Chromecast : క్రోమ్‌క్యాస్ట్ సపోర్టుతో ఇండియాకు గూగుల్ టీవీ.. ధర ఎంతంటే?
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ భారత మార్కెట్లో గూగుల్ టీవీతో సరికొత్త క్రోమ్‌కాస్ట్ (Chromecast)ను ఆవిష్కరించింది.

Chromecast : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ భారత మార్కెట్లో గూగుల్ టీవీతో సరికొత్త క్రోమ్‌కాస్ట్ (Chromecast)ను ఆవిష్కరించింది. గూగుల్ TV సపోర్టుతో యూజర్లు వివిధ ఓటీటీ యాప్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. అందులో (Apple TV, Disney+ Hotstar, MX Player, Netflix, Prime Video, Voot, YouTube, Zee5) సినిమాలు, షోలు, మరిన్నింటిని యాక్సస్ చేసుకోవచ్చు. గూగుల్ TVతో Chromecast ఈరోజు నుంచి Flipkartలో త్వరలో ఇతర రిటైల్ అవుట్‌లెట్లలో రూ.6,399కి అందుబాటులో ఉంటుంది. గూగుల్ TVతో Chromecast కాంపాక్ట్, అట్రాక్టివ్ డిజైన్‌తో వస్తుంది. TV HDMI పోర్ట్‌లో ఈజీగా ప్లగ్ ఇన్ చేయవచ్చు. ఈ కొత్త Chromecast క్రిస్టల్ క్లియర్ వీడియో స్ట్రీమింగ్‌ను సెకనుకు 60 ఫ్రేమ్‌ల వరకు 4K HDR వ్యూతో అందిస్తుందని Google పేర్కొంది.
డాల్బీ విజన్ సపోర్ట్, HDMI పాస్-త్రూ డాల్బీ ఆడియో కంటెంట్‌ని అందిస్తుంది. గూగుల్ టీవీతో Chromecast వాయిస్ రిమోట్ కూడా అందిస్తుంది. ఈ రిమోట్ సౌకర్యంగా మాత్రమే కాదు.. ఉపయోగించడానికి చాలా సులభమైనదిగా గూగుల్ తెలిపింది. ప్రత్యేకమైన Google అసిస్టెంట్ బటన్‌ను కూడా కలిగి ఉంది. యూజర్లు తమకు అవసరమైనా దాన్ని సెర్చ్ చేసేందుకు సాయపడుతుందని, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. YouTube Musicలో ఇష్టమైన ఆర్టిస్ట్‌ని వారి వాయిస్‌తో ప్లే చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్ యూజర్లు తమ మెంటల్ స్టేటస్ సెట్ చేసేందుకు స్మార్ట్ హోమ్ లైట్లను కంట్రోల్ చేసే ఆప్షన్ కూడా అందిస్తుంది.

Chromecast With Google Tv Launched In India
వాయిస్ రిమోట్‌లో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్‌ల కోసం ప్రత్యేక బటన్‌లు కూడా ఉన్నాయి. గూగుల్ TV మీ కోసం ట్యాబ్ కూడా అందిస్తోంది. ప్రతి ఒక్కరూ చూడాలనుకునే వాటి ఆధారంగా వారి సభ్యత్వాల నుంచి వ్యూ ఇండికేషన్లను అందిస్తుంది. గూగుల్ TV వాచ్‌లిస్ట్ తర్వాత సేవ్ చేయాలనుకునే మూవీలు, షోలను బుక్‌మార్క్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. యూజర్లు తమ టీవీలో ఆటోమాటిక్‌గా వారి ఫోన్ లేదా ల్యాప్‌టాప్ నుంచి వాచ్‌లిస్ట్‌కు యాడ్ చేసుకునే ఆప్షన్ కూడా పొందవచ్చు. గూగుల్ TVతో Chromecastతో 3 నెలల వరకు YouTube Premium ట్రయల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఇందులో మీకు యాడ్స్ లేకుండానే వీడియో కంటెంట్ వీక్షించవచ్చు.
Read Also : Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!