Twitter Blue: ఐఫోన్ యూజర్లకు ట్విట్టర్ షాక్.. ‘బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్’ ధర పెరిగే ఛాన్స్?

‘బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్’ పొందాలంటే వినియోగదారులు ప్రతి నెలా డబ్బులు చెల్లించేలా ఎలన్ మస్క్ కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో మస్క్ ఈ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు పెంచబోతున్నాడు.

Twitter Blue: ఐఫోన్ యూజర్లకు ట్విట్టర్ షాక్.. ‘బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్’ ధర పెరిగే ఛాన్స్?

Twitter Blue: ట్విట్టర్ తన చేతికి వచ్చినప్పటి నుంచి ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు వినియోగదారుల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఆయన ప్రీమియం బ్లూటిక్ వెర్షన్ పేరుతో తీసుకొచ్చిన ‘ట్విట్లర్ బ్లూ’ సబ్‌స్క్రిప్షన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

Elon Musk: ఎలన్ మస్క్‌కు షాక్.. తగ్గిపోతున్న సంపద.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి పడిపోయిన మస్క్

దీని ప్రకారం వినియోగదారులు ‘బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్’ పొందాలంటే ప్రతి నెలా డబ్బులు చెల్లించాలి. గతంలో దీని కోసం ప్రతి నెలా 6.99 అమెరికన్ డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించాడు. తర్వాత అనేక విమర్శల నేపథ్యంలో దీన్ని తాత్కాలికంగా రద్దు చేశాడు. త్వరలోనే కొత్త వెర్షన్ తీసుకొస్తామని ప్రకటించాడు. త్వరలో రానున్న ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో మస్క్ కొన్ని మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. తాజా ఆలోచన ప్రకారం.. ఐఫోన్‌లో ట్విట్టర్ బ్లూ టిక్ కోసం యాప్ ద్వారా నేరుగా డబ్బు చెల్లించే వారి నుంచి 11 డాలర్లు, వెబ్‌సైట్ ద్వారా చెల్లించే వారి నుంచి 7 డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఆండ్రాయిడ్ ఫోన్లపై ఛార్జీల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయడం లేదు.

BCCI: టీమిండియా కొత్త షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. హైదరాబాద్‌, వైజాగ్‌లో వన్డే మ్యాచ్‌లు

యాపిల్ సంస్థ తన ప్లాట్‌ఫామ్ ద్వారా వివిధ యాప్స్‌కు చెల్లించే డబ్బులపై అదనపు ఛార్జి విధించాలని ఆ సంస్థ నిర్ణయించింది. దీని ప్రకారమే ఐఓఎస్ డివైజ్‌లపై ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయాలని మస్క్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో లేవు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.