iPhone Crash Detection Feature : మీ ఐఫోన్‌లో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఉందా? మంచులో స్కీయింగ్‌కు పొరపాటున కూడా వెళ్లొద్దు.. ఎందుకో తప్పక తెలుసుకోండి..!

iPhone Crash Detection Feature : మీరు సాహసవీరులా.. ఎప్పుడు ఏదో ఒక సాహసం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారా? అయితే మంచు పర్వతాల్లో స్కీయింగ్ (Skiing) చేసే సందర్భాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

iPhone Crash Detection Feature : మీ ఐఫోన్‌లో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఉందా? మంచులో స్కీయింగ్‌కు పొరపాటున కూడా వెళ్లొద్దు.. ఎందుకో తప్పక తెలుసుకోండి..!

Don’t go skiing if you have crash detection feature on your iPhone, Here is Why

iPhone Crash Detection Feature : మీరు సాహసవీరులా.. ఎప్పుడు ఏదో ఒక సాహసం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారా? అయితే మంచు పర్వతాల్లో స్కీయింగ్ (Skiing) చేసే సందర్భాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అందులోనూ మీ దగ్గర ఐఫోన్ ఉంటే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించుకోండి. అదేంటీ.. ఐఫోన్ ఉంటే స్కీయింగ్ చేయకూడదా? అని అంటారా? ఐఫోన్ ఉంటే పర్వాలేదు. కానీ, ఆ ఐఫోన్‌లలో క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ (Crash Detection Feature)ను ఎనేబుల్ చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.

కొంతమంది Apple iPhone యూజర్లు సాహసాలు చేసే సమయాల్లో ఈ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఎనేబుల్ చేస్తుంటారు. వాస్తవానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరమైనదిగా చెప్పవచ్చు. ఆపద ఎదురైనప్పుడు ప్రాణాలను రక్షిస్తుంది కూడా. అయినప్పటికీ, స్కీయర్‌లు మాత్రం తమ ఐఫోన్‌లో ఫీచర్ ఎనేబుల్ చేసి ఉంటే మాత్రం వెళ్లకపోవడమే మంచిది. ఇప్పటికీ చాలాసార్లు ఈ ఫీచర్ అధికారులకు తప్పుడు హెచ్చరికలను పంపుతోంది.

Don’t go skiing if you have crash detection feature on your iPhone, Here is Why

Don’t go skiing if you have crash detection feature on your iPhone

Read Also : iPhone 14 Flipkart Offer : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై అదిరే డీల్.. ఫీచర్లు అదుర్స్.. ఇలా చేస్తే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..!

ఈ ఘటనలు శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఎక్కువగా నమోదయ్యాయి. ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro)తో సహా ఐఫోన్ 14 మోడల్‌లతో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ (Crash Detection Feature) అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ ఫీచర్ ఫ్రంట్-ఇంపాక్ట్, సైడ్-ఇంపాక్ట్, ముందు, వెనక ఘర్షణలు, రోల్‌ఓవర్‌లు వంటి తీవ్రమైన కార్ క్రాష్‌లను గుర్తించడానికి రూపొందించారు. Utah న్యూస్ సైట్ KSL ప్రకారం.. అమెరికాలోని పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కారణంగా స్కీయర్‌ల నుంచి ప్రమాదవశాత్తూ అత్యవసర కాల్స్ పెరిగినట్టు గుర్తించారు. మిగతా సందర్భాల్లో కన్నా స్కీయింగ్ రిసార్ట్‌లలో అధికారులకు తప్పుగా హెచ్చరికలు పంపుతోంది.

ఈ ఆపిల్ వాచ్ (Apple Watch) లేదా ఐఫోన్ (iPhones) యజమాని తీవ్రమైన క్రాష్‌కు గురయ్యారని లేదా వారు కారు ప్రమాదంలో చిక్కుకున్నారని ఈ ఫీచర్ ద్వారా కాల్ వస్తుందని సమ్మిట్ కౌంటీ డిస్పాచ్ సెంటర్ సూపర్‌వైజర్ సుజీ చెప్పారు. వాస్తవానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ.. స్కీయింగ్ చేసే సమయంలో ఈ ఫీచర్ వెంటనే యాక్టివేట్ అయి మెసేజ్ వెళ్లిపోతుంది. అప్రమత్తమైన అధికారులు వెంటనే లొకేషన్ చేరుకోగానే అక్కడ ఎలాంటి సమస్య ఉండదు. అక్కడి వారు.. నన్ను క్షమించండి, నేను స్కీయింగ్ చేస్తున్నాను. అంతా బాగానే ఉందని చెబుతుంటారని అధికారులు పేర్కొన్నారు.

Don’t go skiing if you have crash detection feature on your iPhone, Here is Why

Don’t go skiing if you have crash detection feature on your iPhone

ఆపిల్ టెక్నాలజీ నుంచి తమకు ప్రతిరోజూ మూడు నుండి ఐదు అత్యవసర కాల్‌లు వస్తాయని అధికారి ఒకరు వెల్లడించారు. ఆసక్తికరంగా.. తమకు వచ్చిన కాల్‌లు ఏవీ నిజమైనవి కావని వెల్లడించారు.బటర్‌ఫీల్డ్ నివేదించిన ప్రకారం.. వినియోగదారులు ఎప్పుడు కాల్ చేశారో తెలియకపోవచ్చు. ఒక వ్యక్తి కింద పడిపోయినట్లు ఆపిల్ ఐఫోన్ (Apple iphone) గ్రహించినప్పుడు.. అలారం సౌండ్‌తో స్క్రీన్‌పై మెసేజ్ కనిపిస్తుంది. వినియోగదారులు నిజంగా కిందకు పడిపోయి ఉండకపోతే.. ఆ మెసేజ్ కనిపించిన వెంటనే వార్నింగ్ డిలీట్ చేయవచ్చు. కానీ, వారు 20 సెకన్లలోపు రియాక్ట్ కావడంలో విఫలమైతే మాత్రం.. సమీపంలోని అత్యవసర కేంద్రాలకు ఆటోమాటిక్‌గా వాయిస్ మెసేజ్ వెళ్లిపోతుంది.

అయినప్పటికీ, ఆపిల్ ఇప్పుడు బీటా వెర్షన్‌ (Beta Version)లో ఒక ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. మీరు మీ ఐఫోన్‌లో ఉద్దేశపూర్వకంగా ఎమర్జెన్సీ SOSని ట్రిగ్గర్ చేశారా? లేదా అని అడిగే మెసేజ్ ఐఫోన్ యూజర్లకు పంపుతుంది. Settings > Emergency SOSలో తీవ్రమైన కార్ క్రాష్ తర్వాత మీరు Apple నుంచి వార్నింగ్స్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ కాల్‌లను OFF చేయవచ్చు.. మీ డివైజ్‌లో క్రాష్‌లను గుర్తించడానికి మీరు థర్డ్-పార్టీ యాప్‌లను రిజిస్టర్ చేసి ఉంటే.. వాటికి కూడా అలర్ట్ వెళ్తుందని ఆపిల్ బ్లాగ్‌లో పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Satellite Feature : మంచులో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఐఫోన్ 14 శాటిలైట్ ఫీచర్.. అదేలా సాధ్యపడిందో తెలిస్తే షాకవుతారు..!