Bill Gates : బిల్ గేట్స్ ఫోల్డబుల్ ఫోన్ వాడుతున్నాడా? మైక్రోసాఫ్ట్ ఫోన్ అయితే కాదు..!

Bill Gates :  ప్రముఖ మైక్రోసాఫ్ట్ దిగ్గజం అధినేత బిల్ గేట్స్ ఏ ఫోన్ వాడుతారో ఎప్పుడైనా ఆలోచించారా? మైక్రోసాఫ్ట్ కంపెనీ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయిగా.. వాడితే బిల్ గేట్స్ సొంత కంపెనీ విండోస్ ఫోన్లే వాడుతారు అంటారు..

Bill Gates : బిల్ గేట్స్ ఫోల్డబుల్ ఫోన్ వాడుతున్నాడా? మైక్రోసాఫ్ట్ ఫోన్ అయితే కాదు..!

Bill Gates Uses A Foldable Phone But It Is Not From Microsoft (1)

Bill Gates :  ప్రముఖ మైక్రోసాఫ్ట్ దిగ్గజం అధినేత బిల్ గేట్స్ ఏ ఫోన్ వాడుతారో ఎప్పుడైనా ఆలోచించారా? మైక్రోసాఫ్ట్ కంపెనీ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయిగా.. వాడితే బిల్ గేట్స్ సొంత కంపెనీ విండోస్ ఫోన్లే వాడుతారు అంటారు.. అంతేనా.. కానీ, ఆయన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫోన్లను వాడటం లేదు. మరి ఏ ఫోన్ వాడుతారు.. ఆపిల్ కంటే కాస్టలీ ఫోన్ ఇంకేం ఉంటుంది.. ఐఫోన్ వాడుతున్నాడు కావొచ్చు అనుకుంటే పొరపాటే.. బిల్ గేట్స్ వాడేది ఫోల్డబుల్ ఫోన్.. అది మాత్రం మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో ఫోన్ (Microsoft Surface Duo) మాత్రం కాదు.. సాధారణంగా ఎవరైనా సొంత కంపెనీకి చెందిన ఫోన్‌ని వాడుతారని భావిస్తారు. కానీ గేట్స్ మాత్రం అందుకు భిన్నంగా మరో కంపెనీ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. Microsoft వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉపయోగించే ఫోల్డబుల్ ఫోన్ (Samsung Galaxy Z Fold 3) శాంసంగ్ కంపెనీది.. సొంత కంపెనీ వదిలేసి శాంసంగ్ ఫోన్ వాడటం ఏంటి అని అందరికి డౌట్ రావొచ్చు.

9to5Google ప్రకారం.. Reddit Ask Me Anything సెషన్‌లో బిల్ గేట్స్ తాను Samsung Galaxy Z ఫోల్డ్ 3ని ఉపయోగిస్తున్నానని చెప్పారు. ‘నా దగ్గర Android Galaxy Z Fold 3 ఉంది. నేను వేరే వాటిని ప్రయత్నిస్తాను. ఈ స్క్రీన్‌తో నేను గ్రేట్ పోర్టబుల్ PC ఫోన్‌తో కనెక్ట్ కాగాలను. అంతే మరేమీ లేదు’ అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. మైక్రోసాఫ్ట్‌తో శాంసంగ్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అందుకే విండోస్‌తో అనుసంధానం వల్లే తాను శాంసంగ్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నారు. ఆపిల్ ఐఫోన్ ద్వారా తాను ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉపయోగిస్తానని గేట్స్ గతంలో వెల్లడించారు. అయితే తాను వాడే డివైజ్ పేరును ప్రత్యేకంగా గేట్స్ వెల్లడించడం ఇదే మొదటిసారిగా చెప్పవచ్చు. Microsoft Surface Duoలో Samsung Galaxy Z Fold 3 తక్కువ ఫీచర్లు ఉన్నాయి.

Bill Gates Uses A Foldable Phone But It Is Not From Microsoft

Bill Gates Uses A Foldable Phone But It Is Not From Microsoft

Samsung Galaxy Z Fold 3 ధర ఎంతంటే? :
Galaxy Z Fold 3 ఫోన్లో 12GB RAM, 256GB స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ ధర రూ. 1,49,999 ప్రారంభమైంది. 512GB స్టోరేజ్‌తో స్టెప్-అప్ ఆప్షన్ ధర సుమారు రూ.1,57,999గా ఉంది. రెండు మోడల్‌లు ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

Samsung Galaxy Z Fold 3 స్పెసిఫికేషన్‌లు
Galaxy Z Fold 3 6.2-అంగుళాల HD+ AMOLED 2X డిస్‌ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఓపెన్ చేస్తే.. ఈ డివైజ్ డిస్‌ప్లే 7.6-అంగుళాలు ఉంటుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. Galaxy Z Fold 3 ఫోన్లో 5nm 64-బిట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చింది. 12GB RAMతో పాటు 256GB, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లతో వచ్చింది. స్మార్ట్‌ఫోన్ Android 11 OSతో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12కి అప్‌గ్రేడ్ అయింది. ఫోల్డబుల్ భాగంలో ఆప్టిమైజేషన్ కోసం.. Galaxy Z Fold 3 ఫ్లెక్స్ మోడ్ ఫీచర్‌లు, మల్టీ-యాక్టివ్ విండో, కొత్త టాస్క్‌బార్ యాప్ పెయిర్‌తో వచ్చింది.

Bill Gates Uses A Foldable Phone But It Is Not From Microsoft (3)

Bill Gates Uses A Foldable Phone But It Is Not From Microsoft

అంతేకాదు.. ఫోన్ అల్ట్రా-వైడ్, వైడ్ యాంగిల్ టెలిఫోటో షాట్‌ల కోసం మూడు 12-MP లెన్స్‌లతో ట్రిపుల్-లెన్స్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ రెండు అండర్ డిస్‌ప్లే సెల్ఫీ షూటర్‌లు ఉన్నాయి. ఒకటి కవర్ డిస్‌ప్లేలో ఉంటే.. మరొకటి లోపల డిస్‌ప్లేలో ఉన్నాయి. కవర్‌పై 10-MP లెన్స్ లోపలి భాగంలో 4-MP లెన్స్ ఉన్నాయి. Galaxy Z Fold 3 ఫోన్‌కి 4400 mAh బ్యాటరీ సపోర్టు అందిస్తుంది. 271 గ్రాముల బరువు ఉండే ఈ ఫోల్డబుల్ ఫోన్.. Galaxy Fold 2 కంటే కొంచెం తక్కువ బరువు ఉంటుంది.

Read Also : Apple Users : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. జూన్‌ 1లోపు ఈ రెండింట్లోకి మారండి.. ఎందుకంటే?