Apple iPhone 13 : యాపిల్‌ అదిరిపోయే ఆఫర్‌, ఇలా చేస్తే.. ఐఫోన్‌ 13పై రూ.46వేల వరకు తగ్గింపు

యాపిల్ ఇటీవల తమ కొత్త ఐఫోన్ 13 సిరీస్‌ను వర్చువల్ గా లాంచ్ చేసింది. కొత్త మోడల్స్ సెప్టెంబర్ 24 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి.

Apple iPhone 13 : యాపిల్‌ అదిరిపోయే ఆఫర్‌, ఇలా చేస్తే.. ఐఫోన్‌ 13పై రూ.46వేల వరకు తగ్గింపు

Apple Iphone 13

Apple iPhone 13 :  యాపిల్ ఇటీవల తమ కొత్త ఐఫోన్ 13 సిరీస్‌ను వర్చువల్ గా లాంచ్ చేసింది. కొత్త మోడల్స్ iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max సెప్టెంబర్ 24 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి. iPhone-13 ప్రారంభ ధర రూ. 69,900గా ఉంది.

Read More : Volkswagen : భారత రోడ్లపై ‘వోక్స్‌వ్యాగ‌న్ టైగ‌న్ ఎస్‌యూవీ’ పరుగులు

ఆసక్తిగల కొనుగోలుదారులు ట్రేడ్-ఇన్ ను ఎంచుకోవడం ద్వారా MRP కంటే తక్కువ ధరకు ఈ మోడళ్లను పొందవచ్చు. ట్రేడ్-ఇన్ అంటే తక్షణ క్రెడిట్ కోసం ఏదైనా యాపిల్ సూచించిన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్ఛేంజ్‌ చేయడం ద్వారా మీరు కొత్త ఐఫోన్‌ను రూ. 46,000 వరకు తక్కువ ధరలో పొందవచ్చు.

ఇందుకోసం యాపిల్‌ ఆన్‌లైన్‌ షాప్‌ ద్వారా ఐఫోన్‌13 ఫోన్‌ బుక్‌ చేసుకునే ముందు.. కొనుగోలు దారులు ట్రేడ్‌ ఇన్‌ ఆఫర్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. మీరు కరెక్ట్‌గా సమాధానం చెప్పి ఐఫోన్‌ 13 ఫోన్‌ ను బుక్‌ చేసుకోవచ్చు. అనంతరం ఆన్‌లైన్‌లో మీకు ఐఫోన్‌ 13ఫోన్‌ డెలివరీ టైం, డేట్‌ చూపిస్తుంది. ఆ టైం కు ఐఫోన్‌ ప్రతినిధులు ఐఫోన్‌ 13 ఫోన్‌ను మీరు ఇచ్చిన అడ్రస్‌కు డెలివరీ చేస్తారు.

Read More : Nokia G50 అదిరిపోయే ఫీచర్లతో 5జీ ఫోన్‌, ధర ఎంతంటే..

ఎక‍్సేంజ్‌ ఆఫర్లు ఎలా ఉన్నాయి
ట్రేడ్‌ ఇన్‌ ఆఫర్‌లో ఐఫోన్‌ 12ప్రో మ్యాక్స్‌ ఎక్ఛేంజ్‌లో రూ.46,120 వరకు, ఐఫోన్‌ 12 ప్రో పై రూ.43,255, బేసిక్‌ ఐఫోన్‌ 12పై రూ.31,120, ఐఫోన్‌ 12 మినీ పై రూ.25,565, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఫోన్‌ పై రూ.13,085వరకు సొంతం చేసుకోవచ్చు.