కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10వేల లోపు Best స్మార్ట్ ఫోన్లు ఇవే

స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు కూడా పోటాపోటీగా తక్కువ బడ్జెట్ ఫోన్లను ఎట్రాక్టింగ్ ఫీచర్లతో న్యూ మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

10TV Telugu News

స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు కూడా పోటాపోటీగా తక్కువ బడ్జెట్ ఫోన్లను ఎట్రాక్టింగ్ ఫీచర్లతో న్యూ మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

సమ్మర్ సేల్ మొదలైంది. ఇండియన్ మార్కెట్లలోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు కూడా పోటాపోటీగా తక్కువ బడ్జెట్ ఫోన్లను ఎట్రాక్టింగ్ ఫీచర్లతో న్యూ మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో మొబైల్ యూజర్లు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఎగబడి కొనేస్తున్నారు. ఇండియా మొబైల్ మార్కెట్ లో ఇప్పటివరకూ రిలీజ్ అయిన తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు రూ.10వేల లోపు లభ్యమవుతున్నాయి. 

పాపులర్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు ఎక్కువగా పదివేల లోపు ధరతో అందుబాటులో ఉన్నాయి. షియోమీ కంపెనీ తమ కొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియా మొబైల్ మార్కెట్లలో రిలీజ్ చేసిన కొద్దికాలంలోనే ఎంతో పాపులర్ అయ్యాయి. మిగతా స్మార్ట్ ఫోన్లకంటే షియోమీ స్మార్ట్ ఫోన్లు ఫుల్ క్రేజ్ కొట్టేశాయి. అందులో రెడ్ మి నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఒకటి. అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, నోకియా 5.1 ప్లస్, రియల్ మి యు1, రియల్ మి3, షియోమీ రెడ్ మి 6 ప్రొ తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. రూ.10వేల లోపు లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్లలో ఏ బ్రాండ్ ఫోన్లు ఉన్నాయి.. వాటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేద్దాం. 

Asus జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 :  
అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో చీపెస్ట్ వేరియంట్ ఫోన్ ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం ఉంది. ఈ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్ లో రూ.8వేల 499గా ఉంది. రెండో వేరియంట్ స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజీతో అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.10వేల 499గా ఉంది. 

నోకియా 5.1 ప్లస్ : 
బడ్జెట్ సిగ్మంట్ స్మార్ట్ ఫోన్లలో నోకియా 5.1 ప్లస్ ఫోన్ ఒకటి. ఈ ఫోన్.. గ్లాస్ సాండ్ విచ్ డిజైన్ తో వచ్చింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో సింగిల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజీతో లభ్యమవుతోంది. ఈ ఫోన్ ధర రూ.9వేల 999. గ్లోస్ బ్లాక్, మిడ్ నైట్ బ్లూ రెండు కలర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.  

రియల్ మి 3 : 
చైనీస్ ఒప్పో సబ్ బ్రాండ్ ఇండియా మార్కెట్లలో రిలీజ్ చేసిన రియల్ మి3 స్మార్ట్ ఫోన్ యూజర్లను ఎంతో ఎట్రాక్ట్ చేస్తోంది. రియల్ మి3 ఆక్టా కోర్ (2.1GHz, క్వాడ్ కోర్, కార్టెక్స్ A73, 2GHz, క్వాడ్ కోర్, కార్టెక్స్ A53)ప్రాసెసర్ ఉంది. రియల్ మి3 వేరియంట్ పై 3GB/32GB పాటు 4GB ర్యామ్ ఉంది. 12nm మీడియా టెక్ హెలియో పీ70 Soc టెక్నాలజీపై ఈ ఫోన్ సాఫ్ట్ వేర్ రన్ అవుతుంది. డెవ్ డ్రాప్ నాచ్ డిజైన్.. రియల్ 2 ప్రొ ఫోన్ లో కూడా ఇదే డిజైన్ ఉంది. రియల్ మి3లో 6.2 అంగుళాల HD+ డిసిప్లే, 1520*720 రెజుల్యూషన్, 19:9 అస్పెక్ట్ రేషియో. ఈ ఫోన్ ధర రూ.8వేల 999గా ఉంది. 

రెడ్ మి నోట్ 7 : 
రెడ్ మి నోట్ 7 స్మార్ట్ ఫోన్.. ఎట్రాక్టింగ్ ఫీచర్లలో 12 మెగా ఫిక్సల్, 2 మెగా ఫిక్సల్ AI కెమెరా, 13 మెగా ఫిక్సల్ AI సెల్ఫీ కెమెరా యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. 6.3 అంగుళాల డిసిప్లే HD+ (1080*2340ఫిక్సల్) LTPS డిసిప్లే, 19.5:9 అస్పెక్ట్ రేషియో. 2.2GHz స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ Socతో పాటు అడ్రినో 512 గ్రాపిక్స్ కార్డు ఉంది. 3GB, 4GB ర్యామ్ స్టోరేజీ సామర్థ్యం ఉంది. ఆన్ బోర్డు స్టోరేజీ వేరియంట్స్ 32GB, 64GB సామర్థ్యంతో 256GB వరకు మైక్రో SD కార్డు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 9వేల 999గా మార్కెట్లలో లభ్యమవుతోంది.