మీ పాత పీఎఫ్ అకౌంట్ ఇలా ట్రాక్ చేయండి.. డబ్బులు డ్రా చేసుకోండి!

మీ పాత పీఎఫ్ అకౌంట్ ఇలా ట్రాక్ చేయండి.. డబ్బులు డ్రా చేసుకోండి!

Track Your Old PF Account : మీ పాత పీఎఫ్ అకౌంట్ గుర్తుందా? అయ్యో అకౌంట్ నంబర్ గుర్తులేదే.. అంటారా? ఏం పర్వాలేదు.. ఆన్‌లైన్‌లో ఈజీగా తెలుసుకోవచ్చు. చాలామంది ఏదైనా ఉద్యోగంలో చేరినప్పుడు పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ అకౌంట్ సంగతే గుర్తుండొదు. పెద్దగా పట్టించుకోరు కూడా. ఎంత ఉంటుందిలే అని వదిలేస్తారు. దాంతో పీఎఫ్ అకౌంట్లో డబ్బు జమ కాకపోవడంతో నాన్ ఆపరేటివ్ అకౌంట్ గా మారిపోతుంది. కానీ, ఏదైనా డబ్బులు అవసరమైనపుడు.. పీఎఫ్ అకౌంట్లో డబ్బు ఉపసంహరించు కోవాలని అనుకుంటారు. అయితే పీఎఫ్ అకౌంట్ ఏంటో తెలియదు.. మరెలా డబ్బులు తీసుకోవడం అని ఆలోచిస్తున్నారా? పీఎఫ్ అకౌంట్లో నగదను ఉపసంహరించుకోవచ్చు.. అదేలానో చూద్దాం..

మీరు చేయాల్సిందిల్లా.. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లండి. అక్కడ మీకు ఒక ఫిర్యాదుల కోసం హెల్ప్ డెస్క్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ ఫిర్యాదును సమర్పించాలి. అవసరమైన మీ వ్యక్తగత వివరాలను ఫిర్యాదులో పొందుపరచాలి. ఏ సంస్థలో పనిచేశారు వంటి కొంత సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే.. మీ పేరు, మొబైల్ నెంబర్, ఐడీ నెంబర్, తండ్రి-భర్త పేరు, సంస్థ గురించి సమాచారం అందులో పొందుపరచాలి. ఈ సమాచారం సాయంతో మీ అకౌంట్‌ను ఈజీగా గుర్తించవచ్చు. ఆ తర్వాత ఏం చక్కా అకౌంట్లో నగదు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.

యాక్టివ్ మోడ్ లో లేని పీఎఫ్ అకౌంట్లలో లావాదేవీలు చేయడానికి వీలుండదని గుర్తించాలి. నాన్ ఆపరేటివ్ పీఎఫ్ అకౌంట్లుగా పరిగణిస్తారు. ఇలాంటి అకౌంట్లలో పాత వడ్డీ క్రెడిట్ కాదు. మూడేళ్ల తర్వాత పీఎఫ్ అకౌంట్లు పనిచేయకపోయినా ఎలాంటి లావాదేవీలు జరపకపోయినా ఏడేళ్ల వరకు వడ్డీని పొందవచ్చు. తర్వాతి ఏడేళ్లలో ఆయా పీఎఫ్ అకౌంట్లను సీనియర్ సిటిజన్ల సంక్షేమ నిధిలో ఉంచుతుంది. ఇందులో మాత్రం కొత్త మొత్తాన్ని మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంది. వడ్డీ రేటు అనేది ఎప్పటికప్పుడూ మారిపోతుంటుంది. 8.5శాతం వడ్డీ రేటుకు పీఎఫ్ అకౌంట్లో నగదు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై మొత్తం డబ్బు ఒకేసారి అకౌంట్లో క్రెడిట్ కావచ్చు.