5G Trials: గ్రామీణ ప్రాంతాల్లో 5జీ టెస్టులకు టెలి కమ్యూనికేషన్ గ్రీన్ సిగ్నల్

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) గ్రామీణ ప్రాంతాల్లో 5జీ టెక్నాలజీపై ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది. దాంతో పాటు నగరాల్లోనూ పర్మిషన్ కోసం టెస్టులు నిర్వహిస్తారు.

5G Trials: గ్రామీణ ప్రాంతాల్లో 5జీ టెస్టులకు టెలి కమ్యూనికేషన్ గ్రీన్ సిగ్నల్

5g Trials (1)

5G Trials: డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) గ్రామీణ ప్రాంతాల్లో 5జీ టెక్నాలజీపై ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది. దాంతో పాటు నగరాల్లోనూ పర్మిషన్ కోసం టెస్టులు నిర్వహిస్తారు. Bharti Airtel, Reliance Jio, Vodafone Ideaలు దేశంలో ఆరు నెలల పాటు ట్రయల్ స్ప్రెక్ట్రమ్ నిర్వహించనున్నాయి.

ఢిల్లీ రాష్ట్రానికి చెందిన MTNL రూ.5వేలు చెల్లిస్తే ఆరు నెలల ట్రయల్ స్ప్రెక్ట్రమ్ కు అనుమతులు ఇస్తారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జీ అప్లికేషన్ పనిచేస్తున్న తీరును టెస్టు చేయాలని కోరాయి. MTNL ఓ టీంలా ఏర్పడి ఢిల్లీలో 5జీ ట్రయల్స్ నిర్వహించాయి. వాళ్లు ఫీజు చెల్లిస్తే ట్రయల్ స్ప్రెక్ట్రమ్ కు పర్మిషన్ వస్తుంది.

Delhi, Mumbai, Kolkata, Bengaluru, Gujarat, Hyderabad వంటి ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహిస్తారు. భారతీ ఎయిర్‌టెల్ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరులలో ట్రయల్స్ నిర్వహించనుంది. ఢిల్లీ, ముంబై, గుజరాత్, హైదరాబాద్ లలో ట్రయల్స్ నిర్వహించేందుకు జియో అప్లై చేసుకుంది.

ట్రయల్స్ కోసం ఆరు నెలల గడువు ఇచ్చినా.. ఏర్పాట్లన్నీ సమకూర్చుకునేందుకు 2నెలల సమయం పడుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) లెక్కల ప్రకారం.. 4జీ కంటే పది రెట్లు బెటర్ డౌన్ లోడ్ స్పీడ్ 5జీ సర్వీసులో అందుతుందని అంచనా.