Best Jio Prepaid Plans : జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. హైస్పీడ్ డేటా.. నో డెయిలీ లిమిట్.. రోజుంతా ఎంజాయ్ చేయొచ్చు!

ప్రముఖ టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ జియో సరికొత్త ప్లాన్లను తీసుకొస్తోంది.

Best Jio Prepaid Plans : జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. హైస్పీడ్ డేటా.. నో డెయిలీ లిమిట్.. రోజుంతా ఎంజాయ్ చేయొచ్చు!

Best Jio Prepaid Plans Under Rs 500

Best Jio prepaid plans under Rs 500 : ప్రముఖ టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ జియో సరికొత్త ప్లాన్లను తీసుకొస్తోంది. ఇటీవలే జియో ప్రీడమ్ ప్లాన్లు (Jio Freedom Plans) రూ.127, రూ. 2397 ప్లాన్లను లాంచ్ చేసింది. ఈ ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే హైస్పీడ్ డేటాతో డెయిలీ లిమిట్ లేదు.. రోజుంతా డేటాను ఎంజాయ్ చేయొచ్చు. అలాగే జియో (Freedom Plans)లో భాగంగా పాపులర్ OTT Streaming Services ఆఫర్ చేస్తోంది. ఇటీవలే గూగుల్, జియో సంయుక్తంగా అభివృద్ధి చేసిన JIO PHONE NEXT 5G ఫోన్‌ను సెప్టెంబర్ 10న అందుబాటులోకి తీసుకురానుంది.

పాపులర్ స్ట్రీమింగ్ సర్వీసుల నుంచి (OTT Free Subscription) ఉచితంగా సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అన్ని నెట్ వర్లకు పొందవచ్చు. Free SMS రోజూ ఉచితంగా ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. హైస్పీడ్ డెయిలీ డేటాను పొందవచ్చు. జియో ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.500 లోపు (Best Jio prepaid plans under Rs 500) కింద సరికొత్త ప్లాన్లను అందిస్తోంది. జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఏయే అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం..

Best Jio prepaid plans under Rs 500 :

Jio Rs 447 prepaid plan : రిలయన్స్ జియో Freedom Plans లో భాగంగా రూ. 447 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ కింద 60 రోజుల వ్యాలిడిటీతో 50GB హైస్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, కాంప్లిమెంటరీ సబ్ స్ర్కిప్షన్ (Jio Apps) ఆఫర్ చేస్తోంది.

Jio Rs 444 prepaid plan : ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 112GB హైస్పీడ్ (4G Data) 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా వరకు పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS, కంప్లిమెంటరీ సబ్ స్ర్కిప్షన్ (Jio Apps) వంటి JioTV, JioCinema, JioCloud యాక్సస్ చేసుకోవచ్చు.

Jio Rs 401 prepaid plan : జియో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్ కింద (రూ.401 ప్లాన్) రోజుకు 3GB డేటాను పొందవచ్చు. అదనంగా 28 రోజుల వ్యాలిడిటీతో 4G డేటాను 6GB వరకు పొందవచ్చు. అలాగే అన్ని నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ డొమెస్టిక్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100SMS లు పొందవచ్చు. జియో ప్రీపెయిడ్ యూజర్లు (Jio prepaid subscribers) ఏడాది పాటు Disney+ Hotstar VIP సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు.

Jio Rs 399 prepaid plan : జియో అందించే రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డెయిలీ డేటాను అందిస్తోంది. మొత్తంగా 84GB డేటాను పొందవచ్చు. అలాగే రూ. 444 రీచార్జ్ ప్యాక్ ద్వారా ప్రీపెయిడ్ ప్లాన్లలో Free SMS, వాయిస్ కాల్ బెనిఫిట్స్, Jio apps ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.

Jio Rs 247 prepaid plan : రిలయన్స్ జియో అందించే ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.247 ప్లాన్ ఒకటి. 25GB డేటాతో రోజుకు 100SMS పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 30రోజుల వ్యాలిడిటీపై పొందవచ్చు.