భూమి తిరగడం ఆగిపోనుందా? వేగంలో మార్పు అందుకేనా? అదే జరిగితే ఏమవుతుంది?

భూమి తిరగడం ఆగిపోనుందా? వేగంలో మార్పు అందుకేనా? అదే జరిగితే ఏమవుతుంది?

భూమి తిరగడం ఆగిపోనుందా? భవిష్యత్తులో అదే జరుగబోతుందా? సడన్‌గా భూమి తిరిగే వేగంలో ఎందుకింత మార్పు. అసలేం జరుగబోతోంది. ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? ఏదైనా ప్రళయం ముంచుకొస్తుందా? యుగాంతానికి ఇది సంకేతమా? ఎన్నోన్నో సందేహాలు, భయాలు వెంటాడుతున్నాయి. వాస్తవం ఏదో అవాస్తవం ఏదో తెలుసుకోలేని పరిస్థితి. అంతా అయోమయం.. నెమ్మదిగా తిరుగుతూ ఉండే భూమి ఒక్కసారిగా ఆగిపోతే ఎలాంటి విపత్తులు రాబోతున్నాయినేది అనేక సందేహాలు, అనుమానాలకు తావిస్తోంది. జీవం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఫ్రొఫెసర్ Dave Consiglio చెప్పిన ప్రకారం.. భూమికి అలుపు ఉండదు.. అది ఎప్పటికీ ఆగిపోదు.. ఇది మాత్రం గ్యారెంటీ. ఇప్పటి నుంచి బిలియన్ల ఏళ్ల వరకు కూడా భూమిపై మహాసముద్రాలు ఎండిపోయినా గ్రహం కాలిపోయినా గోళాకరం మారినప్పటికీ కూడా భూమి ఇంకా తిరుగుతూనే ఉంటుంది. సాధారణంగా తిరిగే వస్తువుల్లో శక్తి లేదా ఘర్షణలో మార్పు రానంతవరకు తిరగుతూనే ఉంటాయి. 4.6 బిలియన్లకుపైన ఏళ్ల క్రితం నుంచే భూమి తన అక్షంపైనే తిరుగుతోంది.

సవ్యదిశలో లేదా అపసవ్య దిశలో తిరుగుతుందా? :
భూమి భ్రమణ దిశ పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతోంది. ఉత్తర ధ్రువంపై ఉండి భూ భ్రమణాన్ని చూస్తుంటే.. అది అపసవ్య దిశలో కదులుతున్నట్లు కనిపిస్తుంది.

భూమి ఎందుకు తిరుగుతుంది? :
బిలియన్ ఏళ్ల క్రితమే సౌర వ్యవస్థ ఒక nebula నుంచి పుట్టింది, ఇది గ్యాస్, ధూళి, పెద్ద మేఘంతో కూడినదిగా సైంటిస్టులు చెబుతున్నారు. నెబ్యూలా మొదట ఒక నక్షత్రంగా మారింది. గురుత్వాకర్షణ వలన నక్షత్రం వృత్తాకార కక్ష్యలో కదులుతోంది. అలానే సూర్యుడు, గ్రహాలు కూడా తిరగడం ప్రారంభించాయి.
భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది?:
సైంటిస్టులు చెబుతున్నట్టుగా.. భూమి మన జీవితకాలంలో, లేదా బిలియన్ల ఏళ్ల వరకు కూడా తిరగడం ఆపనే ఆపదు. ఊహించని శక్తి ఏదైనా భూభ్రమణాన్నిపూర్తిగా ఆపగలిగితే మాత్రమే అది అసాధ్యమంటున్నారు. భూమి అకస్మాత్తుగా తిరగడం ఆపివేస్తే వాతావరణం మహాసముద్రాలు వంటివి తిరుగుతూనే ఉంటాయి. మిగతావన్నీ నాశనమైపోతాయి. సాధారణంగా, భూమి అకస్మాత్తుగా తిరగడం ఆగితే భూ ఉపరితలంపై ప్రతిదీ పూర్తిగా నాశనం అవుతుందని అంటున్నారు. చాలా సంవత్సరాల వ్యవధిలో భూమి నెమ్మదిగా తిరుగుతూ ఉంటే, మహాసముద్రాలు ధ్రువాల వైపు కదులుతాయి.

భూమధ్యరేఖ చుట్టూ ఉన్న మహాసముద్రాలు పూర్తిగా ఎండిపోతాయి. ప్రపంచం నీటిలో మునిగిపోతుంది. ప్రతి 24 గంటలకు ఒకసారి భూమి తన అక్షం మీద తిరుగుతుంది. అందుకే మనకు 24 గంటల రోజులు, 1,000mph వేగంతో ప్రయాణిస్తాయి. భూమి దాని అక్షం మీద తిరగడం ఆపివేస్తే.. ఒక రోజు మొత్తం సంవత్సరం పాటు ఉంటుంది. భూమిపై ప్రతిచోటా సూర్యకాంతి పడుతుంది. ఫలితంగా అసలు చీకటే పడదు. 6 నెలల పాటు నిరంతరాయంగా సూర్యకాంతే ప్రసరిస్తుంది.