Chrome Users : క్రోమ్ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. మీ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తోంది. క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్ (Chrome Browser) చేసుకోమని సూచిస్తోంది. Google ఇటీవల కొత్త వెర్షన్ 104తో 27 సెక్యూరిటీ లోపాలను పరిష్కరించింది.

Chrome Users : క్రోమ్ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. మీ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

Chrome users must update their browser immediately, Google sends warning

Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తోంది. క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్ (Chrome Browser) చేసుకోమని సూచిస్తోంది. Google ఇటీవల కొత్త వెర్షన్ 104తో 27 సెక్యూరిటీ లోపాలను పరిష్కరించింది. అందుకే క్రోమ్ బ్రౌజర్‌ను అప్ డేట్ చేసుకోమని యూజర్లను కోరుతోంది. క్రోమ్ బ్రౌజర్‌ను మరోసారి అప్‌డేట్ చేయమని కంపెనీ యూజర్లను కోరుతోందని ఓ నివేదిక వెల్లడించింది. ఇప్పుడు, గూగుల్ క్రోమ్‌లో మరో 11 సెక్యూరిటీ పరమైన బగ్స్ గుర్తించారు. అందుకే టెక్ దిగ్గజం తమ క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేయాలని యూజర్లను కోరుతోంది. Google ఇటీవల Chrome రిలీజ్ చేసినట్టు బ్లాగ్ పోస్ట్‌లో కొత్త అప్‌డేట్ వివరాలను ప్రకటించింది.

ఈ కొత్త Chrome వెర్షన్ Mac, Linux కోసం 104.0.5112.101, Windows యూజర్ల కోసం.. (104.0.5112.102/101) ఈ అప్‌డేట్స్ ఇన్‌స్టాలేషన్ చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ క్రోమ్ ప్యాచ్‌లో 11 భద్రతపరమైన లోపాలను ఫిక్స్ చేసినట్టు కంపెనీ తెలిపింది. క్రిటికల్, 6 హై రిస్క్‌గా ఉన్నాయి. మూడు మీడియం రిస్క్ కింద లేబుల్ చేసింది. యూజర్లు తమ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసే వరకు బగ్ వివరాలను కంట్రోల్ చేస్తుంది.

Chrome users must update their browser immediately, Google sends warning

Chrome users must update their browser immediately, Google sends warning

Google ఈ బగ్స్ సంబంధించి వివరాలను వెల్లడించలేదు. కానీ కంపెనీ “CVE-2022-2856 వెర్షన్ లో బగ్ ఉందని గుర్తించింది. ఇప్పుడు ఈ బగ్‌ను హ్యాకర్లు వంటి సైబర్ నేరగాళ్లు తమ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని అర్థం. అందుకే యూజర్లు తమ Chrome బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేయాలని సూచిస్తోంది. ఇప్పుడు, అప్‌డేట్ Mac, Windows, Linux యూజర్ల అందరికి అందుబాటులో ఉంది.

లేటెస్ట్ అప్‌డేట్‌తో బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడానికి యూజర్లకు బ్రౌజర్ రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న మూడు డాట్స్ క్లిక్ చేయండి. Go to Help > go to About Google Chrome > to allow Chrome to look for the new update > అందుబాటులో ఉంటే click on the “relaunch” option క్లిక్ చేయండి.

కొత్త వెర్షన్ అప్‌డేట్ అయ్యేందుకు కొన్ని సెకన్ల సమయం పడుతుంది. పూర్తయిన తర్వాత, మీరు ఓపెన్ చేసిన విండోలతో బ్రౌజర్ మళ్లీ రీలాంచ్ అవుతుంది. మీరు ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ఎనేబుల్ చేసి ఉంటే.. Chrome ఆటోమాటిక్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేస్తుంది. అయితే, దీనికి కొన్ని వారాలు పట్టవచ్చు. ఇప్పుడే అప్‌డేట్ మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Read Also : Google Warn Employees : టార్గెట్ పూర్తి చేయండి.. కష్టపడి పనిచేయకపోతే కోత తప్పదు.. ఉద్యోగులకు గూగుల్ గట్టి వార్నింగ్!