తిక్కరేగిన మెర్సిడెస్-బెంజ్ ఉద్యోగి రివెంజ్.. జేసీబీ ఎత్తుకెళ్లి 50 కోట్ల ఖరీదైన కార్లను ఇలా తొక్కించాడు..!

తిక్కరేగిన మెర్సిడెస్-బెంజ్ ఉద్యోగి రివెంజ్.. జేసీబీ ఎత్తుకెళ్లి 50 కోట్ల ఖరీదైన కార్లను ఇలా తొక్కించాడు..!

Disgruntled Mercedes Benz employee goes on rampage : మెర్సిడెస్-బెంజ్ మాజీ ఉద్యోగికి తిక్కరేగింది.. కోపంతో ఊగిపోతున్న అతడు.. కోట్లాది విలువైన కార్లను జేసీబీతో తొక్కించి ధ్వంసం చేశాడు. అసంతృప్తితో రగిలిపోతున్న 38ఏళ్ల మాజీ ఉద్యోగి.. ఒకప్పుడు పనిచేసిన కంపెనీపై ఇలా రివెంజ్ తీర్చుకున్నాడు.



స్పెయిన్‌లోని మెర్సిడెస్-బెంజ్ కార్ల ఫ్యాక్టరీలోని 69 కార్లను జేసీబీతో తొక్కించాడు. కంపెనీ అసెంబ్లీ లైన్ లో పార్క్ చేసిన దాదాపు 50కు పైగా కొత్త బ్రాండ్ కార్లు నుజ్జునుజ్జుగా మారాయి.

డిసెంబర్ 31 వరకు ఈ కంపెనీలో ఉద్యోగిగా పనిచేశాడు. కంపెనీపై అసంతృప్తితో ఉన్న అతడు.. జేసీబీని దొంగతనం చేసి 18 మైళ్లు (29 కిలోమీటర్లు) డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. జేసీబీతో కార్ల ఫ్యాక్టరీ ఎంట్రీ గేటును ఢీకొట్టి.. 69 కార్లను తొక్కించి ధ్వంసం చేశాడు.



ఉత్తర స్పెయిన్‌లో రాజధాని విక్టోరియాలో ఇండస్ట్రీయల్ ఏరియాలో ఈ మెర్సిడెస్ బెంజ్ కార్ల ఫ్యాక్టరీ ఉంది. బాగా ధ్వంసమైన కార్లను మెర్సిడెస్ బెంజ్ వి క్లాసు వ్యాన్, కొత్త ఎలివేటర్లతో మరోచోటుకు తరలించారు.

ఈ ఘటనకు పాల్పడిన మాజీ ఉద్యోగిపై కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే పోలీసులకు అతన్ని పట్టించింది. ఇదే ఫ్యాక్టరీలో 2016 నుంచి 2017 మధ్య పనిచేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇతడు ఎందుకు ఇలా చేశాడు అనేది మాత్రం ఇంకా తెలియలేదు.



ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక రిపోర్టు ప్రకారం.. మెర్సిడెస్ బెంచ్ ఫ్యాక్టరీలో కార్ల ధ్వంసంతో 1.78 పౌండ్ల నుంచి 4.45 మిలియన్ల పౌండ్ల నష్టం వాటిల్లినట్టు కంపెనీ అంచనా వేస్తోంది. అంటే.. భారత కరెన్సీలో రూ. 50 కోట్ల వరకు ఉంటుంది.