ఫోన్‌లోనే ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకోవచ్చు.. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

కరోనా మహమ్మారి కారణంగా మన ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మన చుట్టుపక్కల వనరులతో జాగ్రత్తలు తీసుకోవల్సిన పరిస్థితి వచ్చేసింది. కరోనా కారణంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఫోన్‌లోనే ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకోవచ్చు.. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Carenow Healthcare Develops Mobile App To Monitor Spo2 Pulse Rate

కరోనా మహమ్మారి కారణంగా మన ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మన చుట్టుపక్కల వనరులతో జాగ్రత్తలు తీసుకోవల్సిన పరిస్థితి వచ్చేసింది. కరోనా కారణంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అవసరాన్ని బట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సహాయపడటానికి, చాలా యాప్ డెవలపర్లు హార్ట్ బీట్, ఆక్సిజన్ పల్స్ మరెన్నో కొలవడానికి యాప్‌లను తీసుకుని వస్తున్నారు.



ఈ క్రమంలోనే కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ ఆక్సిజన్ లెవల్స్ తెలుసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంటున్నారు టెక్నాలజీ నిపుణులు.

కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ అంటే..
కేర్‌ప్లిక్స్ హెల్త్‌కేర్(యుఎస్) మరియు కేర్‌నౌ హెల్త్‌కేర్ (ఇండియా) మొదటి ఉత్పత్తి కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్. ఈ యాప్ హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ లెవల్స్ (SpO 2 ) మరియు శ్వాసక్రియ రేటు వంటి విషయాలను పర్యవేక్షించగలదు . కెమెరా మరియు ఫ్లాష్‌లైట్‌ ఉపయోగించి, స్కానింగ్ ద్వారా.. ఆక్సిజన్ రేటు, శ్వాసక్రియ రేటును సులభంగా పరీక్షించవచ్చు.



పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లు పనిచేసే ఫొటోప్లెతీస్మోగ్రఫీ(PPG) ఆధారంగా.. స్మార్ట్‌ఫోన్‌ కెమెరా, ఫ్లాష్‌లైట్‌‌తో ఈ యాప్‌ పని చేస్తుంది. కెమెరా, ఫ్లాష్‌లైట్‌ మీద 40 సెకన్లు వేలిని ఉంచడం ద్వారా SPo2ను లెక్కించవచ్చు. లైట్‌ ఇంటెన్సిటీలో తేడాలను పసిగట్టి PPG గ్రాఫ్‌ను ఈ యాప్‌ సిద్ధం చేస్తుంది. ఈ గ్రాఫ్‌ సాయంతో SPo2 స్థాయి, పల్స్ రేట్‌ తెలుసుకోవ్చని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ చెబుతోంది.

కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్..
హార్ట్ రేట్ మానిటర్ చేయగలదు. ఆక్సిజన్ పల్స్ చూపిస్తుంది. శ్వాస రేటు చూపిస్తుంది.



కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
ఆండ్రాయిడ్ కోసం కేర్‌ప్లిక్స్ వైటల్స్ డౌన్‌లోడ్ –
ఆండ్రాయిడ్ కోసం కేర్‌ప్లిక్స్ వైటల్స్ అనువర్తనం గూగుల్ ప్లే స్టోర్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో లేదు. అయితే, మీరు కేర్‌ప్లిక్స్ వైటల్స్ అధికారిక ను సందర్శించి, APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేర్‌ప్లిక్స్ వైటల్స్ APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, మీరు చేయాల్సిందల్లా వెబ్‌సైట్‌లోని ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్ అనే చోట క్లిక్ చేయడమే..

IOS కోసం కేర్‌ప్లిక్స్ వైటల్స్ డౌన్‌లోడ్ –
IOS పరికరాల్లో కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ డౌన్‌లోడ్ చేయడం చాలా సులభం, మీరు చేయాల్సిందల్లా ఆపిల్ యాప్ స్టోర్‌కు వెళ్లడమే.
సెర్చ్‌లో కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ టైప్ చేసి సెర్చ్ చెయ్యండి..
Carenow హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇండియా) ప్రచురించిన యాప్ ఎంచుకోండి.
విండో తెరిచిన వెంటనే, ఇన్‌స్టాల్ బటన్ నొక్కండి.. కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి.