BGMI iPhone Users : భారతీయ ఐఫోన్ యూజర్ల కోసం బీజీఎంఐ గేమ్.. పాత అకౌంట్‌తో ఇలా లాగిన్ అవ్వండి..!

BGMI iPhone Users : బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) దాదాపు ఒక ఏడాది తర్వాత భారతీయ యూజర్ల కోసం తిరిగి వచ్చింది. iPhone యూజర్లు ఇప్పుడు గేమ్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు మీ ఐఫోన్‌లో BGMIని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? మీ పాత అకౌంట్ యాక్సెస్‌ని ఎలా పొందవచ్చో ఇప్పుడు చూద్దాం..

BGMI iPhone Users : బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) అనేది భారతీయ అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్‌లలో ఒకటి. దేశ మార్కెట్లోకి ఈ గేమ్ తిరిగి వస్తుందా? అని దేశవ్యాప్తంగా ఉన్న ఆన్‌లైన్ గేమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. BGMI జూలై 2022లో భారత్‌లో బ్యాన్ అయింది. దాదాపు ఒక ఏడాది తర్వాత, ఆన్‌లైన్ గేమ్ ఇప్పుడు (Google Play Store), App Store రెండింటిలోనూ అందుబాటులో ఉంది. మే 29న ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ గేమ్ అందుబాటులోకి వచ్చింది, అయితే, ఐఫోన్ యూజర్లు కొంచెం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది.

ఇప్పుడు, మీ ఐఫోన్‌ల ద్వారా గేమ్‌ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే.. ఈ గేమ్ చివరకు యాప్ స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంది. BGMI గేమ్ 2.5 అప్‌డేట్‌తో రూపొందింది. గేమర్‌లకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తోంది. ఈ BGMI గేమ్ ప్లేబిలిటీ ఆకట్టుకునేలా ఉంటుంది, వినియోగదారులను దశలవారీగా లాగిన్ చేసేందుకు అనుమతిస్తుంది. గరిష్టంగా 48 గంటలలోపు వినియోగదారులందరూ లాగిన్ చేసి గేమ్ ఆడుకోవచ్చునని గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also : Thomson India : థామ్సన్ ఇండియా 50 అంగుళాల 4K స్మార్ట్‌టీవీపై అదిరే ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

ఐఫోన్‌లో BGMI ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే? :
మీ ఐఫోన్‌లో BGMIని డౌన్‌లోడ్ చేసేందుకు యాప్ స్టోర్‌కి వెళ్లి BGMI అని టైప్ చేయండి. చాలా కాలంగా మిస్ అయిన BGMI లోగో మీకు కనిపిస్తుంది. ‘Get’పై క్లిక్ చేసి, గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. గేమ్ ఫైల్ సైజ్ దాదాపు 2GB ఉంటుంది. మీ మొబైల్ డేటాను ఉపయోగిస్తుంటే.. డేటా లిమిట్ గుర్తుంచుకోండి. మీకు లిమిటెడ్ డేటా ప్లాన్ ఉంటే.. వైఫై ద్వారా గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమం.

BGMI now available for iPhone users in India, how to download and login with your old account

గేమ్ డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత ఓపెన్‌పై క్లిక్ చేసి యాక్సెస్ చేసేందుకు సూచనల సెట్‌ను ఫాలో అవ్వండి. BGMI అనేది ‘virtual world’ అని మీకు గుర్తు చేస్తుంది. మీ వయస్సు 18 ఏళ్లు దాటిందా లేదా అని అడుగుతారు. BGMI ప్లేటైమ్‌పై లిమిట్‌తో అందిస్తుంది. ఎందుకంటే.. 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న యూజర్లు రోజుకు 3 గంటల పాటు గేమ్‌ను ఆడవచ్చు. మరోవైపు, మిగిలిన ఆటగాళ్లు ప్రతిరోజూ 6 గంటల వరకు గేమ్‌ను ఆడవచ్చు.

మీ పాత అకౌంట్‌కు యాక్సస్ పొందాలంటే? :
ఎల్లప్పుడూ క్రాఫ్టన్ సోషల్ మీడియా అకౌంట్లను గేమ్‌కి లింక్ చేసుకోవచ్చు. యూజర్ల డేటాను సేవ్ చేసేందుకు ప్రొటెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. లాగిన్ చేయకుండా గెస్ట్‌గా గేమ్‌ను ఆడుకోవచ్చు. గేమ్‌ను డిలీట్ చేయడం లేదా డివైజ్‌లను మార్చడం వల్ల మొత్తం డేటాను కోల్పోతారు. ఇంతకుముందు గెస్ట్ గేమ్‌ను ఆడుతూ ఉంటే.. మీ డేటా మొత్తం పోతుంది. మీ పాత అకౌంట్ తిరిగి పొందే మార్గం లేదు. మీ అకౌంట్ సమాచారాన్ని సేఫ్‌గా ఉంచడానికి సపోర్టు ఉన్న సోషల్ మీడియా అకౌంట్లకు మీ గేమ్‌ను లింక్ చేయాలని క్రాఫ్టన్ తెలిపింది. అయితే, మీ అకౌంట్ Facebook లేదా Twitterకి లింక్ చేస్తే.. అదే ఆధారాలతో లాగిన్ చేయడం ద్వారా సులభంగా రీస్టోర్ చేసుకోవచ్చు. గేమ్‌కి లింక్ చేసిన మీ Facebook అకౌంట్ మీ డివైజ్‌లో కూడా లాగిన్ అయి ఉంటే ‘Login with Facebook’పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

Read Also : Lexus GX SUV : 2024 లెక్సస్ GX లగ్జరీ ఫుల్ సైజ్ SUV కారు.. డిజైన్ అదుర్స్.. గ్లోబల్ లాంచ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు