మీ విమానం ఆలస్యమా? చిటికెలో సమాచారం..!

విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక. ‘‘మీరు ప్రయాణించాల్సిన విమానం ఆలస్యంగా రానుంది.. బయల్దేరనుంది’ ఇలాంటి ప్రకటనలు విమానాశ్రయాల్లో తరచూ వింటూనే ఉంటాం. కానీ, ఇకపై విమాన వేళల ముందస్తు సమాచారంపై హైరానా పడాల్సిన అవసరం లేదు.

  • Edited By: sreehari , December 28, 2018 / 09:19 AM IST
మీ విమానం ఆలస్యమా? చిటికెలో సమాచారం..!

విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక. ‘‘మీరు ప్రయాణించాల్సిన విమానం ఆలస్యంగా రానుంది.. బయల్దేరనుంది’ ఇలాంటి ప్రకటనలు విమానాశ్రయాల్లో తరచూ వింటూనే ఉంటాం. కానీ, ఇకపై విమాన వేళల ముందస్తు సమాచారంపై హైరానా పడాల్సిన అవసరం లేదు.

  • త్వరలో అందించనున్న గూగుల్ అసిస్టెంట్..

  • ఎయిర్ లైన్స్ డేటాతో ఎంఎల్ అనుసంధానం..

  • విమానాల స్థితిగతులపై అంచనా.. 

  • గూగుల్ అల్గోరిథమ్స్ సాయంతో స్మార్ట్ ఫోన్లపై ప్రత్యక్షం..

శాన్ ఫ్రాన్సిస్కో: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక. ‘‘మీరు ప్రయాణించాల్సిన విమానం ఆలస్యంగా రానుంది.. బయల్దేరనుంది’ ఇలాంటి ప్రకటనలు విమానాశ్రయాల్లో తరచూ వింటూనే ఉంటాం. కానీ, విమానాలు ఆలస్యం కానున్నట్టు ముందస్తు సమాచారం తెలిసే అవకాశం లేదు. ఇకపై విమాన వేళల ముందస్తు సమాచారంపై హైరానా పడాల్సిన అవసరం లేదు. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్ దిగ్గజం అందిస్తోన్న ‘గూగుల్ అసిస్టెంట్’ మరికొన్నివారాల్లో విమానాల ఆలస్యంపై స్మార్ట్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడూ సమాచారాన్ని అందించనుంది. తద్వారా మిషన్ లెర్నింగ్ (ఎంఎల్)తో అనుసంధానం చేసిన విమాన వేళల సమాచారాన్ని ముందస్తుగానే ప్రయాణికులకు చేరవేయనుంది. మీ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. చకచకా ‘గూగుల్ అసిస్టెంట్’ ద్వారా విమాన స్థితిగతులను సులభంగా తెలుసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ .. గూగుల్ అల్గోరిథమ్స్ సాయంతో విమానాల ఆలస్యంపై అంచనాతో కూడిన సమాచారాన్ని యూజర్లకు చేరవేయనున్నట్టు గూగుల్ పేర్కొంది. 

‘‘ఈ ఏడాదిలో విమానాలు ఆలస్యంపై (గూగుల్ ఫ్లైట్) ద్వారా సమాచారాన్ని చేరవేయడం ప్రారంభించాం. విమానాల ఆలస్యంపై యూజర్లు సెర్చ్ చేసినప్పుడు 85 శాతం మేర కచ్చితమైన సమాచారాన్ని అందించామనే విశ్వాసంతో ఉన్నాం. ఎంఎల్ ద్వారా డేటాను అనుసంధానం చేయడంతో ముందస్తుగానే విమానాల ఆలస్యంపై సమాచారం అందించేందుకు వీలు పడింది’’ అని గూగుల్ మంగళవారం ఓ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ఇప్పటికే ఆలస్యమైన విమానాల సమాచారం అందిస్తోన్న గూగుల్ అసిస్టెంట్.. ఇకపై ఆలస్యం కాబోయే విమానాలకు సంబంధించిన సమాచారం, ఎందుకు ఆలస్యం కానుందో కూడా సమాచారాన్ని చేరవేయనుంది. ఈ సమాచారం తెలుసుకోవాలంటే.. ‘హే గూగుల్.. మై ఫ్లైట్ ఆన్ టైమ్?, హే గూగుల్.. వాట్ ఈజ్ ది అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ స్టేటస్..’’ ఇలా సెర్చ్ చేస్తే చాలు.. అని గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది.