Best Mobiles April 2022 : ఈ నెలలో రూ.20వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Best Mobiles April 2022 : మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 20వేల కన్నా తక్కువ ధరకే ఆసక్తికరమైన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి.

Best Mobiles April 2022 : ఈ నెలలో రూ.20వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Best Mobile Phones Under Rs 20,000 In April 2022 Realme 9 5g Se, Redmi Note 11 Pro Are Top Picks

Best Mobiles April 2022 : మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Xiaomi, Realme మొబైల్ మేకర్లతో పాటు సౌత్ కొరియన్ దిగ్గజం Samsung, Motorola వంటి బ్రాండ్‌లు రూ. 20వేల కన్నా తక్కువ ధరకే ఆసక్తికరమైన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. ఈ ఫోన్లలో మంచి స్పెసిఫికేషన్‌లు మాత్రమే కాకుండా స్టైలిష్‌గా కూడా ఉంటాయి. ఈ ఫోన్‌లలో పవర్‌ఫుల్ డిస్‌ప్లేలు, అధిక రిఫ్రెష్ రేట్, స్పీడ్ ప్రాసెసర్‌లు, ఆకర్షణీయమైన కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో బ్యాటరీలను అందిస్తున్నాయి. మీరు కూడా రూ.20వేల లోపు మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ల కోసం చూస్తేంటే.. ఈ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు, ధరలను ఓసారి ట్రై చేయండి.

Realme 9 5G స్పీడ్ ఎడిషన్ :
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Realme ఫోన్ల లైనప్‌లో మొదటిదిగా చెప్పవచ్చు. Realme9 5G స్పీడ్ ఎడిషన్ లేదా Realme9 5G SEగా పిలుస్తారు. అద్భుతమైన స్పెషిఫికేషన్లతో వచ్చింది. 6.6-అంగుళాల LCDతో 144Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్‌, Full-HD రిజల్యూషన్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. 8GB వరకు RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో ఆక్టా-కోర్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్ అందిస్తోంది. ఫోన్ మెమెరీ పెంచుకోవాలంటే మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. Realme 9 5G SEలోని కెమెరాలలో 48-MP ప్రధాన సెన్సార్, రెండు 2-MP సహాయక సెన్సార్లు, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16-MP కెమెరా ఉన్నాయి. Realme 9 5G SEలో30W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు, 5000mAh బ్యాటరీతో వచ్చింది. Realme 9 5G SE ప్రారంభ ధర రూ 19,999 నుంచి కంపెనీ వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ ధర అందిస్తోంది.

Best Mobile Phones Under Rs 20,000 In April 2022 Realme 9 5g Se, Redmi Note 11 Pro Are Top Picks (1)

Best Mobile Phones Under Rs 20,000 In April 2022 Realme 9 5g Se, Redmi Note 11 Pro Are Top Picks 

Redmi Note 11 Pro :
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెడ్ మి లేదా షావోమీ బ్రాండ్లు లేకుండా ఉండవు. ప్రతి స్మార్ట్ ఫోన్ల లిస్టులో ఈ బ్రాండ్ల మోడల్స్ తప్పనిసరిగా ఉంటాయి. రూ. 20,000 సెగ్మెంట్‌లో చూస్తే. Redmi Note 11 Pro యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. 6.67-అంగుళాల Full-HD సూపర్ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్‌లతో వచ్చింది. స్క్రీన్-టు-బాడీ రేషియో 86 శాతం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. MediaTek Helio G96, 4G ప్రాసెసర్ అందిస్తోంది. స్పీడ్ ప్రాసెసర్, 5G ఫోన్, మైక్రో SD కార్డ్‌ సపోర్టుతో గరిష్టంగా 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తోంది. Redmi Note 11 Proలో 108-MP కెమెరాను అందిస్తోంది. 8-MP అల్ట్రావైడ్ కెమెరా మరో రెండు 2-MP కెమెరాలు, సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. భారత మార్కెట్లో Redmi Note 11 Pro ధర రూ. 17,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫాంటమ్ వైట్, స్టెల్త్ బ్లాక్ స్టార్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Best Mobile Phones Under Rs 20,000 In April 2022 Realme 9 5g Se, Redmi Note 11 Pro Are Top Picks (2)

Best Mobile Phones Under Rs 20,000 In April 2022 Realme 9 5g Se, Redmi Note 11 Pro Are Top Picks

Vivo T1 5G :
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి 5G స్మార్ట్ ఫోన్ Vivo T1 5G. రూ. 20వేల స్మార్ట్ ఫోన్లలో 5G కనెక్టివిటీని అందించే ఫోన్లలో ఇదొకటి. ఈ ఫోన్ Full-HD రిజల్యూషన్‌తో 6.58-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. ఇందులో రిఫ్రెష్ రేట్ పెద్దగా లేదు. T1 5G మోడల్ ఫోన్ 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. మైక్రో SD కార్డ్‌కు సపోర్టు కూడా అందిస్తుంది. Vivo T1 5Gలో కెమెరాలలో 50-MP ప్రధాన సెన్సార్, రెండు 2-MP సహాయక సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 16-MP కెమెరా ఉంది. Vivo T1 5G 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. Vivo T1 5G ప్రారంభ ధర రూ. 15,990తో అందుబాటులో ఉంది. Vivo ఆన్‌లైన్ స్టోర్ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ రూ. 1,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Best Mobile Phones Under Rs 20,000 In April 2022 Realme 9 5g Se, Redmi Note 11 Pro Are Top Picks (3)

Best Mobile Phones Under Rs 20,000 In April 2022 Realme 9 5g Se, Redmi Note 11 Pro Are Top Picks 

Poco X4 Pro 5G :
Poco X4 Pro కంపెనీ X-సిరీస్‌లో ఫోర్త్ జనరేషన్ ఫోన్. 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 64-MP కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. డిస్‌ప్లే Full-HD రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ సపోర్టు అందిస్తుంది. ఈ ప్రాసెసర్ 5Gకి సపోర్టు అందిస్తుంది. 8GB RAM, 256GB స్టోరేజీతో వచ్చింది. కెమెరాలలో 108-MP సెన్సార్, 8-MP సెన్సార్ 2-MP సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరాలో 16-MP సెన్సార్ ఉంది. Poco X4 Pro 5G 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో వచ్చింది. Poco X4 Pro ధర రూ. 18,999 ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌తో వచ్చింది.

Best Mobile Phones Under Rs 20,000 In April 2022 Realme 9 5g Se, Redmi Note 11 Pro Are Top Picks (5)

Best Mobile Phones Under Rs 20,000 In April 2022 Realme 9 5g Se, Redmi Note 11 Pro Are Top Picks

 

Read Also : Best Smartphones 2022 : ఈ నెలలో రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఫీచర్లు, ధర ఎంతంటే?