Best Upcoming Smartphones : ఏప్రిల్ 2023లో రాబోయే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే మోడల్ ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Best Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 2023 ఏప్రిల్‌లో అద్భుతమైన ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీదారులు వినియోగదారుల కోసం సరికొత్త స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి.

Best Upcoming Smartphones : ఏప్రిల్ 2023లో రాబోయే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే మోడల్ ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Best Upcoming Smartphones Launching In India In April 2023

Best Upcoming Smartphones : 2023 ఏప్రిల్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో భారత్ అతిపెద్ద మార్కెట్‌. ఎందుకంటే.. భారత్‌లో ప్రతి ఏడాదిలో పదిలక్షల మంది కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకునేందుకు స్మార్ట్‌ఫోన్ మేకర్లు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నారు. అందులో సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung), ఆపిల్ (Apple), చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus), ఒప్పో (Oppo) మొదలైన స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ప్రతి ఏడాదిలో దేశంలో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్ మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 2023లో భారత మార్కెట్లోకి రానున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ (ఏప్రిల్ 4) :
ఈ ఏప్రిల్‌లో వన్‌ప్లస్ Nord CE 3 Lite ఫోన్ లాంచ్ కానుంది. (CE 3 Lite) గత ఏడాదిలో Nord CE 2కి అప్‌గ్రేడ్ వెర్షన్. ఏప్రిల్ మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ ధర సుమారు రూ. 25వేలు, OnePlus బడ్జెట్ ఆఫర్‌లలో ఒకటిగా ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద, 6.72-అంగుళాల, LCD స్క్రీన్‌తో వస్తుంది. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా పవర్ అందిస్తుందని భావిస్తున్నారు. (Nord CE 3 Lite) ముఖ్య ఫీచర్లలో స్క్రీన్ సైజ్ 6.72 అంగుళాల LCD స్క్రీన్, మెయిన్ కెమెరా : 108 MP, RAM/ఇంటర్నల్ స్టోరేజీ : 8 GB/128GB బ్యాటరీ సామర్థ్యం 5,000 mAhగా ఉంటుంది.

Poco F5 (ఏప్రిల్ 6) :
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (Poco) కొత్త డివైజ్ (Poco F5)ని ఏప్రిల్ 6న రిలీజ్ చేయనుంది. నివేదికల ప్రకారం.. Poco F5 సరికొత్త స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 SoCతో భారత మార్కెట్లో రానున్న ఫస్ట్స్మార్ట్‌ఫోన్. అంతేకాదు.. Poco F5 ఫోన్ 6.67-అంగుళాల AMOLED స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Best Upcoming Smartphones Launching In India In April 2023

Best Upcoming Smartphones : Image Source (Google)

Read Also : Best Smartphones in India : రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Poco F5 ధర సుమారు రూ. 5వేలుగా ఉండవచ్చు. ఈ డివైజ్ 8GB RAM, 128 GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. ఈ రాబోయే ఏప్రిల్ స్మార్ట్‌ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పెద్ద 5,500 mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. Poco F5 ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లలో రానుంది. అందులో స్క్రీన్ సైజ్ 6.67-అంగుళాల AMOLED స్క్రీన్, ప్రైమరీ కెమెరా 64 MP, RAM/ఇంటర్నల్ స్టోరేజీ 8 GB/128GB, బ్యాటరీ సామర్థ్యం 5,500 mAhతో రానుంది.

ఆసుస్ ROG ఫోన్ 7 (ఏప్రిల్ 13) :
ASUS కొత్త ఫ్లాగ్‌షిప్ ROG ఫోన్ 7 భారత మార్కెట్లో ఏప్రిల్ 13న దాదాపు రూ. 63,000 ధరతో కానుంది. ఏప్రిల్‌లో రాబోయే ఈ ఫోన్ Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా రానుంది. ఈ ఫోన్‌లో 16GB RAM, 512GB వరకు స్టోరేజీ ఆప్షన్లు ఉంటాయి. ఈ డివైజ్ భారీ 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.85-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా ఆప్టిమైజ్ అయింది. Asus ROG ఫోన్ 7 కీలక స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. స్క్రీన్ సైజ్ 6.85-అంగుళాల AMOLED స్క్రీన్, ప్రైమరీ కెమెరా 50 MP, IMX766, RAM/ఇంటర్నల్ స్టోరేజీ 16 GB/512 GB, బ్యాటరీ సామర్థ్యం 5,500 mAhతో రానుంది.

Vivo X90 సిరీస్ :
వివో కంపెనీ నుంచి వివో X90 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఏప్రిల్‌లో భారత మార్కెట్లో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా ధృవీకరించలేదు. Vivo X90 లైనప్‌లో X90, X90 Pro, X90 Pro+ ఉన్నాయి. వివో X90, X90 Proలు MediaTek Dimensity 9200 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతాయి. వివో X90 Pro+ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCపై రన్ అవుతుంది. ఈ సిరీస్‌లోని 3 డివైజ్‌లు కార్ల్ జీస్ లెన్స్‌లతో రానున్నాయి. బేస్ Vivo X90 4,810 mAh బ్యాటరీ, 50 MP మెయిన్ కెమెరాతో రానుంది. Vivo X90 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు సుమారు రూ. 42,500 నుంచి ప్రారంభం కానున్నాయి. Vivo X90 (బేస్ మోడల్) కీలక స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. స్క్రీన్ సైజ్ 6.78-అంగుళాల AMOLED స్క్రీన్, ప్రైమరీ కెమెరా 50MP, RAM/ఇంటర్నల్ స్టోరేజీ : 12-16 GB/512 GB, బ్యాటరీ సామర్థ్యం 4,810mAhతో రానుంది.

Read Also : Best Smartphones in India : మార్చిలో రూ.60వేల లోపు ధరలో సరసమైన టాప్ 3 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!