Micro Camera : ఇసుక రేణువంత సైజులో మైక్రో కెమెరా.. రీసెర్చర్ల అద్భుత సృష్టి!

ఈ కెమెరా చూశారా? ఎంత చిన్నదిగా ఉందో... ఇసుక రేణువంత సూక్ష్మంగా ఉంటుంది. అత్యంత చిన్నదైన మైక్రో కెమెరాను క్రియేట్ చేశారు అమెరికా సైంటిస్టులు.

Micro Camera : ఇసుక రేణువంత సైజులో మైక్రో కెమెరా.. రీసెర్చర్ల అద్భుత సృష్టి!

Camera The Size Of A Salt Grain Created By Researchers

Salt Grain Size of Micro Camera : ఈ కెమెరా చూశారా? ఎంత చిన్నదిగా ఉందో… ఇసుక రేణువంత సూక్ష్మంగా ఉంటుంది. అత్యంత చిన్నదైన మైక్రో కెమెరాను క్రియేట్ చేశారు అమెరికా సైంటిస్టులు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ చిన్నపాటి కెమెరాను రూపొందించారు. 5లక్షల రెట్లు పెద్ద లెన్స్‌తో కెమెరా లాంటి ఫొటోలను తీయొచ్చు. అర మిల్లీమీటర్ వెడల్పు ఉండే ఈ కెమెరాను ‘మెటాసర్‌ఫేస్’ అనే టెక్నాలజీతో రీసెర్చర్లు డెవలప్ చేశారు. సుమారు 16 లక్షల సిలిండ్రికల్ పోస్టులను కూర్చడం ద్వారా ఈ మైక్రో కెమెరాను రెడీ చేశారు.

కంప్యూటర్ చిప్‌లను క్రియేట్ చేసిన మాదిరిగానే ఈ కెమెరాను భారీగా డెవలప్ చేయవచ్చునని రీసెర్చర్లు తెలియజేశారు. గతంలో రూపొందించిన మెటాసర్‌ఫేస్‌ కెమెరాలతో పోలిస్తే.. ఇప్పుడు క్రియేట్ చేసిన మైక్రో కెమెరా అనేక రెట్లు క్లారిటీ రెజిల్యుషన్ ఫొటోలను తీయొచ్చు. ఫొటోల్లో వస్తువుల అంచులు కొంచెం బ్లర్‌ అవుతున్నాయి. కానీ, చూడటానికి మాత్రం సాధారణ కెమెరాతో తీసిన ఫొటోలానే మాదిరిగానే ఉన్నాయి. పెద్ద కెమెరా కంటే 5 లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను కూడా ఈ మైక్రో కెమెరా సులభంగా ఫొటోలను తీయగలదని పరిశోధకులు వెల్లడించారు.

ఈ కెమెరాను వైద్యరంగంలో వినియోగించడం ద్వారా అనేక అద్భుతాలు చేయవచ్చునని పరిశోధకులు అంటున్నారు.ఈ మైక్రో కెమెరాలో ఉపయోగించిన ప్రతి ఒక్కటి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) కణాల పరిమాణంలో ఉంటుంది. ప్రతిది ఆప్టికల్ యాంటెన్నాగా పనిచేస్తుంది. ఖచ్చితమైన డిజైన్‌తో రూపొందించారు. సిగ్నల్ ప్రాసెస్ అల్గోరిథం ద్వారా ప్రాసెస్ చేస్తారు. దీని మొత్తం సెటప్‌ను న్యూరల్ నానో-ఆప్టిక్స్‌గా పిలుస్తారు.

Read Also : Omicron Variant : ఇతర దేశాల కంటే భారత్‌లో ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ఉండవచ్చు, కోవిడ్ ఎక్స్‌పర్ట్