Best Plans of 2023 : 2023లో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా బెస్ట్ ప్లాన్లు ఇవే.. ఒకసారి రీఛార్జ్ చేస్తే.. ఏడాదిపాటు ఎంజాయ్ చేయొచ్చు!

Best Plans of 2023 : 2023 కొత్త ఏడాది వచ్చేసింది, ఈ కొత్త సంవత్సరంలో రాబోయే 365 రోజుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులోకి వచ్చేశాయి.

Best Plans of 2023 : 2023లో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా బెస్ట్ ప్లాన్లు ఇవే.. ఒకసారి రీఛార్జ్ చేస్తే.. ఏడాదిపాటు ఎంజాయ్ చేయొచ్చు!

Best plans of 2023 _ Jio, Airtel and Vodafone-idea plans with almost one year validity, unlimited benefits

Best Plans of 2023 : 2023 కొత్త ఏడాది వచ్చేసింది, ఈ కొత్త సంవత్సరంలో రాబోయే 365 రోజుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. టెలికం కంపెనీలు తమ వినియోగదారుల కోసం వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ (Annual Recharge Plans)లను అందిస్తున్నాయి. తద్వారా టెలికం వినియోగదారులు ఒక సంవత్సరానికిగానూ రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే.. ఒకసారి రీఛార్జ్ చేస్తే.. ఏడాది పాటు ఎంజాయ్ చేయొచ్చు.

ఈ దీర్ఘకాలిక ప్లాన్‌లలో అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ OTT ఆఫర్లను పొందవచ్చు. నెలవారీ లేదా త్రైమాసిక రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. మరెన్నో డేటా బెనిఫిట్స్ పొందాలంటే ఈ ఏడాది రీఛార్జ్ ప్లాన్లను ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి. టెలికం వినియోగదారులు 365 లేదా 336 రోజుల వ్యాలిడిటీతో వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నారా? అయితే, ఈ ప్లాన్‌లు మీ కోసమే. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, Vi (వోడాఫోన్ ఐడియా) అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ పొందాలంటే వార్షిక ప్లాన్‌ల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
రూ. 2545 ప్లాన్ : ఈ రీఛార్జ్ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 1.5Gb రోజువారీ డేటా బెనిఫిట్స్ సహా 504GB మొత్తం డేటా పొందవచ్చు. వినియోగదారులు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ పొందుతారు. అదనంగా, ఈ ప్లాన్‌లు JioTV, JioCinema, JioSecurity, JioCloudతో సహా Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందిస్తాయి.

రూ. 2879 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో పాటు 2GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తుంది. 730GB మొత్తం డేటాను అందిస్తుంది. వినియోగదారులు ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌ల బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Read Also : Best Reliance Jio Plans : రూ. 300 లోపు బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేటా బెనిఫిట్స్ మీకోసం..!

రూ. 2999 ప్లాన్ : జియో ఈ ప్లాన్‌పై స్పెషల్ వాల్యూను అందిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌పై 365 రోజులు +23 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. వినియోగదారులు 2.5 రోజువారీ డేటా లిమిట్ మొత్తం 912.5GB డేటాను పొందవచ్చు. అదనంగా, ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Best plans of 2023 _ Jio, Airtel and Vodafone-idea plans with almost one year validity, unlimited benefits

Best plans of 2023 _ Jio, Airtel and Vodafone-idea plans with almost one year validity

ముఖ్యంగా, ఈ ప్లాన్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద అందిస్తోంది. జియో వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. జియో యూజర్లు ఈ దీర్ఘకాలిక ప్లాన్‌తో 23 రోజుల అదనపు వ్యాలిడిటీని, 75GB అదనపు హై స్పీడ్ డేటాను పొందవచ్చు.

ఎయిర్‌టెల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
రూ. 3359 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో పాటు 2.5GB రోజువారీ డేటా లిమిట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు 1 ఏడాది మెంబర్‌షిప్ కూడా పొందవచ్చు. అదనంగా, ప్లాన్‌లో అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఫ్రీగా హెలోట్యూన్స్, ఉచిత Wink Music యాక్సెస్ పొందవచ్చు.

రూ. 2999 ప్లాన్ : ఎయిర్‌టెల్ వినియోగదారులు 2GB రోజువారీ డేటా బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను 365 రోజుల పాటు పొందుతారు. అదనంగా, ప్లాన్‌లో అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్స్, ఫ్రీ వింక్ మ్యూజిక్ యాక్సెస్ బెనిఫిట్స్ పొందవచ్చు.

రూ. 1799 ప్లాన్ : ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 24GB మొత్తం డేటాను, 365 రోజుల పాటు 3600 SMSలను అందిస్తుంది. ఎయిర్‌టెల్ సిమ్‌ (Airtel SIM)ను సెకండరీ సిమ్‌గా కలిగిన వినియోగదారులకు ఈ ప్లాన్ మంచి డీల్ అని చెప్పవచ్చు.

వోడాఫోన్ ఐడియా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
రూ. 3099 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో పాటు 2GB రోజువారీ డేటా బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. వినియోగదారులు అర్ధరాత్రి నుంచి అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ పొందుతారు.

వారాంతపు డేటా రోల్‌ఓవర్, Vi సినిమాలు, TV, Disney Plus Hotstarకి ఉచిత 1 సంవత్సరం సభ్యత్వాన్ని పొందవచ్చు. దానితో పాటు వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అదనంగా 75GB డేటాను కూడా పొందవచ్చు.

రూ. 2899 ప్లాన్ : వోడాఫోన్ ఐడియా యూజర్లు 1.5GB రోజువారీ డేటా బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను 365 రోజుల పాటు పొందవచ్చు. అదనంగా, ప్లాన్‌లో బింగే ఆల్ నైట్, వారాంతపు డేటా, Vi సినిమాలు, టీవీ, డేటా డిలైట్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G Services in India : దేశవ్యాప్తంగా జియో 5G సర్వీసులు.. కొత్తగా మరో 2 నగరాల్లోకి.. ఫుల్ లిస్టు ఇదిగో.. 5G వెల్‌కమ్ ఆఫర్ ఎలా పొందాలో తెలుసా?