Electric Two-Wheelers : కొత్త టూ-వీలర్ కొంటున్నారా? ఈ-బైకులపై భారీగా తగ్గనున్న ధరలు!

కొత్త టూవీలర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఎలక్ట్రానిక్ టూవీలర్ల కోసం చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి.

Electric Two-Wheelers : కొత్త టూ-వీలర్ కొంటున్నారా? ఈ-బైకులపై భారీగా తగ్గనున్న ధరలు!

Electric Two Wheelers

Electric Two-Wheelers Affordable : కొత్త టూవీలర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఎలక్ట్రానిక్ టూవీలర్ల కోసం చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలను ప్రోత్సహించే దిశగా సబ్సిడీ స్కీమ్‌ FAME II స్కీమ్‌లో కేంద్రం సవరణ చేసింది. ఈ సవరణ కింద ఎలక్ట్రానిక్ టూవీలర్లపై భారీగా రాయితీలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లపై ఇదివరకు సబ్సిడీ రేటు ఒక KWhకు రూ.5 వేలు నుంచి ఉండేది.

ఇప్పుడు ఈ సబ్సిడీని రూ.15 వేలుకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ISE వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఖరీదైనవే.. ఎలక్ట్రానిక్ వాహనాల ధర రూ.20 వేలు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాలపై సబ్సిడీని పెంచింది. అంటే.. ఈ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ బైకుల ధరలు తగ్గడం ద్వారా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ టూవీలర్ల వినియోగం పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోనే తొలి ఈవీ మేకర్, బెంగళూరు ఆధారిత తయారీ కంపెనీ (Ather Energy) ఏథర్ ఎనర్జీ సబ్సిడీ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది.

FAME-II సబ్సిడీ సవరణ తర్వాత 450X వెహికల్‌ను రూ.14,500 తగ్గింపు ధరతో కొనుగోలు చేసుకోవచ్చునని పేర్కొంది. ఈ ప్రయోజనాన్ని ఏథర్ 450 ప్లస్‌కు అందిస్తోంది. ఈ మోడల్ ఈ-బైక్ ప్రారంభ రూ.1.35 లక్షల మార్క్ (ఎక్స్-షోరూం)తో కలిపి ఉంది. ఎలక్ట్రానిక్ స్కూటర్లపై కూడా ఏథర్ కంపెనీ కొత్త ధరలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ టూవీలర్ వాహనాల ధరపై 40శాతం వరకు ఇన్సెంటివ్ లను అందించనుంది. ఎలక్ట్రానిక్ స్కూటర్లను సింగిల్ ఛార్జ్‌తో కనీసంగా 80కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 250watt మోటార్‌తో టాప్ స్పీడ్ 40kmph మాత్రమే ఉంటుంది.