Children’s Image Rights : తల్లిదండ్రుల్లారా తస్మాత్ జాగ్రత్త.. మీ పిల్లల ఫొటోలను ఇకపై సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు.. ఎందుకో తెలుసా?

Children's Image Rights : ఆన్‌లైన్‌లో పిల్లల ప్రైవసీకి సంబంధించి అనేక కొత్త చట్టాలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులూ తమ పిల్లలకు సంబంధించి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడమే మంచిది.

Children’s Image Rights : ఆన్‌లైన్‌లో పిల్లల ప్రైవసీకి సంబంధించి అనేక కొత్త చట్టాలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులూ తమ పిల్లలకు సంబంధించి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడమే మంచిది. సోషల్ మీడియా వంటి అనేక ఆన్‌లైన్ ప్లాట్ ఫారాల్లో పిల్లల ప్రైవసీ (Child Privacy) ఆందోళనకరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. చాలామంది పేరంట్స్ సరదగా దిగిన తమ పిల్లల ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కానీ, ఇకపై ఇలా చేస్తే చట్టరీత్యా నేరం. అంతేకాదు.. భవిష్యత్తులో తమ సోషల్ అకౌంట్లలో ఎలాంటి పోస్టులు పెట్టకుండా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది.

ఇంతకీ ఇది మనదేశంలో కాదులేండీ.. ఫ్రాన్స్ దేశంలో ఈ కొత్త చట్టం అమల్లోకి రాబోతోంది. పిల్లల హక్కుల (Children’s Image Rights) కు సంబంధించి ఈ కొత్త చట్టం తీసుకురాబోతోంది అక్కడి ప్రభుత్వం. పిల్లల ఫొటోలు లేదా వీడియోలపై మెరుగైన ప్రైవసీని అందించడానికి ఫ్రాన్స్‌లో ఈ కొత్త బిల్లు ఆమోదించింది ప్రభుత్వం. అంటే.. ఫ్రెంచ్ తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా నియంత్రింస్తుంది. ఎంపీ బ్రూనో స్టూడర్ ప్రాతినిధ్యం వహించిన ఈ బిల్లుకు ‘తల్లిదండ్రులకు సాధికారత’ కల్పించడంతోపాటు యువత తమ ఫొటోలపై పూర్తి నియంత్రణను కలిగి ఉండేలా చేస్తుంది. తమ ప్రైవేట్ ఫొటోలపై మరెవరికీ హక్కు ఉండదనే విషయాన్ని సూచిస్తోంది.

Read Also : OnePlus Nord CE 3 Lite : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఫ్రాన్స్‌లో ఇటీవలే ఈ బిల్లును దేశ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు చట్టంగా మారితే.. తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా నిషేధించడానికి కోర్టులను అనుమతిస్తుంది. ఎవరైనా పేరెంట్ ఆన్‌లైన్‌లో తమ పిల్లల ఫొటోలను షేర్ చేసినప్పటికీ.. వారి పిల్లల ఫొటో రైట్స్ తండ్రి, తల్లి ఇద్దరూ సంయుక్తంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Children’s Image Rights _ Parents in France will be liable for punishment if they share photos

అంతేకాకుండా, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రైవేట్ ఫొటోల (Child Private Photos)ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని నిర్ణయించుకుంటే.. వాటిని పోస్ట్ చేయడానికి ముందు పిల్లల వయస్సు, పిల్లలను కూడా ఇందులో ఇన్‌వాల్వ్ చేయవలసి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయడానికి ముందు తల్లిదండ్రులు తమ పిల్లల సమ్మతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు చట్టానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. ఆన్‌లైన్‌లో ఎలాంటి పోస్ట్‌లు చేయకుండా నిషేధానికి గురవుతారు.

బిల్లులోని వివరాల ప్రకారం.. పిల్లల ప్రైవసీ ప్రమాదంలో ఉందనే అంశంపై ప్రతిపాదిత బిల్లు ప్రస్తావనకు వచ్చింది. సాధారణంగా పిల్లల ఫొటోలను షేర్ చేయడం అనేది ప్రాథమికంగా తల్లిదండ్రులు సోషల్ మీడియాలో అకౌంట్లను క్రియేట్ చేస్తుంటారు. అంతేకాదు.. వారి పిల్లల సమాచారాన్ని లేదా ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్స్‌లో ఇలాంటి ఫొటోలను చాలానే చూస్తూనే ఉన్నాం. ఇలా పిల్లల ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేయడం వల్ల పిల్లల అశ్లీలతతో పాటు స్కూళ్లలో తోటి విద్యార్థల నుంచి బెదిరింపులకు కూడా దారితీసే ప్రమాదం ఉంది.

ఇంటర్నెట్‌లో 13 ఏళ్ల పిల్లల సగటు 1,300 ఫొటోలను చూశానని, అతని లేదా ఆమె ప్రైవసీని ప్రమాదంలో పడేస్తుందని ఓ నివేదిక వెల్లడించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ ఫోరమ్‌లలో ఉపయోగించే 50 శాతం ఫోటోగ్రాఫ్‌లు సోషల్ మీడియాలో తల్లిదండ్రులు నిర్వహించే అకౌంట్లలో నుంచే తీసుకున్నట్టు తేలింది. అత్యంత తీవ్రమైన సందర్భాల్లో.. పిల్లల ఫొటో రైట్స్ వినియోగించుకునే నిర్దిష్ట కేసులో తల్లిదండ్రుల తమ అధికారాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ బిల్లును ఇప్పటికీ ఫ్రెంచ్ సెనేట్ ఆమోదించాల్సి ఉంది. అలాగే, దేశ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే దేశంలో ఈ బిల్లు చట్టంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఈ చట్టం ఆ దేశంలో అమల్లోకి రాలేదని గమనించాలి.

Read Also : Netflix Gaming Plans : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అదిరే ఆఫర్.. ఇకపై ప్రతినెలా కొత్త గేమ్స్ ఆడుకోవచ్చు.. కొత్త గేమింగ్ ప్లాన్లు ఇవే..!

ట్రెండింగ్ వార్తలు