువారీ అవసరాలకు చాలా వేగంగా పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 695 SoC ఉన్న ఫోన్‌ల కన్నా మరింత సమర్థవంతమైనది. సాధారణ 5,000mAh బ్యాటరీ ఉంది.

Best 5G phones to buy in India under Rs 20,000 in March 2023_ Poco X5 and 3 more

Best 5G phones to buy in India under Rs 20,000 in March 2023_ Poco X5

చాలా సరసమైన ఫోన్‌లలోనూ లభిస్తుంది. కంపెనీ 33W ఛార్జింగ్‌కు సపోర్టును అందించింది. ఛార్జర్ బ్యాటరీని టాప్ అప్ చేసేందుకు గంట కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఇతర ఫీచర్లలో 6.7-అంగుళాల సైజులో ఉన్న AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. సున్నితమైన స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. రెడ్‌మి Note 12 ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 17,999 ధరతో అందుబాటులో ఉంది.

Read Also : Hyundai Verna 2023 : హ్యుందాయ్ వెర్నా 2023 మోడల్ కారు వచ్చేస్తోంది.. మార్చి 21నే లాంచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?