ఇండియాలో బిట్ కాయిన్‌పై ఇన్వెస్ట్ చేయడం తెలుసా? ప్రాసెస్ ఇదిగో

ఇండియాలో బిట్ కాయిన్‌పై ఇన్వెస్ట్ చేయడం తెలుసా? ప్రాసెస్ ఇదిగో

Bitcoin investment in India : బిట్ కాయిన్.. ఇదో క్రిప్టోకరెన్సీ.. అంటే డిజిటల్ రూపంలో కరెన్సీ ఉంటుంది. మార్కెట్లో దీని విలువ కూడా ఎక్కువే. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే బిట్ కాయిన్ బిజినెస్ పాపులర్ అయింది. ప్రస్తుతం ఇండియా మార్కెట్లో కూడా బిట్ కాయిన్ బిజినెస్ ఊపందుకోంటోంది. ఇటీవలే బిట్ కాయిన్ ర్యాలీ మార్కెట్‌ను షేక్ చేసింది. మంచి రాబడి ఉండటంతో రిటైల్ ఇన్వెస్టర్లంతా బిట్ కాయిన్లపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కొన్ని ఏళ్ల క్రితమే బిట్ కాయిన్ మార్కెట్లో పాపులర్ అయినప్పటికీ.. టెకీలకు మాత్రమే పరిమితమైంది. మిగిలిన ఇన్వెస్టరంతా టెకీల మాత్రమే ఫిట్ అవుతుందని అభిప్రాయపడేవారు. ఇప్పుడు అలా లేదు.. అంతా మారిపోయింది. స్టార్టప్ కంపెనీల పెట్టుబడి దారులంతా బిట్ కాయిన్ వైపు మొగ్గు చూపుతున్నారు. క్రిప్టో కరెన్సీలో కాయిన్ స్విచ్ క్యూబర్, వెంచర్ క్యాపిటలిస్టులైన స్టార్టప్ కంపెనీలు సైతం బిట్ కాయిన్ పై పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంతకీ బిట్ కాయిన్ అంటే ఏంటి? అదేలా కొనుగొలు చేయాలి? ఎలా పెట్టుబడి పెట్టాలో అనే అంశాలను ఓసారి తెలుసుకుందాం..

బిట్ కాయిన్ అంటే? :
ప్రపంచంలో బిట్ కాయిన్.. అనేది మొదటి డిజిటల్ కరెన్సీ.. దీన్నే క్రిప్టో కరెన్సీ అని కూడా పిలుస్తారు. ఈ బిట్ కాయిన్ రెండు రకాలుగా వినియోగించుకోవచ్చు. అందులో ఒకటి డబ్బుతో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. రెండోది ఏదైనా వస్తురూపంలో స్టోర్ చేసుకోవచ్చు. బిట్ కాయిన్ అనేది డిసెంట్రలైజడ్ డిజిటల్ కరెన్సీ. దీన్ని ఎవరూ వ్యక్తులు లేదా సంస్థల నియంత్రణలో ఉండదు. అసలు ఈ బిట్ కాయిన్ నెట్ వర్క్ కు ఒక సంస్థ కూడా లేదు.

బిట్ కాయిన్‌లోనే పెట్టుబడి ఎందుకు? :
బిట్ కాయిన్ రూపంలో పెట్టుబడులు పెడితే.. అధిక ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే.. క్రిప్టో కరెన్సీల విలువ అత్యంత వేగంగా పెరిగిపోతుంది. ప్రస్తుత బిట్ కాయిన్ మార్కెట్ విలువ 69శాతంగా ఉంది. దీనికి ఒక ధర అంటూ ఉండదు. ఎప్పటికప్పుడూ మారిపోతుంటుంది. గంటల ఆధారంగా బిట్ కాయిన్ ధర మారిపోతుంటుంది. ఈ బిట్ కాయిన్ ద్వారా తొందరగా అధిక రాబడులు పొందేందుకు పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దశబ్ద కాలంలో బిట్ కాయిన్ ధర జీరో నుంచి 30 లక్షల వరకు పెరిగిపోయింది.

ఎలా ఇన్వెస్ట్ చేయాలి? :
ఇండియాలో బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టాలంటే.. ముందుగా బిట్ కాయిన్ కొనడం గానీ లేదా అమ్మడం గానీ చేయాలి. అలాగే కొన్నిమార్గాల్లో బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టొచ్చు. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఝేంజ్ అనే ప్లాట్ ఫాం ద్వారా బిట్ కాయిన్లపై ఇన్వెస్ట్ చేయొచ్చు. అందులో ప్రధానంగా క్రిప్టో ఎక్స్ఛేంజ్ ద్వారా సులభంగా బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టొచ్చు. డిజిటల్ కరెన్సీలైన బిట్ కాయిన్, ఎథిరియంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజ్ లా మాదిరిగా కాకుండా క్రిప్టో ఎక్స్ఛేంజ్ లు ఎవరివారూ సెల్ఫ్ రెగ్యేలేట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఏడాదంతా 27*7 క్రిప్టో కరెన్సీని ఆపరేట్ చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ద్వారా బిట్ కాయిన్ల షేర్లను కొనుగోలు చేయొచ్చు లేదా అమ్మొచ్చు. ఇండియాలో ఎక్కువగా ఎక్స్ఝేంజ్ ఆఫర్లు ఉంటాయి. కనీస మూలధన అవసరం (మినిమం క్యాపిటల్ రిక్వైర్ మెంట్) కింద తక్కువ రూ.100 నుంచి రూ.500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. దీనిపై చేసే లావాదేవీలపై కొద్ది మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

P2P ట్రాన్సాక్షన్ :
ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించడంపై ఆసక్తి లేదంటే.. కార్పొరేట్ ప్లాట్ ఫాం ద్వారా ఈజీగా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. పీ2పీ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీనిద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

బిట్ కాయిన్లపై పెట్టుబడి ఎంతో సులభం :
ఏదైనా రిటైల్ ఇన్వెస్టర్.. బిట్ కాయిన్లపై సులభమైన మార్గంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. బిట్ కాయిన్లు కొనేసి సింపుల్ గా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఇండియాలో బిట్ కాయిన్ యూజర్ల కోసం ట్రాన్సాక్షన్లపై చాలా ఎక్స్ఛేంజ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ ఆప్షన్ ఎంచుకుంటే ముందుగా సైన్ అప్ కావాల్సి ఉంటుంది. అలాగే KYC ప్రాసెస్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత వివరాలైన పాన్ కార్డు, ఆధార్ కార్డులతో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.

అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు చాలా ఎక్స్ఛేంజ్ వ్యవహారాల్లో కేవైసీ తప్పనిసరి. ఒకసారి ఒక యూజర్ రిజిస్టర్ అయ్యాక.. మీ వ్యాలెట్ లో ఇండియన్ కరెన్సీ రూపంలో నగదును జమ చేయాల్సి ఉంటుంది. బిట్ కాయిన్ కొనేందుకు అవసరమైన మొత్తం నగదును వ్యాలెట్ లో యాడ్ చేయాలి. కనీస మూలధనం (మినమం క్యాపిటల్) రూ.100 నుంచి బిట్ కాయిన్ కొనుగోలు చేయొచ్చు.