డైనోసర్ల వినాశనానికి ఆస్ట్రారాయిడ్ కాదంట.. తోకచుక్క కారణమంట!

డైనోసర్ల వినాశనానికి ఆస్ట్రారాయిడ్ కాదంట.. తోకచుక్క కారణమంట!

dinosaurs wiped out comet fragment, not an asteroid : 66 మిలియన్ల ఏళ్ల క్రితం భూమిపై సంచరించిన డైనోసర్లు అంతరించిపోవడానికి గ్రహశకలలే కారణమంటున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదంటంటోది ఓ కొత్త అధ్యయనం. మిలియన్ల యేళ్ల క్రితమే మెక్సికో తీర ప్రాంతంలో ఓ అతిభారీ గ్రహశకలం ఒకటి భూమిమీదకి దూసుకొచ్చిందని, దాని ప్రభావంతో డైనోసర్లు అంతరించిపోయాయని వింటున్నాం. నిజానికి.. డైనోసర్ల వినాశానికి ఆస్ట్రరాయిడ్ కాదంట.. తోక చుక్కలని అధ్యయనంలో వెల్లడైంది.

అత్యంత శక్తివంతమైన వేడిని వెదజల్లే తోకచుక్క భూమిపైకి దూసుకొచ్చి డైనోసర్లను అంతం చేసిందని తేలింది. ఏదైనా ఒక గ్రహ శకలం లేదా తోకచుక్క భూమిని తాకితే దాని నుంచి ఉద్భవించే వేడి.. 10 బిలియన్ల హిరోసిమా అణుబాంబుల నుంచి విడుదలయ్యే శక్తికి సమానంగా ఉంటుంది. ఒక్కసారిగా వంద అడుగల ఎత్తున సునామీ కెరటాలు విజృంభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అడవులన్నీ విడుదలైన ఉష్ణానికి కాలిబూడిదై పోతాయి.

అంతటి వేడి కలిగిన ఈ శకలాలతో భూమిపై 75శాతం జీవాలు అంతమైపోయాయి. అందులో డైనోసర్ల జాతి కూడా ఉంది. వివాదాస్పద హార్వార్డ్ అస్ట్రోన్మర్ చెప్పిన ప్రకారం.. ఇదంతా వినాశనం సృష్టించింది ఆస్ట్రరాయిడ్ కాదంట.. కామెట్ ఫ్రాగ్మెంట్ (తోకచుక్క శకలం)మే డైనోసర్ల వినాశానానికి కారణమని అంటున్నారు. సౌర మండలం వెలుపలి ఉండే కామెట్ శకలాలు భూమిపైకి దూసుకొచ్చాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. తోకచుక్క పడిన మెక్సికోలోని Chicxulub ప్రాంతంలో అధిక ప్రభావానికి గురైందని జియోలాజిస్టులు గుర్తించారు. అక్కడి ఆనవాళ్లను సేకరించి పరిశోధనలు జరిపారు.

తోక చుక్క పడిన చోట అత్యంత స్థాయిలో ప్రభావం పడగా.. దాదాపు 10 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వ్యాసం మధ్య వ్యాపించిందని తేలింది. పసిఫిక్ సముద్రంలో పడిన ఈ తోకచుక్క దాని ప్రభావం చుట్టు పక్కల 180 కిలోమీటర్ల వరకు వ్యాపించిందని అంచనా వేస్తున్నారు. తోక చుక్క సృష్టించిన వినాశన ప్రభావంతో డైనోసర్ల జీవనానికి అనువైన వాతావరణాన్ని క్షీణించేలా చేసిందని, దాంతో డైనోసర్లు అంతరించి పోవడానికి అదే కారణమని రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు.