Block YouTube Channels : దేశంలో 104 యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర సోషల్ అకౌంట్లను బ్లాక్ చేసిన ప్రభుత్వం.. ఎందుకో తెలుసా? అసలు రీజన్ ఇదే..!

Block YouTube Channels : దేశంలో సోషల్ మీడియా అకౌంట్లలో ఏదైనా తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తే అంతే సంగతులు.. అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తిచేసే అకౌంట్లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది.

Block YouTube Channels : దేశంలో 104 యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర సోషల్ అకౌంట్లను బ్లాక్ చేసిన ప్రభుత్వం.. ఎందుకో తెలుసా? అసలు రీజన్ ఇదే..!

Block YouTube Channels _ Govt blocks 104 YouTube channels, several social media accounts for threatening national security

Block YouTube Channels : దేశంలో సోషల్ మీడియా అకౌంట్లలో ఏదైనా తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తే అంతే సంగతులు.. అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తిచేసే అకౌంట్లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. దేశ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేలా నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 104 యూట్యూబ్ ఛానెల్‌లు, 45 వీడియోలు, 4 ఫేస్‌బుక్ అకౌంట్లు, 3 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, 5 ట్విట్టర్ హ్యాండిల్స్, 6 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. ఈ మేరకు సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం.. సోషల్ మీడియా హ్యాండిల్‌లు, ఇతర యూట్యూబ్ ఛానెల్‌లు బ్లాక్ చేసినట్టు ఆయన తెలిపారు.

దేశ సార్వభౌమాధికారంతో పాటు సమగ్రతకు సంబంధించిన కంటెంట్‌కు యాక్సస్ పరిమితం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. నివేదిక ప్రకారం, IT పార్ట్-II నిబంధనల ప్రకారం.. 2021 నుంచి అక్టోబర్ 2022 వరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వెబ్‌పేజీలు, వెబ్‌సైట్‌లు, పోస్ట్‌లు, అకౌంట్లతో సహా 1,643 యూజర్ రూపొందించిన URLలను బ్లాక్ చేయాలని MeitY సోషల్ మీడియా కంపెనీలను ఆదేశించింది. ఈ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అవసరమైతే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు వెనుకాడబోమని కేంద్ర మంత్రి ఠాకూర్ పేర్కొన్నారు.

Read Also :  YouTube Premium Membership : రూ. 10లకే మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం మెంబర్‌షిప్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్!

యూట్యూబ్ ఛానెల్‌లలో, 3 నకిలీ వార్తల అకౌంట్లు, ఆజ్ తక్ లైవ్, న్యూస్ హెడ్‌లైన్స్, సర్కారీ అప్‌డేట్‌లు కూడా బ్లాక్ చేసినట్టు తెలిపారు. ఆజ్ తక్ లైవ్ యూట్యూబ్ పేజీతో సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. YouTube అకౌంట్ టీవీ వార్తా ఛానెల్‌లు, వాటి యాంకర్‌ల ఫొటోలను ఉపయోగించడం ద్వారా వీక్షకులను తప్పుదారి పట్టించింది.

Block YouTube Channels _ Govt blocks 104 YouTube channels, several social media accounts for threatening national security

Block YouTube Channels _ Govt blocks 104 YouTube channels, several social media accounts

దేశంలో చైనీస్ యాప్‌లు, వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు ప్రభుత్వం ఐటీ చట్టంలోని అదే నిబంధనను ఉపయోగించింది. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు వీటిని అడ్డుకుంది. భారత్‌లో నిషేధించిన కొన్ని ప్రసిద్ధ చైనీస్ యాప్‌లలో TikTok, WeChat, PUBG మొబైల్, క్యామ్‌స్కానర్, అలీబాబా, వీబో ఉన్నాయి. క్రాఫ్టన్ లేటెస్ట్ BGMI, భారత్ PUBG మొబైల్ ఎడ్జిస్ట్ చేసిన వెర్షన్ కూడా నిషేధించారు.

ఇదిలా ఉండగా, గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని రూల్ 4(1)(D) ప్రకారం.. ప్రభుత్వానికి ప్రతి నెలా సమ్మతి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 2022లో WhatsApp ‘యూజర్ సేఫ్టీ రిపోర్ట్’ ప్రకారం.. ప్లాట్‌ఫారమ్ 3,716,000 WhatsApp అకౌంట్లను ఏ యూజర్ రిపోర్ట్ చేయక ముందే నిషేధించింది.

WhatsApp మాతృ సంస్థ Meta సమ్మతి నివేదికను రిలీజ్ చేసింది. అంతేకాదు సోషల్ ప్లాట్‌ఫారమ్‌లు, Facebook, Instagram, భారత్‌లో నవంబర్ నెలలో దాదాపు 22.9 మిలియన్ పోస్ట్‌లను తొలగించినట్టు తెలిపింది. ప్రత్యేక సమీక్ష అవసరమయ్యే ఇతర 378 నివేదికలలో తమ విధానాల ప్రకారం కంటెంట్‌ను సమీక్షించినట్టు పేర్కొంది. మొత్తం 218 నివేదికలపై చర్య తీసుకున్నామని, మిగిలిన 160 నివేదికలు సమీక్షలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best Smartwatches in 2022 : 2022 ఏడాదిలో రూ. 5వేల లోపు చౌకైన 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌‌లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ వాచ్ ఇప్పుడే కొనేసుకోండి..!