Elon Musk : ట్విట్టర్ ఉద్యోగులతో మస్క్ మీట్.. 10 నిమిషాలు ఆలస్యంగా.. హోటల్ కిచెన్ నుంచే స్పీచ్..!
ప్రపంచ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ బ్లాగ్ ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తొలిసారిగా ట్విట్టర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.

Elon Musk : ప్రపంచ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ బ్లాగ్ ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తొలిసారిగా ట్విట్టర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. మస్క్ గురువారం జరిగిన అంతర్గత సమావేశానికి దాదాపు 10 నిమిషాలు ఆలస్యంగా హాజరయ్యారు. అది కూడా తన హోటల్ వంటగది నుంచి.. తాను మీటింగ్ హాజరైన సమయంలో బ్యాక్ గ్రౌండ్‌లో కిచెన్ స్పేస్ స్పష్టంగా కనిపించింది. అందులోనూ మస్క్ తన స్మార్ట్‌ఫోన్ ద్వారా సమావేశానికి లాగిన్ అయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
మరో నివేదిక ప్రకారం.. మొత్తం సమావేశంలో మస్క్ ఇంటర్నెట్ కనెక్షన్ పదేపదే అంతరాయం కలిగింది. అతని ఆడియో కూడా సరిగా వినిపించలేదని నివేదిక తెలిపింది. ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను కలవడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో మస్క్.. ఒప్పందం ఆఫర్ చేసినప్పటి నుంచి ట్విట్టర్ సిబ్బంది అడిగిన అనేక ప్రశ్నలను పరిష్కరించారు. ఈ సందర్భంగా మస్క్ ప్రసంగిస్తూ.. ఉద్యోగుల తొలగింపులు, వర్క్ ఫ్రమ్ హోం నుంచి ఆఫీసులకు తిరిగి రావడం, ట్విట్టర్‌లో యాడ్స్, మైక్రోబ్లాగింగ్ సైట్‌ను మరింత మెరుగుపరిచేందుకు తన మనస్సులో ఉన్న అనేక ఇతర భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన వివరాలను మస్క్ ఉద్యోగులతో పంచుకున్నాడు.

Elon Musk Appears 10 Minutes Late For Twitter Meeting, Attends It From A Hotel Kitchen
మస్క్ ట్విటర్ టేకోవర్ చేసినప్పటి నుంచి కంపెనీ ఉద్యోగుల్లో ఒకటే ఆందోళన.. ఉద్యోగ భద్రత.. భవిష్యత్తులో ట్విట్టర్‌లో ఉద్యోగులను తొలగిస్తారని మస్క్ ప్రత్యేకంగా చెప్పలేదు. కంపెనీ ఆర్థికంగా ఎదగాలంటే మాత్రం ఖర్చును కూడా తగ్గించాలని బిలియనీర్ చెప్పారు. భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఉండవచ్చని బహుశా సూచనగా కనిపిస్తోంది. ఉద్యోగుల కోతలో కొంత హేతుబద్ధీకరణ అవసరమని, లేదంటే భవిష్యత్తులో ట్విట్టర్ వృద్ధి చెందదని ఆయన అన్నారు. ఇందులో టెస్లా CEO అయినా కావొచ్చు.. సిగ్నిఫికేషన్ కంట్రిబ్యూటర్ అయిన ఎవరైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మస్క్ స్పష్టం చేశారు.
ట్విట్టర్ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు తిరిగి రావాలా అని అడిగిన ప్రశ్నను కూడా మస్క్ సమాధానమిచ్చాడు. ఆఫీసు నుంచి పని చేయడాన్నే తాను ఎక్కువగా ఇష్టపడతానని తెలిపాడు. అయితే.. అద్భుతమైన ట్విట్టర్ ఉద్యోగులు ఇంటి నుంచి పనిని కొనసాగించవచ్చని మస్క్ చెప్పారు. ఎవరైనా రిమోట్‌గా మాత్రమే పని చేయగలిగితే.. అలాంటివారిని ఉద్యోగంలో నుంచి తొలగించడం సమంజసం కాదని బిలియనీర్ సమావేశంలో వెల్లడించారు.
ఈ నెల ప్రారంభంలో మస్క్ టెస్లా ఉద్యోగులకు రిమోట్ వర్క్ ఇకపై ఆమోదయోగ్యం కాదంటూ ఈమెయిల్ పంపారు. ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలని లేదా ఉద్యోగాన్ని కోల్పోతారని ఆయన స్పష్టంగా చెప్పారు. రిమోట్ పని చేయాలనుకునే ఎవరైనా తప్పనిసరిగా వారానికి కనీసం 40 గంటలు టెస్లా నుంచి ప్రారంభం కావాలి.. ఉద్యోగులు పనిచేసే ఆఫీసు అనేది ఒక ప్రధాన టెస్లా ఆఫీసు అయి ఉండాలన్నారు. ఉద్యోగ విధులతో సంబంధం లేని రిమోట్ బ్రాంచ్ కార్యాలయం కాదన్నారు.
Read Also : Elon Musk: అలా చేయకుంటే డీల్ రద్దు చేసుకుంటా.. ట్విట్టర్‌కు ఎలన్ మస్క్ వార్నింగ్
- Ukraine vs russia war: నేను బతకడం దాదాపు అసాధ్యం.. ఎలాన్ మస్క్‌కు నా ట్వీట్‌ను చేరవేయండి..
- Elon Musk: తాజ్‌మహల్‌ను గుర్తుచేసుకున్న ఎలాన్ మస్క్.. ఇండియా టూర్ ఖరారైందా?
- Twitter Employees : ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన.. జాబ్ మానేస్తారా?.. పోతే పోండి.. డోంట్ కేర్ అంటున్న మస్క్..!
- Elon musk: ఎలన్ మస్క్‌కు భారీ షాక్.. పడిపోయిన టెస్లా షేర్లు
- Twitter Employees : ఇంట్లో చేసింది చాలు.. ఈ నెల 15 నుంచి ఆఫీసులకు రావాల్సిందే..!
1Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..
2Donation Boxes: పాక్ సంస్థకు భారత్‌లో విరాళాల సేకరణ
3Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
4Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
5Imran Khan: అమెరికా కుట్ర ఆరోపణలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్షమాపణ
6Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
7PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
8Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
9Moose Wala Shooters: సిద్ధూను హత్యచేసిన తరువాత కారులో సంబరాలు చేసుకున్న హంతకులు.. వీడియో వైరల్
10Woman Suicide: మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!