వావ్..చీపురు బైక్ : రయ్ మని దూసుకుపోతున్న కుర్రాళ్లు

  • Published By: nagamani ,Published On : November 24, 2020 / 12:17 PM IST
వావ్..చీపురు బైక్ : రయ్ మని దూసుకుపోతున్న కుర్రాళ్లు

Brazilian mans ‘broomstick scooters’ meking : చీపురుతో ఏం చేస్తారు? అంటే ఇల్లు తుడుస్తారు లేదా ఇంటికి పట్టిన బూజులు దులుపుతాం. కానీ ఏకంగా చీపురుపై ఏదో మోటర్ బైక్ మీద దూసుకుపోయినట్లుగా వెళ్లగలమా? అంటే..‘‘ఏం ఎందుకు వెళ్లలేం’’అంటున్నారు బ్రెజిల్ కు చెందిని ఇద్దరు ఫ్రెండ్స్. అనటమే కాదు చీపుళ్లపై రయ్ మంటూ దూసుకుపోతున్నారు కూడా..ఏంటీ ఇదేదో హాలీవుడ్ ఫిక్షన్ సినిమా ‘‘హారీ పాటర్’’లాగుందే అనుకుంటున్నారు కదూ..అదేకాదు గానీ దీనికి మాత్రం ఆ సినిమానే ఇన్పిరేషన్ గా కనినిపిస్తోంది.



వివరాల్లోకి వెళితే..మాయలు మంత్రాల స్కూల్ నేపథ్యంతో వచ్చిన హారీపాటర్‌ సీక్వెల్ సినిమాలు చూసే ఉంటారు కదూ. ఆ సినిమాలో చీపురు (మాయలచీపురు) పట్టుకుని గాల్లో ఎగరిపోతారు. అది సినిమా మాత్రమే. కానీ నిజంగా అది జరుగుతుందా? అంటే మాయలు మంత్రాలతో ఎగరలేం గానీ యంత్రంతో చీపురుపై ఎగిరిపోవచ్చని నిరూపించారు బ్రెజిల్ కు చెందిన వినిసియస్‌ సాన్‌క్టస్‌, అలెగ్జాండ్రో రస్సో అనే ఇద్దరు ఫ్రెండ్స్.



చాలామందిలాగానే వీళ్లిద్దరికీ కూడా చిత్ర విచిత్రాల హారీపాటర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో మేజిక్‌ చీపురుతో ఎరిగిపోయే హారీపాటర్‌, అతడి ఫ్రెండ్స్ టీమ్ ని భలే ఎంజాయ్ చేస్తారు వీళ్లు. తాము కూడా అలాంటిదాన్ని తయారు చేయాలని అనేసుకున్నారు. అనుకున్నదే తడవుగా చేసి చూపించేశారు. ఆ చీపురులాంటి పరికరంపై రయ్ మంటూ దూసుకుపోయి అందరి దృష్టిని ఆకర్షించారు.



అచ్చంగా సినిమాలో లాంటి చీపురులాంటి ఓ పరికరాన్ని డిజైన్‌ చేశారు. దాని పేరు ‘నువెమ్‌’. 51 సెంటీమీటర్ల పొడవుంటుంది. నువెమ్‌ను కార్బన్‌ స్టీల్‌తో రూపొందించి ఎలకోట్రస్టాటిక్‌ పెయింటింగ్‌ వేశారు. మధ్యలో కూర్చునేలా ఓ సీటును కూడా ఏర్పాటు చేశారు. దాన్ని ఎలక్ట్రిక్‌ యూనిసైకిళ్లకు బిగించారు. నువెమ్‌ను పైకి అంటే ముందుకు..కిందకి అంటే బ్రేక్‌ పడుతుంది.


సావో పౌలో నగరంలో మిత్రులిద్దరూ ఈ కొత్త యూనిసైకిళ్లను ప్రదర్శించారు. చూసేవాళ్లను భలే గమ్మత్తులో పడేశాయి ఈ చీపురు సైకిళ్లు. ఈ యూనిసైకిళ్లు అమ్మడానికీ సిద్ధంగా ఉన్నాయంటున్నారు ఈ బ్రెజిల్ ఫ్రెండ్స్. గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈ చీపురు బైక్ వెళుతుందని చెబుతున్నారు. వీటి ధర ఒక్కొక్కటీ 4,000 reais ($740 డాలర్లు) అంటే 54 వేలకు పైనే ఉంది.