Best Smartphones : రూ. 30వేల లోపు బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

Best smartphones : గేమింగ్ స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే సరసమైన ధరకే కొన్ని గేమింగ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Best Smartphones : రూ. 30వేల లోపు బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

Best Smartphones For Gaming Under Rs 30,000 In India

Best smartphones : గేమింగ్ స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే సరసమైన ధరకే కొన్ని గేమింగ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. 30వేల లోపు అద్భుతమైన గేమింగ్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లో లభ్యమవుతున్నాయి. 2022 ఏడాదిలో రూ.30వేల లోపు గేమింగ్ స్మార్ట్ ఫోన్ల సిగ్మెంట్ లో అనేక బ్రాండ్ల ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇందులో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్-ఇన్-క్లాస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తున్నాయి. మరికొన్ని సరసమైన ధరలో ఫ్లాగ్‌షిప్-గ్రేడ్‌పై దృష్టి సారించాయి. మొబైల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్లలో రూ. 30,000 లోపు డివైజ్ నుంచి అత్యుత్తమ పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లకు గొప్ప వాల్యూను అందిస్తాయి. మీరు స్మార్ట్ ఫోన్ గేమింగ్ ఆడేందుకు రూ.30వేల లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ కొన్ని గేమింగ్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు.

iQOO Neo 6 :
iQOO Neo 6 నియో సిరీస్‌లో బ్రాండ్ నుంచి వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్. నియో 6 5G స్నాప్‌డ్రాగన్ 870 SoC, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఈ వెనుకవైపు 64MP ట్రిపుల్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ కూడా ఉంది. భారతదేశంలో iQOO Neo 6 ధర రూ. 29,999 నుంచి లాంచ్ అవుతుంది.

Best Smartphones For Gaming Under Rs 30,000 In India (1)

Best Smartphones For Gaming Under Rs 30,000 In India 

Xiaomi 11i Hypercharge :
Xiaomi 11i హైపర్‌ఛార్జ్ భారత మార్కెట్లో అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఫోన్ 4500 mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 920 SoCతో 8GB వరకు RAMతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.67-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ముందు కెమెరా టాప్ సెంటర్‌లో పంచ్ హోల్ కటౌట్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు 108MP మెయిన్ కెమెరా సెన్సార్, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. భారత మార్కెట్లో Xiaomi 11i హైపర్‌ఛార్జ్ ధర రూ. 26,999 నుంచి ప్రారంభం కానుంది.

Best Smartphones For Gaming Under Rs 30,000 In India (2)

Best Smartphones For Gaming Under Rs 30,000 In India 

Poco F3 GT :
Poco F3 GT స్మార్ట్ ఫోన్ MediaTek డైమెన్సిటీ 1200 SoCతో వచ్చింది. మల్టీ గేమ్‌లను కూడా సపోర్టు చేయగలదు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.67-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేతో ఉంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5060 mAh బ్యాటరీని కూడా అందిస్తుంది. F3 GT వెనుక 64MP ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. భారత మార్కెట్లో Poco F3 GT ధర రూ. 28,999 నుంచి ప్రారంభం అవుతుంది.

Best Smartphones For Gaming Under Rs 30,000 In India (3)

Best Smartphones For Gaming Under Rs 30,000 In India 

Oppo Reno 7 5G :
Oppo Reno 7 5Gలో Mediatek డైమెన్సిటీ 900 SoC, 4500 mAh బ్యాటరీతో వచ్చాయి. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.4-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. బాక్స్ వెలుపల 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కూడా వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి.

Best Smartphones For Gaming Under Rs 30,000 In India (4)

Best Smartphones For Gaming Under Rs 30,000 In India

Xiaomi Mi 11X/ Mi 11X Pro :
Xiaomi Mi 11X Pro స్మార్ట్ ఫోన్.. Amazon Indiaలో రూ. 29,999కి అందుబాటులో ఉంది. ఈ డివైజ్ 6.67-అంగుళాల Full HD+ 120Hz AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 888 SoC, 108MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. Mi 11X Pro 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4520 mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. Mi 11X Pro ధర కేవలం విక్రయాల సమయంలో రూ. 30వేల లోపు ఉండగా.. ప్రామాణిక Mi 11X కూడా గేమర్‌లకు చాలా మంచి ఆప్షన్. ఈ ఫోన్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 870 SoC, 48MP మెయిన్ కెమెరాను కలిగి ఉంది. మిగిలిన స్పెసిఫికేషన్‌లు ఒకేలా ఉన్నాయి.

Best Smartphones For Gaming Under Rs 30,000 In India (5)

Best Smartphones For Gaming Under Rs 30,000 In India 

Bonus: Poco F4 5G :
Poco F4 5G జూన్ 23న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. దేశంలో ఈ ఫోన్ ధర రూ. 30వేల లోపు ఉంటుందనే ప్రచారం ఉంది. స్నాప్‌డ్రాగన్ 870 SoC, 64MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. Redmi K40S లాంచ్ అవుతుందని అంచనా. ఈ ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD+ 120Hz AMOLED డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also :  Lava Smartphone : రూ.10వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. లావా ఫస్ట్ లుక్ ఇదిగో..!