RBI New Rule : ఏప్రిల్ నుంచి క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ ఆటోమేటిక్‌గా అయిపోతుంది

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్ తీసుకొచ్చింది. వచ్చే నెల ఏప్రిల్ నుంచి మొబైల్, యుటిలిటీ, ఇతర బిల్లులన్నీ ఆటో-పేమెంట్ కానున్నాయి. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

RBI New Rule : ఏప్రిల్ నుంచి క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ ఆటోమేటిక్‌గా అయిపోతుంది

Debit Card, Credit Card Auto Payment

Debit card, credit card auto-payment : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్ తీసుకొచ్చింది. వచ్చే నెల ఏప్రిల్ నుంచి మొబైల్, యుటిలిటీ, ఇతర బిల్లులన్నీ ఆటో-పేమెంట్ కానున్నాయి. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రికరింగ్ ట్రాన్సాక్షన్లపై ఇదివరకే ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) లేదా ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ డివైజ్‌లు (PPIs) ఏప్రిల్ 1 నుంచి అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (AFA) తప్పనిసరి కానుంది.

ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. రికరింగ్ ట్రాన్సాక్షన్లపై బ్యాంకులు ముందుగానే వినియోగదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. కస్టమర్ నుంచి ఆమోదం పొందిన తరువాత మాత్రమే ట్రాన్సాక్షన్లు ఇకపై జరుగనున్నాయి. ఈ కొత్త నిబంధన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా వివిధ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభావం పడనుంది. అంటే.. మీ నెలవారీ మెంబర్ షిప్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆటో-పేమెంట్లపై ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త రూల్ ఏంటో ఓసారి చూద్దాం..

1) డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి లేదా వాలెట్ల ద్వారా ఆటో-పేమెంట్లు చేయాలంటే ఏప్రిల్ నుంచి అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (AFA) అవసరం. కార్డుపై e-mandate సదుపాయాన్ని ఎంచుకోవాలనుకునే కార్డ్ హోల్డర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను AFA వ్యాలిడేషన్‌తో పూర్తి చేయాల్సి ఉంటుంది.

2) కార్డులు, వాలెట్ల నుంచి ఆటో-డెబిట్ కోసం లిమిట్ రూ. 5,000గా నిర్ణయించింది. కట్-ఆఫ్ పైన లావాదేవీలపై అదనపు వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) అవసరం.

3) అన్ని రకాల కార్డులను ఉపయోగించి చేసే లావాదేవీలకు ఈ కొత్త నియమం వర్తిస్తుంది. అందులో డెబిట్, క్రెడిట్, యుపిఐ, పిపిఐలు, వాలెట్లకు వర్తిస్తుంది.

4) గతంలోనే 2021 మార్చి 31లోపు AFA ప్రక్రియను ప్రవేశపెట్టాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. 2020 డిసెంబర్ 4న జారీ చేసిన సర్క్యులర్‌లో ఆర్‌బిఐ ఈ విషయాన్ని వెల్లడించింది.

5) కార్డుదారునికి ప్రీ-ట్రాన్సాక్షన్ నోటిఫికేషన్ పంపాలి, అసలు ఛార్జీకి కనీసం 24 గంటల ముందు లేదా కార్డులో డెబిట్ అవ్వాలి. లావాదేవీకి ముందు నోటిఫికేషన్‌ను పంపాలంటే (SMS, ఇమెయిల్, ఆప్షన్ మోడ్‌ను ఎంచుకునే అవకాశం వినియోగదారుకు ఉంటుంది.

6) లావాదేవీని కొనసాగించడానికి, కస్టమర్ సమ్మతి తప్పనిసరి. కార్డుదారునికి నిర్దిష్ట లావాదేవీని నిలిపివేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది.

7) ఏ సమయంలోనైనా e-mandate విత్ డ్రా చేసుకునేందుకు కార్డుదారునికి ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పించాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. రికరింగ్ ట్రాన్సాక్షన్లకు కార్డులపై
e-mandate సదుపాయాన్ని పొందటానికి కార్డుదారు నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు ఉండవు.

8) ఈ కొత్త నిబంధన గురించి బ్యాంకులు తమ కస్టమర్లకు తెలియజేయడం ప్రారంభించాయి. రెగ్యులేటరీ అవసరాలకు అనుగుణంగా, AFA లేకుండా మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులో నమోదు చేసిన రికరింగ్ ట్రాన్సాక్షన్ల కోసం e-mandate ప్రాసెసింగ్ ఏప్రిల్ 1, 2021 నుంచి నిలిచిపోనుంది. ఇకపై బ్యాంకు కస్టమర్లు నేరుగా చెల్లింపులు చేయవచ్చు.