Best Smartphones 2022 : ఈ నెలలో రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Best Smartphones 2022 : మీ బడ్జెట్‌లో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏ బ్రాండ్, మోడల్ స్మార్ట్ ఫోన్ కొనాలా? అని ఆలోచిస్తున్నారా?

Best Smartphones 2022 : ఈ నెలలో రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Best Smartphones 2022 Best Phones Under Rs 10,000 You Can Buy In India In April 2022 (1)

Best Smartphones 2022 : మీ బడ్జెట్‌లో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏ బ్రాండ్, మోడల్ స్మార్ట్ ఫోన్ కొనాలా? అని ఆలోచిస్తున్నారా? ఏయే ఫోన్లలో మంచి కెమెరా ఫీచర్లు ఉన్నాయా తెలుసుకోవాలా? అయితే మీకోసం.. అతి తక్కువ ధరకే, మీ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 2022లో భారత మార్కెట్లో సరికొత్త ఫీచర్లతో రూ.10వేల లోపు ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

గ్లోబల్ చిప్ కొరత కారణంగా దాదాపు చాలా స్మార్ట్ ఫోన్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కానీ, ఇప్పటికీ కొన్ని స్మార్ట్ ఫోన్ల సరసమైన ధరకే అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను ఆఫర్ చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ మేకర్లు కూడా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూ. 10వేల లోపు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ధరలను అందిస్తున్నాయి. ఆయా స్మార్ట్ ఫోన్లలో Realme, Redmi, Poco సహా మరికొన్ని బ్రాండ్‌లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ ఫోన్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.. ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో మీకు నచ్చిన మోడల్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోండి..

Redmi 9 :
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ Redmi 9 ఫోన్.. ఇది చాలా పాత మోడల్.. అయినప్పటికీ దీని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. భారత మార్కెట్లో రూ. 10,000లోపు ధరకు అందుబాటులో ఉంది. Redmi స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్, 4GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ రెండు వేరియంట్‌లలో వస్తోంది. Redmi 9 ధర రూ. 9,499 నుంచి ప్రారంభమై రూ. 9,999 వరకు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Helio G35 SoC, 4GB RAM, 128GB స్టోరేజీ, 13-MP AI డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 5-MP సెల్ఫీ షూటర్, 6.53-అంగుళాల HD+ డాట్ డ్రాప్ డిస్‌ప్లే, 5000mAh వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

Best Smartphones 2022 Best Phones Under Rs 10,000 You Can Buy In India In April 2022 (2)

Best Smartphones 2022 Best Phones Under Rs 10,000 You Can Buy In India In April 2022

Realme C31 :
ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 10వేల లోపు ధరకే అందుబాటులో ఉన్నాయి. బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో Realme C31 ఒకటిగా చెప్పవచ్చు. Unisoc T612 ప్రాసెసర్, 4GB వరకు LPDDR4X RAM, 64GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, 6.5-అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే, 13-MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, 5-MP సెల్ఫీ షూటర్ వంటి ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. బేస్ 3GB RAM+32GB ఇంటర్నల్ స్టోరేజీ ధర రూ. 8,999 అందుబాటులో ఉంది. 4GB RAM, 64GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.9,999లకు లభిస్తోంది.

Best Smartphones 2022 Best Phones Under Rs 10,000 You Can Buy In India In April 2022 (3)

Best Smartphones 2022 Best Phones Under Rs 10,000 You Can Buy In India In April 2022

Poco C31 :
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ Poco బ్రాండ్ నుంచి రూ.10వేల లోపు స్మార్ట్ ఫోన్లలో Poco C సిరీస్ ఒకటి అందుబాటులో ఉంది. అదే.. Poco C31 మోడల్.. Poco C31 అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకర్షించేలా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. 32GB, 64GB స్టోరేజ్‌తో వరుసగా ధర రూ. 8,499, రూ. 9,499తో అందుబాటులో ఉంది. 6.53-అంగుళాల HD+ డిస్ప్లే, 13-MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, MediaTek Helio G35 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీతో వచ్చింది.

Best Smartphones 2022 Best Phones Under Rs 10,000 You Can Buy In India In April 2022

Best Smartphones 2022 Best Phones Under Rs 10,000 You Can Buy In India In April 2022

Micromax In 2b :
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ రూ. 10,000లోపు కొన్ని స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. అందులో Micromax In 2b బెస్ట్ ఫోన్ గా చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T610 SoC, లార్జ్ 6.52-అంగుళాల HD+ డాట్ డ్రాప్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 5000mAh బ్యాటరీ సపోర్ట్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. బేస్ మోడల్ 4GB RAM, 64GB స్టోరేజీతో రూ. 8,999గా నిర్ణయించారు. 6GB RAM, 64GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర మార్కెట్లో రూ.9,999గా ఉంది.

Best Smartphones 2022 Best Phones Under Rs 10,000 You Can Buy In India In April 2022 (4)

Best Smartphones 2022 Best Phones Under Rs 10,000 You Can Buy In India In April 2022

Realme Narzo 30A :
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం సబ్ బ్రాండ్ రియల్‌మి నుంచి Narzo కొత్త సిరీస్ రిలీజ్ అయింది. Realme Narzo 30A కూడా రూ. 10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. 3GB RAM+32GB స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్‌కు రూ. 8,999 ధరకే లభిస్తోంది. 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్న టాప్-ఎండ్ మోడల్‌ ధర రూ. 9,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G85 SoC, 13-MP డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, లార్జ్ 6000mAh బ్యాటరీ, ఫుల్‌స్క్రీన్ మినీ డ్రాప్ డిస్‌ప్లేతో వచ్చింది.

Best Smartphones 2022 Best Phones Under Rs 10,000 You Can Buy In India In April 2022 (5)

Best Smartphones 2022 Best Phones Under Rs 10,000 You Can Buy In India In April 2022 

Read Also : Best Mobile Phones : రూ. 10వేల లోపు తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!