BSNL Prepaid Plans : BSNL కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్.. బెనిఫిట్స్ ఇవే..!

BSNL స‌రికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. తమ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు రూ.184, రూ.185, రూ.186, రూ.347 ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది.

BSNL Prepaid Plans : BSNL కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్.. బెనిఫిట్స్ ఇవే..!

Bsnl Prepaid Plans Bsnl Introduces New Prepaid Recharge Plans With Unlimited Calls, Data; See All The Benefit Details

BSNL Prepaid Plans : దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL స‌రికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. తమ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు రూ.184, రూ.185, రూ.186, రూ.347 ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్లపై హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, ఫ్రీ ఎస్ఎంఎస్‌లు అందిస్తోంది.

రూ.184, రూ.185, రూ.186 ప్లాన్లపై 28 రోజులు వ్యాలిడిటీ అందిస్తోంది.రూ.347 ప్లాన్‌కు మాత్రం 56 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త రీచార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్లపై అన్ని సర్కిళ్లలో స్పెషల్ టారిఫ్ వోచర్స్ (STVs) అందిస్తోంది.184 ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోక‌ల్, STD, రోమింగ్ వాయిస్ కాల్స్ రోజూ 1GB హైస్పీడ్ డేటా అందిస్తోంది.

100SMS ఉచితంగా ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది.185 ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోక‌ల్ కాల్స్‌, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్‌, రోజూ 1 GB హైస్పీడ్ డేటా, 100 SMS ల‌భిస్తాయి. రూ.184 ప్లాన్‌తో పోల్చితే.. 185 ప్లాన్‌లో PRBT ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు. అలాగే.. అరెనా మొబైల్ గేమింగ్ స‌ర్వీస్‌కు ఫ్రీగా యాక్సెస్ పొందవచ్చు. రూ. 86 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ తోపాటు రోజూ 1GB హైస్పీడ్ డేటా పొందవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల ఉంటుంది. రోజూ 100SMS, 28 రోజుల‌కు PRBT ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. హార్డీ గేమ్స్ స‌ర్వీస్‌కు కూడా ఫ్రీగా క్సెస్ పొందవచ్చు. రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ పొందవచ్చు. అలాగే 100SMS, 2GB హైస్పీడ్ డేటా యాక్సెస్ 56 రోజుల పాటు వ్యాలిడిటీ పొందవచ్చు. హైస్పీడ్ డేటా లిమిట్ ఒకసారి పూర్త‌యితే స్పీడ్ 40Kbps‌కు త‌గ్గుతుంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో కూడా కొత్త ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!