Chinese : ఈ ఫోన్లను వాడొద్దా ? MI 10T 5G ఫోన్లపై సందేహాలు!
ఎంఐ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. కొత్తగా వచ్చిన ఎంఐ 10టి 5జీ ఫోన్లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Chinese
Chinese Phones : ఎంఐ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. కొత్తగా వచ్చిన ఎంఐ 10టి 5జీ ఫోన్లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ మొబైల్‌లో ఉన్న సెన్సార్‌షిప్ సామర్థ్యాన్ని ఆఫ్ చేసేసినా.. దానిని మళ్లీ యూజర్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఆన్ చేయవచ్చనే విషయాన్ని యూరోపియన్ యూనియన్ దేశాల్లో గుర్తించారు. ఈ సంచలన విషయాన్ని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది. వినియోగదారులు ఈ ఫోన్లను వాడొద్దని స్పష్టం చేస్తున్నారు అధికారులు.
Read More : Nokia G50 అదిరిపోయే ఫీచర్లతో 5జీ ఫోన్, ధర ఎంతంటే..
చైనాకు సంబంధించిన సమాచారాన్ని సెన్సార్ చేస్తుంది. నేషనల్ సైబర్ సెంటర్ నివేదిక ప్రకారం… షియోమీ స్మార్ట్‌ఫోన్ల ద్వారా సెన్సార్ అయ్యే నిబంధనల జాబితా పెద్దదే ఉంది. మొత్తం 449 నిబంధనలున్నాయి. ఈ ఫోన్లలో డిఫాల్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్‌తో సహా సిస్టమ్ యాప్‌లు చాలానే ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటాయి. సింగపూర్‌లో ఉన్న సర్వర్‌కు ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు షియోమీ ఫోన్లు పంపిస్తున్నట్టుగా గుర్తించింది. ఈ విషయం లిథువేనియా, చైనా మధ్య వివాదం నేపథ్యంలో బయటపడింది.
Read More : Anasuya Bharadwaj : అనసూయ కడితే చీరకే అందమొస్తుంది..
బీజింగ్‌లోని లిథువేనియా రాయబారిని వెనక్కు పిలిపించాలని చైనా డిమాండ్ చేసినప్పటి నుంచి రెండు దేశాల మధ్య వ్యవహారం చెడింది. మరో స్మార్ట్ ఫోన్ హ్యువావీ పి40 5జీ మోడల్‌లో కూడా భద్రతాలోపం ఉన్నట్టు బయటపడింది. ఈ ఫోన్‌లో ఉండే యాప్ గ్యాలరీలో మనకు కావలసిన యాప్ కనిపించకపోతే థర్డ్‌పార్టీ యాప్‌లు ఉండే చోటకు వెళ్లాలంటే సూచిస్తుంది. వీటిలో చాలా వరకు హానికారక యాప్‌లు ఉంటాయి. వాటిని ఇన్‌స్టాల్ చేస్తే మన డాటాకు భద్రత ఉండదని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ పేర్కొంది.