BlackBerry : బ్లాక్‌బెర్రీ కమ్‌బ్యాక్.. 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈసారి పక్కా..!

బ్లాక్ బెర్రీ.. ఈ ఫోన్లకు ఉన్న క్రేజే వేరు.. ప్రపంచ మొబైల్ మార్కెట్లో అంతగా పాపులర్ అయ్యాయి. ఈ ఏడాదిలో 5G సపోర్టుతో బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనున్నట్టు తెలిపింది.

BlackBerry : బ్లాక్‌బెర్రీ కమ్‌బ్యాక్.. 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈసారి పక్కా..!

Blackberry 5g Phone Blackberry Set To Make A Comeback In 2022 With 5g Phone

BlackBerry 5G Phone : బ్లాక్ బెర్రీ.. ఈ ఫోన్లకు ఉన్న క్రేజే వేరు.. ప్రపంచ మొబైల్ మార్కెట్లో అంతగా పాపులర్ అయ్యాయి. అప్పట్లో బ్లాక్ బెర్రీ ఫోన్ల కోసం ఎగబడి కొనేశారు. ఆ తర్వాత రానురాను బ్లాక్ బెర్రీ ఫోన్లు కనుమరుగైపోయాయి. బ్లాక్ బెర్రీ ఫోన్లు ఇకలేవు అనుకున్న తరుణంలో.. ఇప్పుడు మళ్లీ ఐకానిక్ బ్లాక్ బెర్రీ ఫోన్లు రీఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈసారి 5G బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో తిరిగి రానున్నాయి. ఐకానిక్ బ్లాక్ బెర్రీ రియు 2022లో ఎంట్రీ ఇవ్వనుందని టెక్సాస్ ఆధారిత సెక్యూరిటీ సొల్యూషన్స్ స్టార్టప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాదిలో 5G సపోర్టుతో బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. రావడం ఆలస్యం కావొచ్చు కానీ… రావడం మాత్రం పక్కా అంటోంది.

బ్లాక్ బెర్రీ బ్రాండ్‌ను తిరిగి తీసుకురానున్నట్టు 2020లోనే టెక్సాస్ సంస్థ, ఆన్‌వర్డ్‌మొబిలిటీ (OnwardMobility) ప్రకటించింది.2021లో 5G స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అయింది. కానీ, ఆ సంవత్సరంలో ఎదురైన సవాళ్లతో అనుకున్నట్టుగా కొత్త బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ తీసుకురావడం జరగలేదని తెలిపింది. ఈ కొత్త ఏడాదిలో బ్లాక్ బెర్రీ 5జీ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆన్ వర్డ్ మొబిలిటీ ఒక ప్రకటనలో తెలిపింది. Black Berry 10 OS లేదా అంతకముందు రన్ అయ్యే అన్ని క్లాసిక్ స్మార్ట్ ఫోన్లకు సపోర్టు నిలిపివేసింది. అనంతరం బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ కంపెనీ మూసివేస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

బ్లాక్ బెర్రీ కీబోర్డ్ ఆన్ వర్డ్ మొబిలిటీతో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ లేటెస్ట్ బ్లాగ్ పోస్టులో తెలిపింది. బ్లాక్ బెర్రీ కమ్ బ్యాక్ అనే సంకేతాన్ని ఇచ్చింది. 5G కనెక్టవిటీతో బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్‌ను 2022 ఏడాదిలో రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. రాబోయే కొత్త 5G బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ Keyboardతో రానుంది. ఈ కొత్త 5G బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ ఫిజికల్ కీబోర్డ్‌ను చేర్చనున్నట్టు తెలిపింది. ఈ 5G ఫోన్ Android ఆధారంగా రూపొందించింది. ఫిజికల్ కీబోర్డ్, 5G కొత్త బ్లాక్‌బెర్రీ ఫోన్ ఎంటర్‌ప్రైజ్-ఫోకస్డ్ సెక్యూరిటీ ఫీచర్లను కూడా యాడ్ చేస్తోంది.

మార్చి 2019లో ప్రారంభమైన ఆన్‌వర్డ్‌మొబిలిటీ, కొత్త బ్లాక్‌బెర్రీ హ్యాండ్‌సెట్‌ను తయారుచేసేందుకు ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ FIH మొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇదివరకే వెల్లడించింది. ఉత్తర అమెరికా, యూరప్‌లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని గతంలోనే వెల్లడించింది. ఈసారి కొత్త 5G- బ్లాక్‌బెర్రీ ఖచ్చితంగా లాంచ్ అవుతుందని వెల్లడించింది. కొత్త ఫోన్ కు సంబంధించి స్పెసిఫికేషన్‌ల వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు. ఈ ఫోన్ కీబోర్డ్‌తో వస్తుందని మాత్రమే ప్రకటించింది. ప్రస్తుతానికి, కంపెనీ ఫోన్ పేరు, స్పెసిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

Read Also : Covid Test Kit : కొవిడ్ హోం టెస్ట్ కిట్లు.. క్షణాల్లో ఫలితాలు.. ఎలా ఉపయోగించాలో తెలుసా?