BSNL ఫైబర్ ప్లాన్ పొడిగించిందోచ్.. ఎప్పటివరకు.. ఏ ప్లాన్ అంటే?

  • Published By: sreehari ,Published On : July 29, 2020 / 08:50 PM IST
BSNL ఫైబర్ ప్లాన్ పొడిగించిందోచ్.. ఎప్పటివరకు.. ఏ ప్లాన్ అంటే?

ప్రభుత్వ టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) రూ .600 భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అక్టోబర్ 27 వరకు పొడిగించింది. ఈ ప్లాన్ అంతకుముందు జూలై 27 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో 300GB 40Mbps హై-స్పీడ్ బ్రౌజింగ్‌తో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సర్వీసులను అందిస్తుంది. డేటా లిమిట్ దాటిన తరువాత, బ్రౌజింగ్ వేగం 2Mbpsకు తగ్గిపోతుంది. ఈ ప్లాన్ ప్రస్తుతానికి ఒడిశా టెలికాం సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.


టెల్కో ఇటీవలే తన రూ. 777 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను 2020 సెప్టెంబర్ వరకు పొడిగించింది. ఈ ప్లాన్ BSNL ఫైబర్ కస్టమర్లకు బ్రాడ్‌బ్యాండ్ వేగాన్ని 50 Mbps వరకు 500GB సరసమైన ధరకే అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ డేటా డౌన్‌లోడ్, అన్ లిమిటెడ్ లోకల్, STD వాయిస్ కాల్‌లు ఆఫర్ చేస్తోంది. ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజుల వరకు ఉంటుంది.


టెల్కో ఇటీవలే కొత్త 100Mbps ప్లాన్‌ను విడుదల చేసింది. 1,400GB లేదా 1.4TB ఫెయిర్ యూజ్ పాలసీ (FUP)ను అందిస్తుంది. ఈ ప్లాన్ BSNL భారత్ ఫైబర్ ప్లాన్‌లకు సరికొత్తది. 90 రోజుల పాటు ప్రవేశపెట్టిన టెల్కో తన మునుపటి 200 Mbps ప్లాన్ విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించింది.

ఈ ప్లాన్ ధర రూ .1,999, యూజర్లు 1.4TB లిమిట్ చేరుకునే వరకు బ్రౌజ్ చేయవచ్చు. పరిమితిని చేరుకున్న తర్వాత, స్పీడ్ 2Mbpsకు తగ్గిస్తుంది. ఈ ప్యాక్ భారతదేశం అంతటా ఏదైనా నెట్‌వర్క్‌కు అన్ లిమిటెడ్ కాల్‌లను అందిస్తుంది.