జంపింగ్ కారు.. డీజే డాన్సింగ్ మహింద్రా స్కార్పియో సీజ్.. రూ.41,500 ఫైన్

జంపింగ్ కారు.. డీజే డాన్సింగ్ మహింద్రా స్కార్పియో సీజ్.. రూ.41,500 ఫైన్

Dancing Mahindra Scorpio : జంపింగ్ డీజే డాన్సింగ్ స్కార్పియోను పోలీసులు సీజ్ చేశారు. కారు యజమానికి ఏకంగా రూ.41,500 వరకు భారీ జరిమానా వేశారు. డాన్సింగ్ కారుగా మహీంద్రా స్కార్పియో ఎంతో పాపులర్.. మహీంద్రా స్కార్పియో మోడల్‌ను డీజే డాన్సింగ్ కోసం పూర్తిగా మోడిఫై చేసేశారు. రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా రోడ్డుపై కనిపించిన ఈ డాన్సింగ్ కారును పోలీసులు సీజ్ చేశారు.



ప్రస్తుతం పోలీసుల దగ్గరే ఉంది. టిలా మోర్ పోలీసు స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) రాన్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో హిండాన్ ఎయిర్ పోర్ట్ చెక్ పోస్టు దగ్గర ఈ జంపింగ్ మహీంద్రా స్కార్పియోను పట్టుకున్నారు. స్థానికుల నుంచి కూడా కంప్లయింట్స్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఫైన్ విధించారు. ఈ కారును మోడిఫై చేసి పబ్లిక్ రోడ్లపై లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంటూ పోలీసులకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి.


ఫిర్యాదు ఆధారంగా చెక్ పోస్టు దగ్గర తనిఖీలు చేపట్టారు. ఈ స్కార్పియో ఓనర్ వాహనాన్ని పూర్తిగా మోడిఫై చేశారు. మ్యానిఫ్యాక్చరింగ్ నిబంధనలకు విరుద్ధంగా రీ మోడిఫై చేశారు. దాంతో కారు జంప్ చేస్తున్నట్టు ఊగిపోతోంది. బ్రేక్, యాక్సలేటర్ ఉపయోగించి ట్రికీ వేలో మోడిఫై చేసినట్టు పోలీసులు గుర్తించారు. కొన్ని ఏళ్ల క్రితం ఇదే స్కార్పియో రోడ్లపై జంపింగ్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. ఢిల్లీకి చెందిన ఓ యజమాని కారుగా నిర్ధారించారు. అయితే ఆ కారును యజమానే నడిపాడా లేదా ఎవరైనా డ్రైవింగ్ చేశారా? అనేది వెల్లడించలేదు. ఈ జంపింగ్ స్కార్పియోను ప్రత్యేకించి పెళ్లి వేడుకల కోసం ఇలా మోడిఫై చేశారంట..


ఒక్కో మ్యారేజ్ ఫంక్షన్ సమయంలో జంపింగ్ కారుతో డీజే సెట్ చేసేందుకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా సమయం, లొకేషన్ బట్టి ఛార్జ్ ఉంటుంది. పోలీసుల విచారణలో ఈ స్కార్పియో కారుకు సంబంధించి డాక్యుమెంట్లు కూడా సరిగా లేవు. దీనిపై 8 వరకు చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. అందులో రూ.10వలేు నాయిజ్ పొల్యుషన్, రూ.5వేలు సరైన డాక్యుమెంట్ల లేవనే కారణాలతో చలాన్లు ఉన్నాయి.



ఈ ప్రాంతంలో డాన్సింగ్ స్కార్పియో ఇది ఒక్కటి మాత్రమే కాదు.. ఇలాంటి వాహనాలు చాలానే ఉన్నాయంట.. ఇవన్నీ మ్యారేజ్, ఇతర ఈవెంట్ల కోసం వినియోగిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. 2019 సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఇండియాలో మ్యానిఫ్యాక్చర్ వెహికల్ లో వాహన చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి మార్పులు చేసినా అది నేరంగా పరిగణిస్తారు. మోడిఫై చేసిన మహీంద్రా స్కార్పియో కారులో నిబంధనలు, చట్టానికి విరుద్ధంగా అనేక మార్పులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాహనాలపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.