5G Services Near Airports : జియో, ఎయిర్‌టెల్‌లకు DoT ఆదేశాలు.. సమీప ఎయిర్‌పోర్టుల్లో 5G సర్వీసులను ఇన్స్టాల్ చేయొద్దు.. అసలు రీజన్ ఇదే..!
5G Services Near Airports : దేశంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రముఖ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel)తో సహా టెలికాం ఆపరేటర్లు దేశమంతటా తమ 5G నెట్వర్క్ కవరేజీని అందిస్తున్నాయి.

DoT asked Jio, Airtel to not install 5G services near airports_ everything you need to know
5G Services Near Airports : దేశంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రముఖ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel)తో సహా టెలికాం ఆపరేటర్లు దేశమంతటా తమ 5G నెట్వర్క్ కవరేజీని అందిస్తున్నాయి. 5G సర్వీసులు ఇప్పుడు ఢిల్లీ, ముంబై, వారణాసి, అనేక ఇతర భారతీయ నగరాల్లో అందుబాటులో ఉంది. కానీ, 5G-రెడీ నగరాల్లోనే కాదు.. విమానశ్రయ సమీప ప్రాంతాలలో నివసించే యూజర్లకు కూడా 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
అయితే పూర్తి స్థాయిలో 5G సర్వీసులు అందుబాటులోకి రావాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. నివేదికల ప్రకారం.. విమానాశ్రయాల దగ్గర 5G బేస్ స్టేషన్లను ఇన్స్టాల్ చేయవద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) టెల్కోలను కోరింది. ఈ మేరకు DoT టెలికాం ఆపరేటర్లకు ఒక లేఖ పంపింది. 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో 3.3-3.6 Ghz బ్యాండ్‌లో 5G బేస్ స్టేషన్లను ఇన్స్టాల్ చేయవద్దని కోరింది. బఫర్ ఏరియా రన్‌వే రెండు చివరల నుంచి భారతీయ విమానాశ్రయాల రన్‌వే మధ్య రేఖ నుంచి 910 మీటర్లు కప్పబడి ఉండాల్సిందిగా సూచించింది.

DoT asked Jio, Airtel to not install 5G services near airports
రన్‌వే రెండు చివరల నుంచి 2,100 మీటర్లు, భారతీయ విమానాశ్రయాల రన్‌వే మధ్య రేఖ నుంచి 910 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో 3,300-3,670 MHzలో 5G/ IMT బేస్ స్టేషన్లు ఉండకూడదని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSPలు) సూచిస్తున్నట్టు DoT అధికారిక లేఖలో పేర్కొంది. 5G ఉద్గారాలు రేడియో ఆల్టిమీటర్లకు అంతరాయం కలిగించకుండా ఉండేలా 5G బేస్ స్టేషన్ల కిందికి వంగి ఉండేలా చూసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 5G బ్యాండ్ గురించి ఆందోళనలను లేవనెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బహుశా, విమానాలలో రేడియో ఆల్టిమీటర్, GPSకి అంతరాయం కలిగించవచ్చు. ముఖ్యంగా పాత పాతకాలపు విమానాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

DoT asked Jio, Airtel to not install 5G services near airports
విమానయాన మంత్రిత్వ శాఖ టెలికాం ప్రొవైడర్లకు బఫర్, సేఫ్టీ జోన్ స్కెచ్‌ను కూడా అందించింది. విమానాశ్రయంలో, చుట్టుపక్కల C-బ్యాండ్ 5G స్పెక్ట్రమ్‌ను అమలు చేసే సమయంలో ఆయా చర్యలను వెనక్కి తీసుకోవాలని కోరింది. ఇప్పటికే ఉన్న డివైజ్‌లకు కొత్త, అప్డేట్ చేసిన వేరియంట్లతో రీప్లేస్ చేసేందుకు కొంత సమయం కావాలని కోరారు. ఈ సంవత్సరం ప్రారంభంలో 5G నెట్వర్క్ విమానాలకు అంతరాయం కలిగిస్తుందనే ఆందోళన అంతర్జాతీయంగా లేవనెత్తింది.
యూఎస్ ఏవియేషన్ రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. విమానం రేడియో ఆల్టిమీటర్‌తో 5G ఇంట్రాక్షన్ ద్వారా విమాన ఇంజిన్, బ్రేకింగ్ సిస్టమ్‌లను ల్యాండింగ్ మోడ్‌కి మార్చకుండా నిరోధిస్తుందని తెలిపింది. అందుకే విమానాశ్రయ సమీప ప్రాంతాల్లో 5G బేస్ స్టేషన్లను ఇన్ స్టాల్ చేయరాదని డాట్ టెలికం కంపెనీలకు సూచించింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..